హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతి అంటే..: అర్థం చెప్పిన బాబు, స్విస్ ఛాలెంజ్ రూపంలో రాజధాని

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రపంచంలోనే అరుదైన ప్రాంతమని టీడీపీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం అన్నారు. గండిపేటలో నిర్వహిస్తున్న మహానాడులో ఆయన గురువారంసాయంత్రం మాట్లాడారు. రాజధానిపై చర్చ నిర్వహించారు.

అమరావతి అంటే మృత్యువు లేని ప్రదేశం అని అర్థమని, ఎంతో ఆలోచించి రాజధానికి ఆ పేరు పెట్టామన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అనుకూలంగా ఉండేలా రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేశామన్నారు. అమరావతి భవిష్యత్తులో పర్యాటక రంగంగా అభివృద్ధి చెందుతుందన్నారు.

అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రచించినట్లు చెప్పారు. సింగపూర్ పర్యటనకు వెళ్లినప్పుడు తనకు ఘన స్వాగతం లభించిందని, నిబద్ధత కలిగిన నేతను ఇతర దేశాలు తప్పక ఆదరిస్తాయన్నారు. మన రాజధాని మాస్టర్ ప్రణాళిక కోసం సింగపూర్ ఎంతో కష్టపడిందన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

రాజధాని నిర్మాణానికి ప్రజలు అందరు సహకరంచాలన్నారు. గొప్ప నగరాలు నిర్మించిన అనుభవం మనకు ఉందని, అమరావతి ప్రజా రాజధానిగా అభివృద్ధి చేస్తామన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఎంతమంది అడ్డు వచ్చినా అమరావతి అభివృద్ధిని అడ్డుకోలేరన్నారు. మనం ఎవరికీ భయపడాల్సిన పని లేదన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

రాజధానికి జూన్ 6న భూమి పూజ చేస్తామని చెప్పారు. దసరా నాడు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి శంకుస్థాపన చేస్తారని చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

రాజధాని భూమి పూజ లగ్నాన్ని కూడా వివాదాస్పదం చేస్తుండటం దారుణమన్నారు. రాజధాని నిర్మాణానికి ప్రజలు విరాళాలివ్వాలన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

రాజధాని అంటే అన్ని మౌలిక సదుపాయాలు ఉండాలన్నారు. రాష్ట్రానికి ఆదాయం వచ్చేలా రాజధాని ఉండాలన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

విపక్షాలు రెచ్చగొట్టినా రైతులు విజ్ఞతతో వ్యవహరించి రాజధానికి భూములు ఇచ్చారన్నారు.స్విస్ ఛాలెంజ్ రూపంలో రాజధాని నిర్మించనున్నట్లు చెప్పారు. మాస్టర్ డెవలపర్‌ను ఎంపిక చేయాల్సి ఉందన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

నిరంతర విద్యుత్ ఇస్తున్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటి అని చంద్రబాబు చెప్పారు. తెలుగు ప్రజల అభివృద్ధి టీడీపీ ఆశయమన్నారు. తెలంగాణలో 2019లో తప్పకుండా అధికారంలోకి వస్తామని అంతకుముందు చెప్పారు.

English summary
Chandrababu says why government choose 'Amaravati'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X