వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాక్షి పత్రికతో బాబు.. అవాక్కయిన నేతలు: తప్పురాసిందన్నా నమ్మలేదా?

సాక్షి పత్రికను చదువొద్దని, సాక్షి అబద్దాల పత్రిక అని చెప్పే టిడిపి జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. అదే పేపర్‌ను టిడిపి నేతల ముందు వేసి చివాట్లు పెట్టారని తెలుస్తోంది.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: సాక్షి పత్రికను చదువొద్దని, సాక్షి అబద్దాల పత్రిక అని చెప్పే టిడిపి జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. అదే పేపర్‌ను టిడిపి నేతల ముందు వేసి చివాట్లు పెట్టారని తెలుస్తోంది.

ఇటీవల చంద్రబాబు టిడిపి నేతలకు క్లాస్ పీకినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆయా జిల్లాల్లో నేతల మధ్య ఉన్న విభేదాల పైన పత్రికల్లో వార్తలు వచ్చాయి. పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్స్‌ను ముందేసి బాబు నిలదీశారు.

<strong>బెజవాడలో క్యూ.. చంద్రబాబు ఝలక్, కావాలనే హైద్రాబాద్‌లో లోకేష్</strong>బెజవాడలో క్యూ.. చంద్రబాబు ఝలక్, కావాలనే హైద్రాబాద్‌లో లోకేష్

ముఖ్యంగా, ఆయన ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌కు చెందిన సాక్షి పత్రికలో వచ్చిన క్లిప్పింగ్సును నేతల ముందేసి క్లాస్ తీసుకున్నారని తెలుస్తోంది. సాక్షి పత్రికను ముందేయడంతో సొంత పార్టీ నేతలు అవాక్కయ్యారని అంటున్నారు.

<strong>చేయలేం, రూ.50వేలు ఇస్తాం: ఎమ్మెల్యేలకు యనమల, కొత్తగా.. జగన్ లేఖ</strong>చేయలేం, రూ.50వేలు ఇస్తాం: ఎమ్మెల్యేలకు యనమల, కొత్తగా.. జగన్ లేఖ

సాక్షి పత్రిక చదువొద్దని, సాక్షి టీవీ చూడవద్దని చంద్రబాబు పలుమార్లు బహిరంగంగానే చెప్పారు. ప్రభుత్వం తరపున మీడియా కవరేజికి కూడా సాక్షిని ఆహ్వానించకుండా ప్రయత్నాలు చేశారు. సాక్షి తప్పుడు వార్తలు రాస్తుందని టిడిపి నేతలు భగ్గుమంటారు.

బాబు నుంచి విచిత్ర అనుభవం

బాబు నుంచి విచిత్ర అనుభవం

ఇటీవల జిల్లాల వారీగా టీడీపీ నేతలతో చంద్రబాబు సమీక్ష సమావేశాలు నిర్వహించారు. గుంటూరు, ప్రకాశం, అనంతపురం జిల్లా టీడీపీ నేతలకు విచిత్రమైన అనుభవం ఎదురైందని తెలుస్తోంది.

సాక్షి క్లిప్పింగులు.. నేతలు అవాక్కు

సాక్షి క్లిప్పింగులు.. నేతలు అవాక్కు

ఆయా జిల్లాల్లో నేతల వ్యహారశైలి, గ్రూపు రాజకీయాలపై సమీక్ష చేసిన చంద్రబాబు.. సమావేశంలో సాక్షి పత్రిక క్లిప్పింగులను భారీగా వారి ముందు ఉంచారని తెలుస్తోంది. నేతల అవినీతి వ్యవహారాలు, బంధువుల బాగోతాలు, వర్గ విబేధాలకు సంబంధించి సాక్షి పత్రికలో వచ్చిన కథనాలు చాలా క్లిప్పింగులను వారి ముందు ఉంచారని తెలుస్తోంది. దీంతో వారు అవాక్కయ్యారట.

సాక్షి వ్యతిరేకంగా రాసిందని చెప్పినా..

సాక్షి వ్యతిరేకంగా రాసిందని చెప్పినా..

పత్రికలో వచ్చిన కథనాలపై మీ సమాధానం ఏమిటని వారిని చంద్రబాబు ప్రశ్నించారు. దీంతో నేతలంతా అవాక్కయ్యారు. సాక్షి పత్రిక జిల్లా ఎడిషన్‌లో వచ్చిన పేపర్ క్లిప్పింగులు కూడా చంద్రబాబు వద్ద ఉండడంతో నేతలకు నోట మాట రాలేదని అంటున్నారు. సాక్షి పత్రిక తమకు వ్యతిరేకంగా కావాలనే రాసిందని కొందరు నేతలు చెప్పేందుకు ప్రయత్నించినా చంద్రబాబు మాత్రం సంతృప్తి చెందలేదని తెలుస్తోంది.

చంద్రబాబు వద్ద ఎలా?

చంద్రబాబు వద్ద ఎలా?

మొత్తానికి నేతలు సాక్షి పత్రికలో వచ్చిన క్లిప్పింగుల పైన వివరణ ఇచ్చుకున్నారు. అయితే, చంద్రబాబు సాక్షి పత్రికలతో నిలదీయడం ఏమిటా అని వారు గుసగుసలాడుకున్నారని తెలుస్తోంది. కాగా, పార్టీ వ్యవహారాలకు సంబంధించిన కథనాలను పార్టీ ప్రొగ్రామింగ్ కమిటీ చైర్మన్ వీవీ చౌదరి బృందం ద్వారా చంద్రబాబు తెప్పించుకున్నట్టు నేతలు నిర్ధారించుకున్నారు.

అందుకేనా..!

అందుకేనా..!

పార్టీపై, ప్రభుత్వంపై ప్రజలు ఏం అనుకుంటున్నారన్న విషయం స్పష్టంగా తెలియాలంటే ఇతర పత్రికలతో పాటు తమకు వ్యతిరేకంగా ఉన్న సాక్షి మీడియా కూడా బెస్ట్ అని చంద్రబాబు భావించి ఉంటారని అంటున్నారు.అయితే, సాక్షి క్లిప్పింగులను తమ ముందుంచడంతో అనంతపురం, గుంటూరు, ప్రకాశం జిల్లా నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేశారని అంటున్నారు.

English summary
AP CM Nara Chandrababu Naidu gave shock to Telugudesam party with Sakshi clippings in his party meetings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X