వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయ జీవితం లేకుండా: జగన్ కంటే శిల్పా టార్గెట్, ఆ ప్రచారంపై అఖిలకు బాబు ఆర్డర్

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నంద్యాల ఉప ఎన్నికల్లో వైసిపి అధినేత జగన్ కంటే ఆ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డినే టార్గెట్ చేశారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.

|
Google Oneindia TeluguNews

కర్నూలు: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నంద్యాల ఉప ఎన్నికల్లో వైసిపి అధినేత జగన్ కంటే ఆ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డినే టార్గెట్ చేశారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.

చదవండి: నంద్యాల ఎందుకు 'కీ'లకం, ఏపీలో పెను మార్పులు: వీరందరికీ సవాల్

శిల్పాకు రాజకీయ జీవితం లేకుండా..

శిల్పాకు రాజకీయ జీవితం లేకుండా..

నంద్యాల టిడిపి క్యాడర్‌కు ఆయన ఇస్తున్న ఆదేశాలు అలాగే ఉన్నాయని చెబుతున్నారు. ద్రోహం చేసి చివరి క్షణంలో పార్టీని వీడిన వ్యక్తికి రాజకీయ జీవితం లేకుండా చేస్తానని, అవసరమైతే ప్రత్యేకంగా దృష్టి పెడతానని చంద్రబాబు నేతలతో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన శిల్పాను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.

Recommended Video

Chandrababu Naidu And His son Nara Lokesh Fight Real OR Fake ?
శిల్పా పెట్టించిన కేసులు ఎత్తివేస్తానని..

శిల్పా పెట్టించిన కేసులు ఎత్తివేస్తానని..

చాలామందిపై తప్పుడు కేసులు పెట్టించింది గుర్తుకు ఉందని, న్యాయపరంగా పరిష్కరిస్తానని, ఎవరూ భయపడవద్దని చంద్రబాబు ఇటీవల నంద్యాలలో పర్యటించినప్పుడు చెప్పారు. శిల్పా మోహన్ రెడ్డి చాలామందిపై తప్పుడు కేసులు పెట్టించారని చంద్రబాబు తన పర్యటనలో అన్నారు. కేవలం 15 నెలల పదవి కోసం శిల్పా పార్టీ మారాడని నిప్పులు చెరిగారు.

దేశం మొత్తంలో బుద్ధి చెప్పేలా

దేశం మొత్తంలో బుద్ధి చెప్పేలా

నంద్యాలలో ఓట్లు అన్ని టిడిపికి పడేలా చర్యలు తీసుకోవాలని, దీనిపై తాను ప్రత్యేకంగా దృష్టి పెట్టానని సీఎం చంద్రబాబు టిడిపి నేతలకు సూచించారు. ఓట్లన్నీ ఏకపక్షంగా టిడిపికి పడాలని, 50వేల మెజార్టీతో శిల్పాతో పాటు వైసిపికి బుద్ధి చెప్పాలని చంద్రబాబు అన్నారు. దేశంలోనే జగన్‌కు, వైసిపికి బుద్ధి చెప్పేలా ఫలితాలు ఉండాలన్నారు.

అఖిలప్రియ, ఫరూక్, నౌమన్, ఏవీ సుబ్బారెడ్డిలు కలిసి తిరగాలి

అఖిలప్రియ, ఫరూక్, నౌమన్, ఏవీ సుబ్బారెడ్డిలు కలిసి తిరగాలి

మంత్రి అఖిలప్రియ, ఫరూక్‌, నౌమాన్‌, ఏవీ సుబ్బారెడ్డి, శాంతారాం, శ్రీధర్ రెడ్డిలు కలిసి ఎన్నికల ప్రచారం కోసం తిరగాలని చంద్రబాబు సూచించారు. ఐక్యంగా లేరని ప్రచారం జరుగుతోందని, ఒకే సైన్యంలా కలిసి పనిచేసి మంచి సందేశం ఇవ్వాలన్నారు. ఈ ఎన్నికలు మీ నాయకత్వ వృద్ధికి దోహదపడుతాయన్నారు.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu on Sunday said that he is concentrating Nandyal bypoll. He wants about 50,000 majority in bypoll.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X