హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అనంతలో బాబు, ఎన్టీఆర్ స్పూర్తితో చరిత్రలో(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ను కరవురహిత రాష్ట్రంగా చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట్రం పేదరికంలో ఉందని, దీనికి కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆయన అన్నారు.

సోమవారం అనంతపురం జిల్లాలో పర్యటించిన ఆయన తొలుత హంద్రీనీవా రెండవ దశ పనులను పరిశీలించారు. అనంతరం అకాల వర్షాలకు దెబ్బతిన్న పండ్లతోటలను పరిశీలించారు. నీరు-చెట్టు కార్యక్రమాన్ని కూడా పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ 'పుట్టినరోజును ఏసీ గదుల్లో కూర్చుని జరుపుకోవచ్చు. ఎంతో మంది శుభాకాంక్షలు తెలుపుతారు. కానీ, నాకు కావాల్సింది అది కాదు. మన నాయకుడు ఎన్టీఆర్‌ను తెలుగు జాతి గుండెల్లో పెట్టుకుంది. ఎన్టీఆర్ స్పూర్తితో నేనూ తెలుగుజాతి చరిత్రలో నిలిపోవాలన్నదే నా ఆశ. అందుకే కరువు ప్రభావం తీవ్రంగా ఉండే ప్రాంతంలో పుట్టినరోజు జరుపుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఎన్టీఆర్ మానసపుత్రికగా ఉన్న ప్రాజెక్టులన్నంటినీ పూర్తి చేసి, రాయలసీమను కరువు రహిత ప్రాంతంగా తీర్చిదిద్దే వరకు విశ్రమించేది లేదు' అని అన్నారు.

ఎన్టీఆర్ స్పూర్తితో నేనూ తెలుగుజాతి చరిత్రలో నిలిపోవాలని: బాబు

ఎన్టీఆర్ స్పూర్తితో నేనూ తెలుగుజాతి చరిత్రలో నిలిపోవాలని: బాబు

విభజన సమయంలోకాంగ్రెస్ పార్టీ హేతుబద్ధంగా వ్యవహరించకపోవడం వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి పట్టిందన్నారు. కాంగ్రెస్ పార్టీ పాపాలను ప్రజలు గుర్తించారని, అందుకే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారన్నారు. రాష్ట్రాన్ని కరవు రహితంగా మార్చడానికి నిర్దుష్టమైన ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.

ఎన్టీఆర్ స్పూర్తితో నేనూ తెలుగుజాతి చరిత్రలో నిలిపోవాలని: బాబు

ఎన్టీఆర్ స్పూర్తితో నేనూ తెలుగుజాతి చరిత్రలో నిలిపోవాలని: బాబు

రాష్ట్రం నుంచి కరవును పారదోలేందుకు ఎన్ని నిధులు అయినా ఖర్చు చేసేందుకు వెనుకాడమన్నారు. రాష్ట్రాన్ని కరవురహిత రాష్ట్రంగా మార్చడంతోపాటు రాయలసీమను సస్యశ్యామలం చేసే బాధ్యత తీసుకున్నామన్నారు.

ఎన్టీఆర్ స్పూర్తితో నేనూ తెలుగుజాతి చరిత్రలో నిలిపోవాలని: బాబు

ఎన్టీఆర్ స్పూర్తితో నేనూ తెలుగుజాతి చరిత్రలో నిలిపోవాలని: బాబు

తాము అధికారంలో ఉన్నప్పుడు నాబార్డు ద్వారా విడుదల చేసిన రూ.2,500 కోట్లను ఇతర పథకాలకు మళ్లించారన్నారు.

ఎన్టీఆర్ స్పూర్తితో నేనూ తెలుగుజాతి చరిత్రలో నిలిపోవాలని: బాబు

ఎన్టీఆర్ స్పూర్తితో నేనూ తెలుగుజాతి చరిత్రలో నిలిపోవాలని: బాబు

రాష్ట్రంలోని నదులను అనుసంధానం చేసి సముద్రంలో వృథాగా కలుస్తున్న నదీ జలాలను వినియోగించుకుంటామని ముఖ్యమంత్రి అన్నారు.

ఎన్టీఆర్ స్పూర్తితో నేనూ తెలుగుజాతి చరిత్రలో నిలిపోవాలని: బాబు

ఎన్టీఆర్ స్పూర్తితో నేనూ తెలుగుజాతి చరిత్రలో నిలిపోవాలని: బాబు

గోదావరి, కృష్ణా, పెన్నా, నాగావళి, వంశధార నదులను అనుసంధానం చేయడం ద్వారా రాష్ట్రం కరవుకోరల నుంచి బయటపడుతుందన్నారు. వీటి ద్వారా హంద్రీనీవా, తెలుగుగంగ, పోలవరం, గాలేరు-నగరి, వెలిగొండ తదితర ప్రాజెక్టులకు నీళ్లు మళ్లిస్తామన్నారు.

ఎన్టీఆర్ స్పూర్తితో నేనూ తెలుగుజాతి చరిత్రలో నిలిపోవాలని: బాబు

ఎన్టీఆర్ స్పూర్తితో నేనూ తెలుగుజాతి చరిత్రలో నిలిపోవాలని: బాబు

పట్టిసీమను పూర్తి చేసి పోలవరం కుడి కాలువకు నీటిని తీసుకురావడం వల్ల శ్రీశైలం నీటిని రాయలసీమకు వినియోగించుకోవచ్చన్నారు. ఇలా 1500 టిఎంసిల నీటిని చెరువులు, రిజర్వాయర్లు, చిన్న చిన్న కుంటల్లో నిల్వ చేసుకోవచ్చన్నారు. ఫలితంగా భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. తద్వారా ఎంతటి కరవువచ్చినా తట్టుకోవచ్చన్నారు.

ఎన్టీఆర్ స్పూర్తితో నేనూ తెలుగుజాతి చరిత్రలో నిలిపోవాలని: బాబు

ఎన్టీఆర్ స్పూర్తితో నేనూ తెలుగుజాతి చరిత్రలో నిలిపోవాలని: బాబు

రాష్ట్రాన్ని 2022 నాటికి దేశంలోని రాష్ట్రాల్లో మూడు లేదా నాల్గవ స్థానానికి తీసుకువస్తామని సిఎం అన్నారు. అదేవిధంగా 2029 నాటికి దేశంలోనే మొదటి స్థానానికి తీసుకు వస్తామన్నారు. అనంతరం 2050 నాటికి ప్రపంచంలోనే మొదటి స్థానానికి తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ సత్తా ఏంటో చూపిస్తామన్నారు.

 ఎన్టీఆర్ స్పూర్తితో నేనూ తెలుగుజాతి చరిత్రలో నిలిపోవాలని: బాబు

ఎన్టీఆర్ స్పూర్తితో నేనూ తెలుగుజాతి చరిత్రలో నిలిపోవాలని: బాబు

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే మొదటి స్థానానికి తీసుకువెళ్లేంత వరకూ విశ్రమించనని, అప్పటివరకూ అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉంటానన్నారు.
రాష్ట్రంలో ప్రాజెక్టులను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను సిఎం ఆదేశించారు.

ఎన్టీఆర్ స్పూర్తితో నేనూ తెలుగుజాతి చరిత్రలో నిలిపోవాలని: బాబు

ఎన్టీఆర్ స్పూర్తితో నేనూ తెలుగుజాతి చరిత్రలో నిలిపోవాలని: బాబు

అవసరమైతే కాంట్రాక్టర్లకు 15 రోజులకు ఒకసారి డబ్బు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. ‘మీకు చేతకాకపోతే ముందుగా చెప్పండి, టెండర్లు పిలిచి కొత్త కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తాం.

ఎన్టీఆర్ స్పూర్తితో నేనూ తెలుగుజాతి చరిత్రలో నిలిపోవాలని: బాబు

ఎన్టీఆర్ స్పూర్తితో నేనూ తెలుగుజాతి చరిత్రలో నిలిపోవాలని: బాబు

ప్రభుత్వంతో ఆడుకుంటామంటే కుదరదు. అవినీతిపరుల గుండెల్లో నిద్రపోతాను' అని బాబు హెచ్చరించారు.

English summary
Briefly addressing the gathering, Mr. Naidu expressed his gratitude to the sacrifices made by TDP workers and wished that people in both the Telugu-speaking States be healthy and prosperous. He said that he would strive for all-round development of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X