వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనుమతి లేదు: అందుకే.. విశాఖలో చంద్రబాబు వర్సెస్ పవన్ కళ్యాణ్!

ఈ నెల 26వ తేదీన విశాఖలోని ఆర్కే బీచ్‌లో ప్రత్యేక హోదా కోసం నిరసన చేపట్టనున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

|
Google Oneindia TeluguNews

విశాఖ: ఈ నెల 26వ తేదీన విశాఖలోని ఆర్కే బీచ్‌లో ప్రత్యేక హోదా కోసం నిరసన చేపట్టనున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. దీనికి వైసిపి అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు పలికారు.

అప్పుడే రాస్తే..: పవన్‌కు సూటిగా బాబు, కేవీపీ-జగన్.. అందరికీ కౌంటర్

తమిళనాడులో జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలంటూ తమిళ యువత నిరసన చేపట్టినట్టే... హోదాపై పోరును ముమ్మరం చేద్దామంటూ సోషల్‌ మీడియాలో ఆంధ్ర ప్రాంత యువత పోస్టులు చేస్తున్నారు.

జల్లికట్టు ఉద్యమానికి చెన్నైలోని మెరీనా బీచ్‌ వేదికైతే... ప్రత్యేకహోదా పోరాటానికి విశాఖ ఆర్కే బీచ్‌ను వేదికగా ఎంచుకున్నారు.

AP CM Nara Chandrababu Naidu to visit Vishaka on 26th January.

26వ తేదీ సాయంత్రం కిర్లంపూడి లే అవుట్‌ ఎదురుగా బీచ్ రోడ్డులో నిర్వహించే శాంతియుత నిరసన కార్యక్రమానికి పార్టీలకతీతంగా హాజరుకావాలంటూ రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది.

దీనికి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ మద్దతు ప్రకటించడం పోలీసు వర్గాలను తీవ్ర కలవరపాటుకు గురి చేస్తోంది. ఆయన రావొచ్చుననే వాదనలు కూడా ఉన్నాయి.

ఏం సంబంధం, నేనే పోరాడుతా, అదీ ఆయన విధానం.. పవన్ గురించి మాట్లాడనని: బాబు షాక్ఏం సంబంధం, నేనే పోరాడుతా, అదీ ఆయన విధానం.. పవన్ గురించి మాట్లాడనని: బాబు షాక్

ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సు 27వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. దీనికోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 26వ తేదీనే విశాఖ వస్తున్నారు. ఆ రోజు విశాఖలోనే బస చేస్తారు.

కాగా, హోదా డిమాండ్‌తో బీచ్ రోడ్డులో 26న నిరసన కార్యక్రమ నిర్వహణకు అనుమతి కోసం ఇంతవరకూ తమను ఎవరూ సంప్రదించలేదని పోలీస్‌ కమిషనర్‌ యోగానంద్‌ తెలిపారు.

26న రిపబ్లిక్‌డే కావడంతోపాటు సీఎం చంద్రబాబు నగరంలోనే ఉండడం, మరుసటిరోజు నుంచే సీఐఐ సదస్సు జరుగనున్నందున నిరసన కార్యక్రమాలకు అనుమతి ఇవ్వడం ఇబ్బందికరమేనని చెప్పారు.

English summary
AP CM Nara Chandrababu Naidu to visit Vishaka on 26th January.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X