వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు బిజీ: ఎన్నారై, ఐఐటీ స్టూడెంట్స్ చెక్స్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బీమా రంగంలో మహిళలు రాణిస్తారని, ఆ వ్యాపారాన్ని మహిళా సంఘాలకు అప్పగించే యోచన ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం అన్నారు. ఇందులో భాగంగా, ఆర్థిక వనరుల కేటాయింపునకు మహిళా కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని సూచనప్రాయంగా తెలిపారు. సచివాలయంలో శనివారం ఏడు గంటలపాటు నిర్వహించిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి మండలి భేటీలో మాట్లాడారు.

సబ్‌ ప్లాన్‌ సహా ఎస్సీ, ఎస్టీల కోసం అమలు చేస్తున్న వివిధ పథకాలను ఆయా మంత్రిత్వ శాఖలతో సీఎం సమీక్షించారు. రాష్ట్రంలో అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలితాలు చేరాలని, పారదర్శకత కోసం వ్యయ వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పేదరిక నిర్మూలన సామాజిక సాధికారతకు మొదటి మెట్టు అని, ఈ లక్ష్యసాధనకు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి ఫలితాలు రాబట్టాలన్నారు.

అభివృద్ధి కేవలం నినాదాలకే పరిమితం కారాదని, చట్టాన్ని సంతృప్తిపరిచేందుకు పనిచేస్తే లాభం లేదని, ప్రజా శ్రేయస్సు కోసం పని చేసినప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయని, ఇందులో తాను రాజీ పడనని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ ఆర్థికాభివృద్ధికి క్రెడిట్‌ గ్యారెంటీ వంటి 7 అంశాలతో కూడిన పథకం రూపొందించామన్నారు. చేతి వృత్తుల వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి ప్రత్యేకంగా ఆర్టిజాన్‌ కాలనీలు ఏర్పాటు చేస్తామన్నారు.

కొండపల్లి, ఏటికొప్పాక, శ్రీకాళహస్తి తదితర ప్రాంతాల్లోని చేతి వృత్తుల పనుల వారికి అంతర్జాతీయ మార్కెటింగ్‌ సదుపాయాలు కల్పిస్తామన్నారు. నాయి బ్రాహ్మణులకు నైపుణ్య శిక్షణ ఇప్పించి, బ్యూటీ పార్లర్లు పెట్టిస్తామని, గొర్రెల పెంపకందార్లకు గ్రామాల్లో గొర్రెల ఫారాలు ఏర్పాటు చేసి ఆదాయ వనరులు సమకూరుస్తామని, ఏజెన్సీ ఏరియాలో కాఫీ తోటల సాగు విస్తీర్ణం పెంచి గిరిజనులకు లబ్ధి చేకూరుస్తామని, రజకులకు ఆధునిక పరికరాలు అందిస్తామన్నారు. కాగా, చంద్రబాబుకు పలువురు చెక్కులు అందించారు.

చంద్రబాబు

చంద్రబాబు

సచివాలయంలో శనివారం ఏడు గంటలపాటు నిర్వహించిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి మండలి, మహిళా భేటీలో మాట్లాడారు.

చంద్రబాబు

చంద్రబాబు

పృథ్వీ అసెట్ రీ కన్‌స్ట్రక్షన్ అండ్ సెక్యురైజేషన్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ మోటపర్తి శివరామ వరప్రసాద్ ముఖ్యమంత్రిని కలిసి రూ.25 లక్షల చెక్కు ఇచ్చారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు శనివారం నాడు పలువురు చెక్కులు అందజేశారు. ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి కొకొనట్ కోప్రా ఎక్స్ పోర్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు తమ్నా రామ్ రూ.7,21,467ను చంద్రబాబుకు ఇచ్చారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు శనివారం నాడు పలువురు చెక్కులు అందజేశారు. చిట్టూరి శ్రీనివాస్ రూ.5,000లు చంద్రబాబుకు ఇస్తున్న దృశ్యం.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు శనివారం నాడు పలువురు చెక్కులు అందజేశారు. ఎన్నారై శ్రీమతి నృత్య మాధవి రూ.12,800 డాలర్ల చెక్కును చంద్రబాబుకు ఇస్తున్న దృశ్యం.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు శనివారం నాడు సచివాలయంలో కలిసిన పలువురు విదేశఈ మహిళలు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు శనివారం నాడు పలువురు చెక్కులు అందజేశారు. ఐఐటీ బాంబే విద్యార్థులు రూ.3,40,525 చెక్కును చంద్రబాబుకు ఇస్తున్న దృశ్యం.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు శనివారం నాడు పలువురు చెక్కులు అందజేశారు. ఐఐటీ బాంబే విద్యార్థులు రూ.3,40,525 చెక్కును చంద్రబాబుకు ఇస్తున్న దృశ్యం.

English summary
AP CM Chandrababu Naidu wants women empowerment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X