వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

త్వరలో పాత చంద్రబాబును చూస్తారు: ఉద్యోగులకు బాబు హెచ్చరిక(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ‘పనిచేసే వారే నా దగ్గర ఉంటారు. పనిచేయని వారిని ఉపేక్షించేది లేదు' అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తేల్చిచెప్పారు. ఉద్యోగులు పనితీరు మార్చుకోవాల్సిందేనని కూడా ఆయన హెచ్చరించారు. రాష్ట్రాభివృద్ధి కోసం తాను 24 గంటలు కష్టపడుతున్నా, అధికారుల నుంచి ఆ స్థాయి సహకారం అందడం లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారుల పనితీరులో ఇదే ధోకణి కొనసాగితే, మరో 3 నెలల్లో పాత చంద్రబాబును చూస్తారంటూ ఆయన హెచ్చరించారు. గురువారం ఆయన విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆయన గుంటూరు ఆస్పత్రి ఘటన, ఇంజక్షన్ల సైకోపై కాస్త ఘాటుగా స్పందించారు.

‘గతంలో మాదిరిగా కాకుండా ఉద్యోగుల పట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్నా. అయతే, నేను ఎంత కష్టపడుతున్నా. ఉద్యోగుల నుంచి ఆ స్థాయి కృషి జరగడం లేదు. ఉద్యోగులు నిర్లిప్తంగా ఉన్నా, నిరక్ష్యంగా వ్యవహరించినా గతంలో సహించేవాడిని కాదు. కొందరు రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మొద్దు నిద్రను వదిలించేందుకు సన్నద్ధంగా ఉన్నాను. ఉద్యోగుల విషయంలో మరో 3 నెలల్లో పాత చంద్రబాబు ఫెర్‌ఫార్మెన్స్ చూస్తారు' అని చంద్రబాబు అన్నారు.

తాను రాష్ర్టాన్ని అభివృద్ధి చేయడానికి, ఆదాయం తీసుకు రావడానికి 24 గంటలూ కష్టపడుతుంటే, వివిధ ప్రభుత్వ శాఖల నిర్వాకం కారణంగా ప్రభుత్వ పరువు మంటగలుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేవారు. గుంటూరు జీజీహెచ్‌లో ఎలుకలు కొరకడం ద్వారా శిశువు మరణించడంపై తీవ్రంగా స్పందించారు.

‘ఆ డాక్టర్‌కు బుద్ధి లేదు' అంటూ ఘాటుగా స్పందించారు. ఇంజక్షన్లు చేసి పారిపోతున్న సైకో ఉదంతాలపై కూడా చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఒక సైకో ఇంజక్షన్లు చేసి పారిపోతుంటే పోలీసులు వాడిని పట్టుకోవడానికి భయపడుతున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సైకోను పట్టుకోకపోవడంపై తాను డిజిపి నుంచి అన్ని స్థాయిల అధికారులతో మాట్లాడి వాయించి పారేశానన్నారు. పనిచేసే అధికారులే తన దగ్గర ఉంటారని, పని చేయని వారిని ఉపేక్షించేది లేదన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

‘పనిచేసే వారే నా దగ్గర ఉంటారు. పనిచేయని వారిని ఉపేక్షించేది లేదు' అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తేల్చిచెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఉద్యోగులు పనితీరు మార్చుకోవాల్సిందేనని కూడా ఆయన హెచ్చరించారు.

చంద్రబాబు

చంద్రబాబు

రాష్ట్రాభివృద్ధి కోసం తాను 24 గంటలు కష్టపడుతున్నా, అధికారుల నుంచి ఆ స్థాయి సహకారం అందడం లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు

చంద్రబాబు

అధికారుల పనితీరులో ఇదే ధోకణి కొనసాగితే, మరో 3 నెలల్లో పాత చంద్రబాబును చూస్తారంటూ ఆయన హెచ్చరించారు.

చంద్రబాబు

చంద్రబాబు

గురువారం ఆయన విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆయన గుంటూరు ఆస్పత్రి ఘటన, ఇంజక్షన్ల సైకోపై కాస్త ఘాటుగా స్పందించారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఎయిర్‌పోర్టులో సిఎం చంద్రబాబునాయుడుకు స్వాగతం పలుకుతున్న నేతలు.

చంద్రబాబు

చంద్రబాబు

ఎయిర్‌పోర్టులో సిఎం చంద్రబాబునాయుడుకు స్వాగతం పలుకుతున్న దృశ్యం.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu on Thursday warned government employees, who are neglect in duty.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X