వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు హెచ్చరిక, పవన్‌కళ్యాణ్ ఫ్యాన్స్ సాయం(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎర్రచందనం కేసుల్లో స్మగ్లర్లకు సహకరించిన వారిని కూడా స్మగ్లర్లుగానే పరిగణించాల్సి ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సోమవారం ఆయన ఎర్రచందనం, ఇసుక లీజులు, ఆదాయ వనరులు వంటి అనేక అంశాలపై అధికారులతో చర్చించారు. ఎర్రచందనంపై ఆయన స్పందిస్తూ ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సహకరించే అధికారులు, పోలీసులపై కూడా చర్యలు తప్పవన్నారు.

ఎర్రచందనం రవాణా చేస్తున్న వాహనాల డ్రైవర్లపై మాత్రమే కేసులు నమోదు చేయడంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పాత్రధారులపై కేసులు పెడుతూ సూత్రధారులపై కేసులు పెట్టకపోవడంపై అసహనం వ్యక్తం చేసిన ఆయన ఇకపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. కేసులు పెడుతున్నామని, వాహనాలు సీజ్ చేస్తున్నామని అధికారులు చెబుతుండడం సరికాదన్నారు. స్మగ్లింగ్ కేసుల్లో ఇప్పటికే ఉక్కుపాదం మోపామని, స్మగ్లర్లలో భయం పెరిగిందన్నారు.

మరింతగా స్మగ్లర్లపై పట్టు పెంచాలన్నారు. ఇక ఇసుక లీజులను మహిళలకు ఇచ్చే అంశంపై కూడా చంద్రబాబు సమీక్షించారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ఆదాయ వనరులను కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎర్ర చందనాన్ని అంతర్జాతీయ విపణిలో వేలం ద్వారా విక్రయించడంలో చోటు చేసుకుంటున్న జాప్యం పైన బాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

శేషాచలం కొండల్లో లభించే విలువైన వనం సంపదను వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అనుమతిచ్చిందని, గడువు ఈ నెలాఖరును ముగుస్తుందని, ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎర్ర చందనం అక్రమ రవాణా, ప్రభుత్వానికి ఆటంకాలు కల్పించడంలో స్మగ్లర్లదే పై చేయిగా కనిపిస్తోందన్నారు. కలప దుంగలను అక్రమంగా తరలిస్తున్న వాహనాలను పట్టుకొన్న సందర్భాల్లో చాలా కేసుల్లో పరారీ అవడం, అదుపులోకి తీసుకోలేక పోవడంపై బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, హుధుద్ తుఫాను నేపథ్యంలో చంద్రబాబుకు పలువురు చెక్కులు అందజేశారు.

చంద్రబాబుకు చెక్కు

చంద్రబాబుకు చెక్కు

హుధుద్ సహాయం, రుణ మాఫీ విషయంలో బాధితులు అందరికీ న్యాయం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ రాకుండా చూస్తున్నామన్నారు. విశాఖలో తుపానుల కారణంగా ఐటి సంస్థలు వెనుకడుగు వేస్తున్నట్టు కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గతంలో ఇటువంటి ప్రచారమే హైదరాబాద్ పైనా జరిగిందన్నారు.

చంద్రబాబుకు చెక్కు

చంద్రబాబుకు చెక్కు

హుధుద్ తుఫాను సహాయార్థం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చెక్కులు అందజేస్తున్న పలువురు దృశ్యం.

చంద్రబాబుకు చెక్కు

చంద్రబాబుకు చెక్కు

హుధుద్ తుఫాను సహాయార్థం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చెక్కులు అందజేస్తున్న పలువురు దృశ్యం.

కృష్ణ

కృష్ణ

హుధుద్ తుఫాను సహాయార్థం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చెక్కు అందజేస్తున్న సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ.

గల్లా జయదేవ్

గల్లా జయదేవ్

హుధుద్ తుఫాను సహాయార్థం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చెక్కు అందజేస్తున్న గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్.

కోరమంగళం

కోరమంగళం

హుధుద్ తుఫాను సహాయార్థం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చెక్కు అందజేస్తున్న కోరమంగళం మేనేజింగ్ డైరెక్టర్.

ఏపీ సచివాలయ విలేకరులు

ఏపీ సచివాలయ విలేకరులు

హుధుద్ తుఫాను సహాయార్థం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చెక్కు అందజేస్తున్న ఏపీ సచివాలయ విలేకరులు.

ఎల్వీ రమేష్ ప్రసాద్

ఎల్వీ రమేష్ ప్రసాద్

హుధుద్ తుఫాను సహాయార్థం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చెక్కు అందజేస్తున్న ఎల్వీ రమేష్ ప్రసాద్ దృశ్యం.

నాగార్జున కన్‌స్ట్రక్షన్స్

నాగార్జున కన్‌స్ట్రక్షన్స్

హుధుద్ తుఫాను సహాయార్థం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చెక్కు అందజేస్తున్న నాగార్జున కన్‌స్ట్రక్షన్స్ ప్రతినిధులు.

ఎన్సీసీ లిమిటెడ్

ఎన్సీసీ లిమిటెడ్

హుధుద్ తుఫాను సహాయార్థం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కోటి రూపాయల చెక్కు అందజేస్తున్న ఎన్సీసీ లిమిటెండ్ ప్రెసిడెంట్.

రాంకో సిమెంట్స్

రాంకో సిమెంట్స్

హుధుద్ తుఫాను సహాయార్థం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రెండు కోట్ల రూపాయల చెక్కు అందజేస్తున్న రాంకో సిమెంట్స్ ప్రతినిధులు.

పవన్ ఫ్యాన్స్ అసోసియేషన్

పవన్ ఫ్యాన్స్ అసోసియేషన్

హుధుద్ తుఫాను సహాయార్థం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లక్షన్నర రూపాయల చెక్కు అందజేస్తున్న వినుకొండ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్.

ఎంపీ మల్లారెడ్డి

ఎంపీ మల్లారెడ్డి

హుధుద్ తుఫాను సహాయార్థం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చెక్కు అందజేస్తున్న మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి.

English summary
AP CM Chandrababu Naidu warns officers on Red Sandals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X