వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నంద్యాలపై ఇక సర్వే ఫలితలు!: బాబుకు షాక్ తప్పదా? అందుకే భారీ పోలింగ్

నంద్యాల ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన తీసుకున్న గోతిలో ఆయనే పడ్డారా? అంటే అవుననే అంటున్నారు వైసిపి నేతలు.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన తీసుకున్న గోతిలో ఆయనే పడ్డారా? అంటే అవుననే అంటున్నారు వైసిపి నేతలు. చంద్రబాబుకు ఈ ఉప ఎన్నికలు షాకిస్తాయని అంటున్నారు.

నంద్యాలలో చక్రం తిప్పేది వాళ్లే!: దాని పైనే జగన్-బాబు గెలుపు లెక్కలునంద్యాలలో చక్రం తిప్పేది వాళ్లే!: దాని పైనే జగన్-బాబు గెలుపు లెక్కలు

నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపికి ఓటు వేయకుంటే రేషన్ రాదని, ఫింఛన్ రాదని ఆయన పరోక్షంగా హెచ్చరించారని వైసిపి నేత అంబటి బుధవారం అన్నారు. ఇవి టిడిపిని దెబ్బతీశాయన్నారు.

అద్భుతం

అద్భుతం

నంద్యాల‌లో ఉప ఎన్నికల స‌రళి అద్భుతంగా ఉంద‌ని అంబటి రాంబాబు అన్నారు. నంద్యాల‌లో ఓట్ల శాతం ఇంత‌గా న‌మోదు కావ‌డం ప్ర‌జాస్వామ్యానికి మంచి చిహ్నమ‌ని చెప్పారు. నంద్యాలలో ప్ర‌జ‌లు న్యాయానికి, ధ‌ర్మానికే ఓటు వేస్తార‌న్నారు. తమ పార్టీ గెలుపు ఖాయమన్నారు. నంద్యాల‌లో నోటిఫికేష‌న్ రాక‌ముందే అక్క‌డ అభివృద్ధి ప‌నులంటూ చంద్ర‌బాబు మాట్లాడారన్నారు.

చంద్రబాబు బెదిరింపులు

చంద్రబాబు బెదిరింపులు

పింఛ‌న్ తీసుకోవాంటే టిడిపికి ఓటు వేయాల‌ని చంద్ర‌బాబు బెదిరించారని అంబటి చెప్పారు. జ‌గ‌న్ మాత్రం నంద్యాల‌లో అటువంటి ప్రచారం చేసుకోలేదని, చంద్ర‌బాబు పాల‌న‌ను ఎండ‌గ‌ట్టార‌న్నారు. చంద్ర‌బాబు తీసుకున్న గోతిలో ఆయ‌నే ప‌డ‌తారన్నారు.

ఎవరు గెలుస్తారంటే?

ఎవరు గెలుస్తారంటే?

కాగా, నంద్యాల ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని ఆయా ఛానల్స్ ఇక సర్వే ఫలితాలు వచ్చే అవకాశముంది.టిడిపి గెలుస్తుందని కొందరు, వైసిపి గెలుపు ఖాయమని మరికొందరు చెబుతున్నారు.

టిడిపిలో ఓటమి భయం

టిడిపిలో ఓటమి భయం

తెలుగుదేశం పార్టీలో ఓటమి భయం ఉందని వైసిపి నేతలు అంటున్నారు. నంద్యాలలో భారీ పోలింగ్ జరిగింది. ఈ సరళి తమకు అనుకూలమని వైసిపి నేతలు చెబుతున్నారు. చంద్రబాబు పాలనపై వ్యతిరేకతతో ఓటు వేసేందుకు జనాలు తరలి వచ్చారని చెబుతున్నారు.

వైసిపిలో ఆందోళన అని టిడిపి

వైసిపిలో ఆందోళన అని టిడిపి

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఓటమి భయం ఉందని టిడిపి నేతలు చెబుతున్నారు. తమ పాలనను ఆమోదించారని, అలాగే భూమా నాగిరెడ్డిపై ఉన్న అభిమానంతో పెద్ద ఎత్తున ఓటర్లు తరలి వచ్చారని టిడిపి చెబుతోంది. జగన్ చిన్న పిల్లలపై కక్ష కట్టారని, దీనిని జీర్ణించుకోలేని నంద్యాల ప్రజలు టిడిపికి ఓటు వేసేందుకు వచ్చారని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. నంద్యాలలో 80 శాతానికి పైగా పోలింగ్ నమోదవుతుందని భావిస్తున్నారు.

English summary
Voting completed across 255 polling stations in Nandyal Assembly constituency in Kurnool district of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X