కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కడప జడ్పీ సమావేశంలో రసాభాస: మైకులు విసురుకున్న వైసిపి, టిడిపి నేతలు

|
Google Oneindia TeluguNews

కడప: నగరంలో శనివారం నిర్వహించిన జడ్పీ సమావేశం రసాభాసగా మారింది. సమావేశంలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మధ్య తీవ్రంగా వాగ్వాదం చేసుకున్నారు. అనంతరం మైకులు విసురేశారు.

ప్రోటోకాల్ విషయంలో వచ్చిన విభేదాల కారణంగా టిడిపి, వైయస్సార్ కాంగ్రెస్ సభ్యులు వాగ్వాదానికి దిగారు. వైయస్సార్ కాంగ్రెస్ సభ్యులు దూషించడంతో కలెక్టర్, ఇతర అధికారులు సమావేశం నుంచి వెళ్లిపోయారు. అనంతరం టిడిపి, వైయస్సార్ కాంగ్రెస్ సభ్యులు మైకులు విసిరేసుకున్నారు.

Chaos in Kadapa ZP meeting

జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో వైయస్సార్ కాంగ్రె ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదని, ప్రోటోకాల్‌ పాటించడం లేదంటూ వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభను అడ్డుకున్నారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేల తీరును టీడీపీ తప్పుబట్టింది.

ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం నెలకొనడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. వైసీపీ సభ్యుల తీరుకు నిరసనగా కలెక్టర్‌ జీవీరమణ, అధికారులు సభను బహిష్కరించి బయటకు వెళ్లిపోయారు.

English summary
Chaos occurred in Kadapa ZP meeting on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X