వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముత్యాలపందిరి: సింహవాహనంపై అమ్మవారు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

తిరుచానూరు: శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజైన శుక్రవారం రాత్రి యోగ నరసింహ స్వామి అలంకరణలో అమ్మవారు సింహ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. పరాక్రమానికి, శీఘ్ర గమనానికి, శక్తికి ప్రతీకయైన సింహంపై అమ్మవారు దుష్టశిక్షణ, శిష్ట రక్షణ చేస్తున్నట్లు భక్తులకు దర్శనమిచ్చారు.

శరణుకోరిన భక్తులకు ఐశ్వర్యం, వీరం, యశస్సు, ప్రభ, జ్ఞానం, వైరాగ్యం అనే 6 గుణాలను భక్తులకు ప్రసాదించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం వేకువ జామున అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలపి నిత్యకైంకర్యాలను నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 6 గంటలకు ఊంజల్ సేవ నిర్వహించారు.

రాత్రి 7 గంటలకు అమ్మవారిని ఆస్థాన మండపం నుంచి వేంచేపుగా వాహన మండపానికి తీసుకువచ్చి కొలువుదీర్చారు. అనంతరం పట్టు పీతాంబర, వజ్ర వైఢూర్య స్వర్ణ్భారణాలతో యోగ నరసింహ స్వామిగా అమ్మవారిని అలంకరించి సింహ వాహనంపై కొలువుదీర్చారు.

రాత్రి 8 గంటలకు భజన బృందాలు, భక్తుల కోలాటాలు, కేరళ చంఢీ వాయిద్యాలు, సన్నాయి వాయిద్యాలు, జీయార్ స్వాముల వేదమంత్రాల నడుమ అమ్మవారు సింహవాహనాన్ని అధిష్ఠించి తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు యోగ నరసింహునిగా దర్శనమిచ్చారు.

ముత్యపు పందిరిలో అమ్మవారు

అమ్మవారి వైభవం

అమ్మవారి వైభవం

శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజైన శుక్రవారం రాత్రి యోగ నరసింహ స్వామి అలంకరణలో అమ్మవారు సింహ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు.

అమ్మవారి వైభం

అమ్మవారి వైభం

పరాక్రమానికి, శీఘ్ర గమనానికి, శక్తికి ప్రతీకయైన సింహంపై అమ్మవారు దుష్టశిక్షణ, శిష్ట రక్షణ చేస్తున్నట్లు భక్తులకు దర్శనమిచ్చారు.

అమ్మవారి వైభవం

అమ్మవారి వైభవం

శరణుకోరిన భక్తులకు ఐశ్వర్యం, వీరం, యశస్సు, ప్రభ, జ్ఞానం, వైరాగ్యం అనే 6 గుణాలను భక్తులకు ప్రసాదించారు.

అమ్మవారి వైభవం

అమ్మవారి వైభవం

బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం వేకువ జామున అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలపి నిత్యకైంకర్యాలను నిర్వహించారు.

అమ్మవారి వైభవం

అమ్మవారి వైభవం

మధ్యాహ్నం 12 గంటలకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 6 గంటలకు ఊంజల్ సేవ నిర్వహించారు.

అమ్మవారి వైభవం

అమ్మవారి వైభవం

రాత్రి 7 గంటలకు అమ్మవారిని ఆస్థాన మండపం నుంచి వేంచేపుగా వాహన మండపానికి తీసుకువచ్చి కొలువుదీర్చారు.

అమ్మవారి వైభవం

అమ్మవారి వైభవం

అనంతరం పట్టు పీతాంబర, వజ్ర వైఢూర్య స్వర్ణ్భారణాలతో యోగ నరసింహ స్వామిగా అమ్మవారిని అలంకరించి సింహ వాహనంపై కొలువుదీర్చారు.

ముత్యాల పందిరిలో అమ్మవారి వైభవం

ముత్యాల పందిరిలో అమ్మవారి వైభవం

శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 3వ రోజైన శుక్రవారం ఉదయం ముల్లోకాల తల్లి అలమేలు మంగమ్మ ముత్యపు పందిరి వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు.

అమ్మవారి వైభవం

అమ్మవారి వైభవం

రాత్రి 7 గంటలకు సన్నిధి నుంచి వేంచేపుగా అమ్మవారిని వాహన మండపానికి తీసుకువచ్చి ముత్యపు పందిరి వాహనంపై కొలువుదీర్చారు.

అమ్మవారి వైభవం

అమ్మవారి వైభవం

అనంతరం పట్టుపీతాంబర, రత్నఖచిత, వజ్రవైఢూర్య ఆభరణాలతో అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు.

అమ్మవారి వైభవం

అమ్మవారి వైభవం

8 గంటలకు భక్తుల కోలాటాలు, మంగళవాయిద్యాలు, కేరళాచంఢీ వాయిద్యం, జియ్యర్ స్వాముల ప్రబంధ ప్రవచనం నడుమ అమ్మవారు ముత్యపు పందిరి వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించారు.

అమ్మవారి వైభవం

అమ్మవారి వైభవం

శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 3వ రోజైన శుక్రవారం ఉదయం ముల్లోకాల తల్లి అలమేలు మంగమ్మ ముత్యపు పందిరి వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు.

శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 3వ రోజైన శుక్రవారం ఉదయం ముల్లోకాల తల్లి అలమేలు మంగమ్మ ముత్యపు పందిరి వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. 7 గంటలకు సన్నిధి నుంచి వేంచేపుగా అమ్మవారిని వాహన మండపానికి తీసుకువచ్చి ముత్యపు పందిరి వాహనంపై కొలువుదీర్చారు.

అనంతరం పట్టుపీతాంబర, రత్నఖచిత, వజ్రవైఢూర్య ఆభరణాలతో అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. 8 గంటలకు భక్తుల కోలాటాలు, మంగళవాయిద్యాలు, కేరళాచంఢీ వాయిద్యం, జియ్యర్ స్వాముల ప్రబంధ ప్రవచనం నడుమ అమ్మవారు ముత్యపు పందిరి వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఈఓ ఎంజి గోపాల్, జెఈఓ పి భాస్కర్ , టిటిడి మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు దంపతులు, డిప్యూటీ ఈఓ చెంచులక్ష్మి, ఏఈఓ నాగరత్న, సూపరింటెండెంట్‌లు శేషాద్రిగిరి, వరప్రసాద్, ఆర్జితం, ప్రసాదాల ఇన్స్‌పెక్టర్లు ఆంజినేయులు, గురవయ్య, విజిఓ రవీంద్రారెడ్డి, ఇతర ఆలయ అర్చకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

English summary
The Goddess Padmavathi Devi, who is also believed to be the incarnation of Chenchu Lakshmi-the famous tribe girl in Narasimha Avatara who appeased Ugra Narasimha to come to His normal state with Her splendid beauty, took pleasure ride on Simha Vahana in Yoga Narasimha Avatara on Friday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X