వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒళ్లంతా చెమటలు, స్పీచ్ కాగానే అలా కూర్చుండిపోయిన బాబు, దుబాయ్ నుంచి ఏపీకి...

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం దొండపాడు సభలో అలసటకు గురయ్యారు. సభలో మాట్లాడుతూ అలసిపోయారు. కుర్చీలో కూర్చుండిపోయారు. మంచి నీళ్లు తాగిన తర్వాత ఉపశమనం పొందారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం దొండపాడు సభలో అలసటకు గురయ్యారు. సభలో మాట్లాడుతూ అలసిపోయారు. కుర్చీలో కూర్చుండిపోయారు. మంచి నీళ్లు తాగిన తర్వాత ఉపశమనం పొందారు.

చదవండి: జగన్ కోసం.. తీగ లాగితే: బాబుకు అడ్డంగా దొరికిన ప్రశాంత్ కిషోర్

ఉత్సాహంగా వచ్చారు

ఉత్సాహంగా వచ్చారు

బీఆర్‌ఎస్‌ గ్రూపు శంకుస్థాపనలో పాల్గొనడానికి చంద్రబాబు సభా ప్రాంగణానికి వచ్చినప్పుడు ఉత్సాహంగా కనిపించారు. తొలుత ఆయన ఆసుపత్రి నమూనాల వివరాలు తెలుసుకుని వేదికపైకి చేరుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించిన చిన్నారులను వేదికపైకి పిలిపించి వారితో ఫొటో దిగారు.

Recommended Video

Chandrababu Naidu And His son Nara Lokesh Fight Real OR Fake ?
ఒళ్లంతా చెమటలు పట్టాయి

ఒళ్లంతా చెమటలు పట్టాయి

అనంతరం తన ప్రసంగం తర్వాత వెంటనే చంద్రబాబు వేదికపై సీట్లో కూర్చుండిపోయారు. ఒళ్లంతా చెమటలు పట్టడంతో ఎదురుగా ఉన్న నీళ్లను తాగి వెంటనే తేరుకున్నారు. అక్కడినుంచి నేరుగా సచివాలయానికి వెళ్లిపోయారు. ఆ తర్వాత యథావిధిగా సమావేశాల్లో పాల్గొన్నారు.

బిఆర్ఎస్ మెడిసిటీ

బిఆర్ఎస్ మెడిసిటీ

రాజధాని ప్రాంతంలోని దొండపాడు గ్రామంలో గురువారం బీఆర్‌ఎస్‌ మెడిసిటీ వైద్య వర్సిటీకి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. రాష్ట్రాన్ని విజ్ఞాన కేంద్రంగానే కాదని, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతామని చంద్రబాబు స్పష్టం చేశారు.

దుబాయ్ నుంచి కూడా ఇక్కడకు వచ్చేలా

దుబాయ్ నుంచి కూడా ఇక్కడకు వచ్చేలా

త్వరలోనే విజయవాడ-గుంటూరు నగరాలు వైద్య కేంద్రాలుగా (మెడికల్‌ హబ్‌) మారుతాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఒకప్పుడు ఎడారి ప్రాంతంగా ఉన్న దుబాయ్‌ ఇప్పుడు అనేక వ్యాపారాలకు నిలయమై ప్రపంచాన్ని ఆకర్షిస్తోందని, భవిష్యత్తులో దుబాయ్‌ నుంచి కూడా వైద్యానికి ఇక్కడికి వచ్చేలా వైద్య విద్యాలయాలు, పరిశోధన సంస్థలను నెలకొల్పటానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఇందులో భాగంగానే రూ.12 వేల కోట్లతో బీఆర్‌ శెట్టి గ్రూపు రాజధాని ప్రాంతంలో ఆరోగ్య నగరాన్ని నిర్మిస్తోందని తెలిపారు.

English summary
Chief Minister Chandrababu Naidu will lay the foundation stone for ‘BRS Medicity’ at Dondapadu on August 10. It mainly comprises a medical university, a super-specialty hospital and a medical devices manufacturing unit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X