తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెద్ద నగదు నోట్ల రద్దుపై ఎంపి వినూత్న నిరసన...హరికథ చెప్పిన చిత్తూరు ఎంపి

పెద్ద నగదు నోట్ల రద్దుపై చిత్తూరు ఎంపి శివప్రసాద్ తిరుపతిలోని ఎస్ బి ఐ బ్రాంచ్ వద్ద హరికథ చెప్పారు. ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో ఆయన హరికథ రూపంలో వివరించారు. ప్రధాని మోడీ ప్రజల బాధలను గుర్తించ

By Narsimha
|
Google Oneindia TeluguNews

తిరుపతి : ఆయన ఓ టిడిపి ఎంపి. పెద్ద నగదు నోట్ల రద్దును ఆ పార్టీ స్వాగతించింది. కాని, ఇంకా నగదు అందుబాటులోకి రాకపోవడంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అసహనం వ్యక్తం చేశారు. అయితే అదే తరహలో ఆ పార్టీకి చెందిన ఎంపి శివప్రసాద్ కూడ హరికథ చెప్పి తన నిరసనను వ్యక్తం చేశారు.

పెద్ద నగదు నోట్ల రద్దుపై ప్రజల ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఈ నగదును రద్దుచేసి పదమూడు రోజులు దాటుతున్నా ప్రజల అవసరాల మేరకు కరెన్సీ అందుబాటులోకి రాలేదు. దీంతో ప్రజలు బ్యాకులు, ఎటిఎం ల వద్ద బారులు తీరుతున్నారు. ఈ కష్టాలపై ప్రజలు వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. తాజాగా ఓ ఎంపి కూడ ప్రజలతో కలిసి తన నిరసనను తెలిపారు.

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు ఎంపి వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేశారు. సినీనటుడైన శివప్రసాద్ వేషాలు వేస్తూ వినూత్నంగా ప్రదర్శనలు ఇస్తుంటాడు. ప్రభుత్వం తీసుకొన్న కార్యక్రమాలపై తన అభిప్రాయాలను వేషాల ద్వారా బయటపెడుతుంటాడు.

పెద్ద నగదు నోట్ల రద్దుపై ప్రజల ఇబ్బందులను ఆయన హరికథ చెప్పి తన నిరసనను వ్యక్తం చేశారు. తిరుపతిలోని ఎస్ బి ఐ బ్రాంచి ఎదుట హారికథ వేషం వేసుకొని ప్రజలు పడుతున్న భాదలను ఆయన వివరించారు.

chittoor mp demonstartion harikatha on currency ban

ప్రజల భాదలను కళ్ళకు కట్టిన ఎంపి

డబ్బులేక రోగులు హరి హారి...భాదలేమని జెప్పను హరి హరి
వ్యాపారస్తుల కష్టాలు హరిహరి..ఏమని జెప్పను హరిహరి
వ్యాపారస్తుల కష్టాలు హరిహరి...ఏమని జెప్పను హరిహరి

పెళ్ళిళ్ళన్నీ ఆగిపోయాయి..కడుపుకోత మిగిలే..తందానా దేవనందానానా
పసిబిడ్డకు పాలను కొనలేక తల్లి ఏడ్చినాదో..తందానా దేవనందానానా
పెళ్ళిళ్ళన్నీ ఆగిపోయినయి, కడుపుకోత మిగిలే...తందానా దేవనందానానా

అంటూ చిత్తూరు ఎంపి శివప్రసాద్ హరికథ చెప్పాడు. ఎస్ బి ఐ బ్రాంచ్ వద్దకు నగదు మార్పిడి కోసం వచ్చిన ఖాతాదారులకు ఎంపి హరికథ చెబుతూ ప్రజల బాధను వివరించారు. క్యూ లైన్లో ఉన్నవారంతో ఈ హరికథ వింటూ కాలక్షేపం చేశారు. హరికథ వింటూ క్యూ లైన్ లో నిలబడిన బాధను మర్చిపోయారు.

English summary
chittor mp shivaprasad demonstration a harikatha on sbi branch in tiupati.he is explain the people probelms.after 13 days currency banned. peoples still suffering he said. central governament react immediatly he demand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X