వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'విజయమ్మకి ఓటేయనందుకే హుధుద్'పై దర్యాఫ్తు

By Srinivas
|
Google Oneindia TeluguNews

 CID investigation on Hudhud - Vijayamma comments
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి విజయమ్మను ఓడించినందునే హుధుద్ తుఫాను బదులు తీర్చుకుందని ఇంటర్నెట్లో అభ్యంతరక వ్యాఖ్యలు పోస్టు చేసిన వ్యవహారం పైన ఆంధ్రప్రదేశ్ సీఐడీ దర్యాఫ్తును ముమ్మరం చేసింది. దీనికి సంబంధించి విశాఖపట్నానికి చెందిన అనుమానితుడిని అదుపులోకి తీసుకొని విచారించినట్లుగా తెలుస్తోంది.

విశాఖలో జోతిష్యం చెప్పుకునే ఈ వ్యక్తే అభ్యంతరక వ్యాఖ్యలు పోస్టు చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. తుఫానును రాజకీయాలకు ముడిపెడుతూ వ్యాఖ్యలు పోస్టు చేయడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. దీని పైన సీఐడీ దర్యాఫ్తు ప్రారంభించింది.

విశాఖపట్నం, గుంటూరులకు ప్రత్యేక బృందాలను పంపించారు. విశాఖ వెళ్లిన బృందం జ్యోతిష్యుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని పైన దర్యాఫ్తు కొనసాగుతోంది.

కాగా, గత ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయమ్మకు ఓటు వేయక పోవడం వల్లనే హుధుద్ తుఫాను విశాఖపట్నం వాసుల పైన ప్రతీకారం తీర్చుకుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభిమానులు అభిప్రాయపడుతున్నారని ఓ వెబ్‌సైట్లో వచ్చిన అంశాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.

ఇది ఇతరుల మనోభావలను దెబ్బతీయటంగానే పరిగణిస్తున్నారు. దీని పైన చట్టపరమైన చర్యలకు సిద్ధమై విచారణ జరుపుతున్నారు. అయితే, ఈ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది.

ఇటీవల హుధుద్ తుఫాను ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. హుధుద్ తుఫాను నేపథ్యంలో ఏపీలో వేల కోట్ల నష్టం జరిగింది. నలభై మంది వరకు మృతి చెందారు. వేలాది పశువులు, పక్షులు మృతి చెందాయి. పంటలు నేలకొరిగాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీలు ఏరియల్ సర్వే చేశారు.

ఇదిలా ఉండగా.. అక్టోబర్ 12వ తేదీనే తీరప్రాంత ప్రజలను తుఫాన్లు వణికిస్తున్నాయి. 2013 అక్టోబర్ 12న ఫైలిన్ పెను తుపాను ఒడిశాతోపాటు ఉత్తర కోస్తా జిల్లాలను అతలాకుతలం చేసింది. ఆనాడు ఫైలిన్ తుపాను విశాఖపట్నం సమీపంలోని ఒడిశాలోగల గోపాలపురం వద్ద తీరం దాటింది.

ఫైలిన్ వల్ల ఉత్తర కోస్తాతో పాటు ఒడిశాలో భారీ నష్టం జరిగింది. ఫైలిన్ వల్ల ఆంధ్రప్రదేశ్ కన్నా ఒడిశా మరింత ఎక్కువ నష్టపోయింది. సరిగ్గా ఏడాది తర్వాత అంటే 2014 అక్టోబర్ 12న హుధుద్ పెను తుపాను ఉత్తర కోస్తా జిల్లాలను వణికించింది.

విశాఖపట్నంతో పాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో దీనివల్ల జనజీవనం స్తంభించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా విశాఖపట్నం ఈ తుపానుకు దెబ్బతిన్నది. సెప్టెంబర్ - అక్టోబర్ నెలల్లో తుపాన్లు వస్తున్నప్పటికీ, ఒకే తేదీన తుపాన్లు కోస్తా తీరాన్ని తాకింది.

English summary
CID investigation on Hudhud - Vijayamma comments
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X