వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు దూరం పెట్టారా: బిజెపిని అఖిలప్రియ ఎందుకు పిలవడం లేదు?

నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా బిజెపి ఏపీలో తన బలం ఎంత ఉందో నిరూపించుకునే అవకాశం ఏర్పడింది. కానీ ఆ పార్టీ పోటీ చేయడం లేదు. కనీసం టిడిపికి ఇప్పటి వరకు అనుకూలంగా ప్రకటన చేసిందీ లేదు.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా బిజెపి ఏపీలో తన బలం ఎంత ఉందో నిరూపించుకునే అవకాశం ఏర్పడింది. కానీ ఆ పార్టీ పోటీ చేయడం లేదు. కనీసం టిడిపికి ఇప్పటి వరకు అనుకూలంగా ప్రకటన చేసిందీ లేదు.

నంద్యాల ఉపఎన్నికలు: గెలుపుపై టిడిపికి అనుమానాలున్నాయా?నంద్యాల ఉపఎన్నికలు: గెలుపుపై టిడిపికి అనుమానాలున్నాయా?

2019 నాటికి టిడిపితో విడిపోవాలని బిజెపి భావిస్తే.. నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ ద్వారా ఏపీలో తమ సత్తా తెలుసుకునే అవకాశం ఏర్పడింది. అయితే టిడిపి - బిజెపి మధ్య పొత్తు అంశం ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉంది.

పవన్ కళ్యాణ్ ప్రకటన.. బిజెపి మాత్రం

పవన్ కళ్యాణ్ ప్రకటన.. బిజెపి మాత్రం

నంద్యాల ఉప ఎన్నికల్లో బిజెపి నేతలు కనీసం తమ మిత్రపక్షం టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి తరఫున ప్రచారం కూడా నిర్వహించడం లేదు. ఈ ఉప ఎన్నికపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన చేశారు. తటస్థంగా ఉంటున్నట్లు చెప్పారు. కానీ బిజెపి మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు

కాకినాడలో కలిసి పోటీ

కాకినాడలో కలిసి పోటీ

నంద్యాల ఉప ఎన్నికలతో పాటు కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో టిడిపి -బిజెపి కలిసి పోటీ చేస్తున్నాయి. కానీ నంద్యాలలో పోటీపై బిజెపి మౌనంగా ఉందని అంటున్నారు.

అందుకే పోటీకి దూరమా?

అందుకే పోటీకి దూరమా?

నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీకి నిలబెట్టకపోవడంపై, అలాగే, టిడిపికి మద్దతివ్వక పోవడంపై బిజెపికి వద్ద రెండు కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. ఒకటి నంద్యాల ఉప ఎన్నికలు ప్రధానంగా టిడిపి - వైసిపిలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నంద్యాల ప్రజలు కూడా ఈ రెండు పార్టీల వైపే చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పోటీకి దూరమని భావించి ఉంటుందని అంటున్నారు. దాంతో పాటు టిడిపితో పొత్తు విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. అది కూడా ఓ కారణమని అంటున్నారు.

 ముస్లీం ఓట్ల కోసం దూరం పెట్టిన చంద్రబాబు

ముస్లీం ఓట్ల కోసం దూరం పెట్టిన చంద్రబాబు

నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో మిత్రపక్షంగా బిజెపి పాల్గొనాలని టిడిపి నేతలు, చంద్రబాబు ఎవరూ సూచించడం లేదు. బిజెపి నేతలను ప్రచారానికి ఆహ్వానించడం లేదు. దానికి ఇక్కడ ఎక్కువ మొత్తంలో ఉన్న ముస్లీం ఓట్లు, ప్రత్యేక హోదా అంశమే కారణమని అంటున్నారు. అందుకే చంద్రబాబు, భూమా బ్రహ్మానంద రెడ్డి, అఖిలప్రియలు బిజెపి నేతలను ప్రచారానికి పిలవడం లేదంటున్నారు.

English summary
While many thought BJP would use the Nandyal bypoll to test its popularity while riding on the Modi wave, local considerations for TDP ensured that not only its alliance partner would not contest, but also ensured that no BJP leader campaigns for TDP candidate Bhuma Brahmananda Reddy for the bypoll slated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X