అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మనిషిని చంపితే ఎంత నేరమో అక్కడ చెట్లు నరికినా అంతే నేరం: చంద్రబాబు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: పచ్చదనం, పరిశుభ్రత, అభివృద్ధి మేళవించిన సుందర రాజధాని నగరంగా నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిని తీర్చిదిద్దేందుకు ప్రజలంతా ముందుకు రావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.

గుంటూరు జిల్లాలోని తుళ్లూరు మండలంలోని అనంతవరం గ్రామంలో ప్రభుత్వం బుధవారం నిర్వహించిన కార్తీక వనమహోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏటా 50 కోట్ల మొక్కలు నాటుతామన్నారు.

హరితాంధ్రప్రదేశ్‌లో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఏటా 10 మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మొక్కల పెంపకానికి 350 కోట్లు కేటాయించామని, అవసరమైతే మరిన్ని నిధులు అందించేందుకూ సిద్ధంగా ఉన్నామన్నారు.

 ఐదేళ్లలో హరితాంధ్ర సాధిద్దాం: చంద్రబాబు

ఐదేళ్లలో హరితాంధ్ర సాధిద్దాం: చంద్రబాబు


కృష్ణానది పరివాహక ప్రాంతంలోని రాజధానిలో ఎల్లప్పుడూ నీటి నిల్వలు 6 నుంచి 7 మీటర్ల లోపు ఉండే విధంగా వాటర్ మేనేజమెంట్‌ను అమలు చేస్తామన్నారు. అలాగే రాజధాని పరిధిలోని 18 ప్రాంతాల్లో కోటి మొక్కలు పెంచేందుకు నర్సరీలు ఏర్పాటు చేస్తామని, కృష్ణా నదిలో వాటర్ కార్స్ నడుపుతామని తెలిపారు. అతివృష్టి, అనావృష్టికి కారణం పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేయటమేనన్నారు.

ఐదేళ్లలో హరితాంధ్ర సాధిద్దాం: చంద్రబాబు

ఐదేళ్లలో హరితాంధ్ర సాధిద్దాం: చంద్రబాబు


రాష్ట్రంలో 974 కిలోమీటర్ల పొడవునా తీరప్రాంతం ఉన్నందున తుపాన్‌లు వచ్చే అవకాశం అధికంగా ఉందన్నారు. సముద్ర తీరప్రాంతంలో మడ అడవుల అవసరం ఉందన్నారు. ప్రతి పాఠశాల విద్యార్థి గ్రీన్ కాప్స్‌లో సభ్యునిగా చేరి మొక్కలు పెంచాలన్నారు. రాష్ట్రంలోని 15,000 పాఠశాలల్లో 10.19 లక్షల మంది విద్యార్థులు సభ్యులుగా ఉన్నారన్నారు.

ఐదేళ్లలో హరితాంధ్ర సాధిద్దాం: చంద్రబాబు

ఐదేళ్లలో హరితాంధ్ర సాధిద్దాం: చంద్రబాబు


మొక్కల పెంపకాన్ని బాల్యం నుంచే నేర్పాలనే ఉద్దేశ్యంతో ప్రతి హైస్కూల్‌లో నర్సరీ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రకృతి, మనుషులు వేర్వేరు కాదనే విషయాన్ని గుర్తించి మొక్కల పెంపకానికి అందరూ కృషి చేయాలన్నారు. మొక్కలకు నీళ్లు పోసే కార్యక్రమాన్ని డ్వాక్రా సంఘాలకు అప్పగిస్తామన్నారు.

 ఐదేళ్లలో హరితాంధ్ర సాధిద్దాం: చంద్రబాబు

ఐదేళ్లలో హరితాంధ్ర సాధిద్దాం: చంద్రబాబు

2022 నాటికి భారతదేశంలో మూడవ రాష్ట్రంగా, 2029కి మొదటిదిగా, 2050కి ప్రపంచంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. మొక్కల పెంపకంపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరిగితే భవిష్యత్ తరాలకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రులు గోపాలకృష్ణారెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, రాష్ట్ర అటవీశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అశ్వనీకుమార్ ఫరీదా తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 23 శాతమే ఉన్న అడవులను 50 శాతం వరకు పెంచటానికి కృషి చేస్తామన్నారు. అడవుల్లో పెలికాప్టర్ ద్వారా విత్తనాలు చల్లిస్తున్నామన్నారు. ప్రతి ఏటా మొక్కలు నాటే కార్యక్రమాన్ని జులై 1న మొదలు పెట్టి కార్తీక వనమహోత్సవంతో ముగిస్తామని చెప్పారు.

మనిషిని చంపితే ఎంత నేరమో సింగపూర్‌లో చెట్లు నరికినా అంతే నేరమని ఆయన తెలిపారు. చెట్లు నరకాలంటే అక్కడ ప్రభుత్వ అనుమతి తీసుకొవాల్సిందేనన్నారు. చెట్లు నరికితే భవిష్యత్ అంధకారమవుతుందన్న దూరదృష్టితోనే సింగపూర్ ప్రభుత్వం ఇంత కఠినమైన విధానాన్ని అవలంబిస్తోందని తెలిపారు.

English summary
CM Chandrababu Speech at Vana Mahotsavam in Guntur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X