నెల్లూరుకు బాబు: నారాయణ నెల్లూరు వెళ్తుంటే కొడుకు జ్ఞాపకాలు ఇలా

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటన ముగించుకొని శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారు. శనివారం ఆయన నెల్లూరుకు వెళ్లనున్నారు.

Subscribe to Oneindia Telugu

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటన ముగించుకొని శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారు. శనివారం ఆయన నెల్లూరుకు వెళ్లనున్నారు.

పరిస్థితి ఇదిగో ఇలా? అప్పటిదాకా ప్రశాంతంగా నారాయణ.. ఒక్కసారిగా..: నిషిత్ పేరిట ట్రస్ట్

రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్‌ మృతి చెందిన విషయం తెలిసిందే. చంద్రబాబు నెల్లూరులోని నారాయణ ఇంటికి వెళ్లి పరామర్శించనున్నారు.

తన తరఫున సంతాప సందేశం పంపారు

గురువారం నిషిత్ అంత్యక్రియలు జరిగాయి. చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండటంతో హాజరుకాలేని పరిస్థితి. దీంతో ఆయన పేరిట ప్రత్యేకంగా దూతను సంతాప సందేశంతో పంపారు. సీఎం తరఫున నిషిత్‌ పార్థివ దేహంపై పుష్ప గుచ్ఛాన్ని ఉంచి, మంత్రి కుటుంబ సభ్యులకు సీఎం తరఫున సానుభూతిని తెలిపారు.

నారాయణకు జ్ఢాపకాలు

మంత్రి హోదాలో నారాయణ పలుమార్లు నెల్లూరు బ్యారేజీ పనులను పర్యవేక్షించటానికి వచ్చారు. అనేక సందర్భాల్లో ఆయన చుట్టుపక్కల ప్రదేశాల్లో తిరిగారు. ఇప్పుడు ఎప్పుడు నెల్లూరు వంతెన పర్యవేక్షించటానికి వచ్చినా దగ్గరలో ఉన్న నిషిత్‌ అంత్యక్రియలు నిర్వహించిన ఘాట్‌ కళ్లకు కనిపిస్తూ ఉంటుంది.

రైల్లో వెళ్తుంటే..

ఎప్పుడు రాజధాని నుంచి రైలులో ప్రయాణిస్తూ నెల్లూరు వచ్చినా వంతెన పక్కగా ఘాట్‌ను చూస్తూ వెళ్లే పరిస్థితి. నిషిత్‌కు జ్ఞాపకంగా పెన్నా నది ఒడ్డున ఏర్పాటు చేసిన ఘాట్‌ మాత్రం మిగిలింది. నిషిత్ తీరని దుఖాన్ని మిగిల్చి జ్ఞాపకంగా మారిపోయాడు.

నిషిత్‌తో పాటు మృతి చెందిన రాజా రవిచంద్ర ఎవరంటే.

నిషిత్‌తో పాటు రాజా రవిచంద్ర మృతి చెందారు. అతని తండ్రి టంగుటూరుకు చెందిన వ్యాపారవేత్త. పేరు మోహన కృష్ణ. కొడుకు మృతదేహాన్ని చూసి తండ్రి మోహనకృష్ణ, తల్లి సుభాషిణి కన్నీరుమున్నీరు అయ్యారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు.

English summary
Andhra Pradesh Chief Minister Chandrababu to visits Minister Narayana home on Saturday.
Please Wait while comments are loading...