శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బట్టలన్నీ విప్పితేనే ఎక్స్‌రే తీస్తా: మహిళతో రేడియో గ్రాఫర్ వెకిలిచేష్టలు

By Pratap
|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళం: శ్రీకాకుళంలోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్సెస్ (రిమ్స్)లో రేడియోగ్రాఫర్ వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. ఈ ఆస్పత్రిలోని ఎక్స్‌రే విభాగానికి వచ్చే మహిళలను అతను వేధిస్తున్నట్టు తేలింది. ఎక్స్‌రే తీయాలంటే బట్టలన్నీ విప్పేయాలంటూ షరతు పెట్టాడు. ఎక్స్‌రే బాగా రావాలంటే బట్టలన్నీ విప్పక తప్పదంటూ చెబుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి.

శ్రీకాకుళం జిల్లా రిమ్స్ ఆస్పత్రిలో ఎక్స్ రే విభాగంలో వెంటకరమణ అనే ఉద్యోగి విధులు నిర్వహిస్తున్నాడు. రిమ్స్‌లోని ఎక్స్‌రే విభాగానికి ఓ యువతి ఎక్స్‌ రే తీయించుకునేందుకు వచ్చింది. ఎక్స్ రే బాగా రావాలంటే బట్టలు విప్పేయమని వేధించాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. అంతేకాదు ఆ వ్యక్తిపై నిర్భయ చట్టం ప్రయోగించాలని కోరింది.

Complaint against RIMS radiographer in Srikakulam

దీంతో మరికొంత మంది యువతులు కూడా తమతో వెంకటరమణ గతంలో ఇలాగే ప్రవర్తించాడని వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న ఆసుపత్రి వర్గాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. అయితే ఉద్యోగి తాను అమాయకుడిని అని తనకు ఏమీ తెలియదని ఆ మహిళ తన సోదరితో కలిసి వచ్చిందని, తాను ఎలా దుస్తులు విప్పమని అడుగుతానని అన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

దీనిపై రిమ్స్ డైరక్టర్ బీఎల్ఎన్ ప్రసాద్ స్పందించారు. రిమ్స్‌లో ఇలా జరగడం బాధాకరమన్నారు. పైగా వెంకటరమణ గతంలో కూడా ఇలాంటి సంఘటనలకు పాల్పడినట్టు తెలిసిందన్నారు. అయితే, వెంకటరమణ తాత్కాలిక ఉద్యోగి మాత్రమేనని, దీనిపై విచారణ జరిపి, నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

English summary
It is alleged that radiographer Venkata Ramana misbehaved with women at RIMS in Srikakulam of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X