మోహన్ బాబుకు చిక్కు!: జయసుధ 'రౌడీ'పై ఫిర్యాదు

Posted by:
 
Share this on your social network:
   Facebook Twitter Google+    Comments Mail

హైదరాబాద్: ప్రముఖ నటి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకురాలు జయసుధ సికింద్రాబాదు శాసన సభ స్థానం నుండి కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేస్తున్నందున ఆమె నటించిన రౌడీ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని తెలంగాణ న్యాయవాదుల ఐక్యకార్యాచరణ సమితి బి నర్సింహా రెడ్డి ఎన్నికల సంఘాన్ని కోరారు.

ఈ మేరకు శనివారం సచివాలయంలో ఆయన ఎన్నికల ప్రధాన అధికారిని కలిశారు. జయసుధ నటించిన రౌడి చిత్రం ప్రదర్శనను నిలిపివేయాలంటూ వినతిపత్రం ఇచ్చారు. జయసుధ నటించిన రౌడీ సినిమా ఎన్నికల పైన ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన తెలిపారు. కాగా, మోహన్ బాబు, జయసుధ తదితరులు నటించిన రౌడీ సినిమా ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.

మోహన్ బాబుకు చిక్కు!: జయసుధ 'రౌడీ'పై ఫిర్యాదు

టిడిపి అధికారంలోకి వస్తేనే మనం కోరుకున్న అభివృద్ధి జరుగుతుందని ఆ పార్టీ చేవెళ్ల ఎంపి అభ్యర్థి తూళ్ల వీరేందర్ గౌడ్ అన్నారు. శనివారం బషీరాబాద్, పెద్దేముల్, కోట్‌పల్లిల్లో తాండూరు అసెంబ్లీ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎం నరేష్‌తో కలిసి రోడ్‌షో, ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా వీరేందర్‌గౌడ్, నరేష్ మాట్లాడుతూ జిల్లా, తాండూరు నియోజకవర్గాల్లో కొంతైనా అభివృద్ధి జరిగిందంటే అదీ టీడీపీ హాయంలోనేని అన్నారు. దేవేందర్ గౌడ్ మంత్రిగా ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లాతోపాటు తాండూరు ప్రాంతంలో కనీస సౌకర్యాలు మెరుగుపడ్డాయన్నారు. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన మహేందర్‌రెడ్డి కుటుంబంలో అందరికీ పదువులు ఇప్పించుకొని డబ్బు సంపాదించుకోవడం మినహ ఈ ప్రాంతం అభివృద్ధి చేసింది ఏమీ లేదన్నారు.

English summary
Complaint on actor Jayasudha's Rowdy film to Election Commission.
Write a Comment