అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతి: 'ప్లాన్ ప్రకారం చంద్రబాబు, లోకేష్ పక్కన పెడ్తున్నారు'

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి నిర్మాణానికి స్విస్ ఛాలెంజ్ అని చెప్పడం వెనుక కుట్ర దాగి ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గౌతమ్ రెడ్డి సోమవారం నాడు ఆరోపించారు.

స్విస్ ఛాలెంజ్ విధానం అసాధ్యమని గతంలోనే సుప్రీం కోర్టు డైరెక్షన్స్ ఇచ్చిందన్నారు. ఈ విధానంలో పారదర్శకత లదేని కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టం చేసిందని తెలిపారు. సింగపూర్ కంపెనీలతో లాలూచీ వల్లనే చంద్రబాబు ఈ విధానాన్ని తెరపైకి తెచ్చారన్నారు.

సుప్రీం వద్దన్నా, కేంద్రం వద్దన్నా చంద్రబాబు స్విస్ ఛాలెంజ్ వైపు మొగ్గు చూపడం వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్ దేశీయ కంపెనీలను ఓ ప్లాన్ ప్రకారం దూరం పెడుతున్నారని ధ్వజమెత్తారు.

బాబు, లోకేష్‌పై ఆరోపణ

బాబు, లోకేష్‌పై ఆరోపణ

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ ప్లాన్ ప్రకారం, కుట్రతో అమరావతి రాజధాని నిర్మాణానికి స్విస్ ఛాలెంజ్ అంటున్నారని వైసిపి నేత గౌతమ్ రెడ్డి సోమవారం ఆరోపించారు.

అమరావతి

అమరావతి

నవ్యాంధ్ర రాజధాని అమరావతిని స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో అభివృద్ధి చేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిని వైసిపి తప్పుబడుతోంది.

వైయస్ జగన్

వైయస్ జగన్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ నేతలు స్విస్ ఛాలెంజ్ విషయంలో కుట్ర కోణం చూస్తున్నారు.

వైసిపి

వైసిపి

తాజాగా, చంద్రబాబు రాజధాని అమరావతి నిర్మాణానికి స్విస్ ఛాలెంజ్ అని చెప్పడం వెనుక కుట్ర దాగి ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గౌతమ్ రెడ్డి మరోసారి ఆరోపించారు.

English summary
YSRCP leader Goutam Reddy alleged that conspiracy behind swiss challenge
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X