వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు: వరినాటు యంత్రంతో, కోడిని పట్టుకుని..(పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

ఏలూరు: వ్యవసాయంలో ఖర్చు తగ్గి ఆదాయం పెరగాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కలవపూడిలో మలివిడత జన్మభూమి కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జిల్లాలో నీటి ఎద్దడి లేకుండా చేస్తామని అన్నారు.

మూడు, నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా మంచినీరు అందిస్తామని చెప్పారు. రాబోయే రెండో పంటకు తప్పకుండా నీళ్లు అందిస్తామని చెప్పారు. ఆదర్శ పాఠశాలల ద్వారా పిల్లలను ప్రభుత్వమే చదివిస్తుందని చెప్పారు.

పిల్లలను బాగా చదవిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి వస్తుందని ఆయన అన్నారు. ప్రతి గ్రామం స్వచ్ఛ గ్రామంగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి ఉండాలని, మరుగుదొడ్డి నాగరిక ప్రపంచానికి చిహ్నమని చంద్రబాబు ్న్నారు. రుణమాఫీ లబ్ధిదారుల జాబితాను బహిరంగంగా వెల్లడిస్తామని చంద్రబాబు చెప్పారు.

రూ. 1300 కోట్లతో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల అభివృద్ధిని చేపట్టనున్నట్లు చంద్రబాబు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం కలవపూడిలో ఆయన పర్యటించారు. పారిశుద్ధ్యం కోసం ప్రతి గ్రామ పంచాయతీకి రూ. 10 లక్షల చొప్పున నిధులు కేటాయిస్తామని ఆయన చెప్పారు.

చంద్రబాబు ఇలా..

చంద్రబాబు ఇలా..

పశ్చిమ గోదావరి జిల్లా దొడ్డనపూడి గ్రామంలో మహిళా రైతులతో చంద్రబాబు నాయుడు ఇలా ధాన్యాన్ని చూస్తూ...

చంద్రబాబు ఇలా..

చంద్రబాబు ఇలా..

మహిళల ఉత్పత్తులను పరిశీలిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇలా కనిపించారు. సైకిల్ గుర్తులున్న సంచులు ఇలా దర్శనమిచ్చాయి.

చంద్రబాబు ఇలా...

చంద్రబాబు ఇలా...

ఆరు వరుసల వరి నాటు యంత్రాన్ని పరిశీలిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...

చంద్రబాబు ఇలా...

చంద్రబాబు ఇలా...

పొలం పిలుస్తోంది అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నినాదాన్ని అమలులోకి తెచ్చినట్లు గుర్తుగా..

చంద్రబాబు ఇలా...

చంద్రబాబు ఇలా...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ కోడెను ఆసక్తి చూస్తూ ఇలా కనిపించారు. రైతుతో మాట్లాడారు.

చంద్రబాబు ఇలా..

చంద్రబాబు ఇలా..

తన చేతితో చేపను పట్టుకుని పరిశీలిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇలా కనిపించారు.

చంద్రబాబు ఇలా..

చంద్రబాబు ఇలా..

కలవవపూడి గ్రామంలో నమూనా పాఠశాలలో కలెక్టర్ వివరణను వింటూ చంద్రబాబు ఇలా కనిపించారు.

చంద్రబాబు ఇలా...

చంద్రబాబు ఇలా...

వరినాటు యంత్రాన్ని నడుపుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇలా కనిపించారు.

చంద్రబాబు ఇలా..

చంద్రబాబు ఇలా..

పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబ నాయుడు కోడిని పట్టుకుని ఇలా ఆనందించారు.

చంద్రబాబు ఇలా.

చంద్రబాబు ఇలా.

పశు వైద్యశాలలో గేదెను ఇలా చూస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కనిపించారు.

పశ్చిమ గోదావరి జిల్లా దొడ్డిపట్ల చంద్రబాబు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్వార్థం కోసం రాష్ట్రాన్ని కాంగ్రెసు నాయకులు విభజించారని విమర్శించారు. విమర్శలను తట్టుకుని ఇసుక వేలం పాటలను మహిళలకు ఇచ్చామని ఆయన చెప్పారు.

English summary
Andhra Pradesh CM Nara Chandrababu Naidu toured West Godavari district and assured farmers all help.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X