వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయదేవ్‌కు కోర్టులో ఊరట: పిటిషన్ కొట్టివేత

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్‌కు కోర్టులో ఊరట లభించింది. ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికపై దాఖలైన ఫిర్యాదుపై కోర్టు తీర్పు వెల్లడించింది.

ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడిగా గల్లా జయదేవ్ ఎన్నిక చెల్లుతుందంటూ, ఆయనను కొనసాగించాలని న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఏపీ జిమ్నాస్టిక్స్ జనరల్ సెక్రటరీ రాజేష్‌కుమార్ పేరుతో దాఖలైన పిటిషన్‌ను కోర్టు కోర్టు కొట్టేసింది. నకిలీ పత్రాలతో పిటిషన్ వేసినవారిపై చర్యలు తీసుకోవాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.

Court says Galla Jayadev election will valid

అయితే తన సంతకాన్ని ఎవరో ఫోర్జరీ చేశారని, కోర్టులో తాను ఎలాంటి పిటిషన్‌ను దాఖలు చేయలేదని రాజేష్‌కుమార్ చెప్పారు. ఈమేరకు ఆయన కోర్టులో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు మలుపు తిరిగింది.

ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన గల్లా జయదేవ్ గత ఎన్నికల్లో పోటీ చేసి తెలుగుదేశం పార్టీ తరఫున పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు.

English summary
Telugudesam party MP Galla Jayadev election as Olympic association is valid, court says
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X