వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగనా-టీడీపీయా అని బీజేపీ డైలమా: శివాజీ ఆగ్రహం

By Srinivas
|
Google Oneindia TeluguNews

ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని ఏపీ విద్యార్థి ఐకాస, అఖిల పక్ష నాయకులు సోమవారం అన్నారు. హైదరాబాదులో ఏపీ విద్యార్థి ఐకాస ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా సాధాన పైన సమావేశం జరిగింది. ఈ సందర్బంగా పలువురు మాట్లాడారు.

ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, దానిని సాధించేందుకు విద్యార్థి నాయకులు కాలపరిమితి విధించి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తే, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు కలిసి నడుస్తామని అఖిల పక్ష నాయకులు చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టు మంచిదేనని, కానీ అందులో అవినీతి ఉందా లేదా చూడాలని శివాజీ మంగళవారం అన్నారు.

ఒకరి పైన మరొకరు విమర్శలు మాని ప్రత్యేక హోదా కోసం అందరు కలిసి పోరాడాలన్నారు. ఇందుకోసం ప్రతి నియోజకవర్గంలో జేఏసీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. గతంలో కాంగ్రెస్ తప్పిదం వల్లనే అది తన ఉనికి కోల్పోయిందని, ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం వారు పోరాటం చేసేందుకు ముందుకు వస్తున్నారని, వారిని కూడా కలుపుకు పోవాలన్నారు.

హోదా కోసం అన్ని పార్టీలు రాజకీయాలను పక్కన పెట్టాలన్నారు. ప్రతి ఆదివారం హోదా కోసం ధర్నాలు చేపట్టాలని, జాతీయ రహదార్లను, దిగ్బంధించాలని, రైళ్ల రాకపోకలను అడ్డుకోవాలన్నారు. ఈ నిరసన కార్యక్రమాలలో ఎలాంటి ఆస్తి నష్టాలు జరగవద్దన్నారు.

ప్రత్యేక హోదా

ప్రత్యేక హోదా

కేంద్ర ప్రభుత్వంలో ఉంటూనే పునర్విభజన చట్టంలోని అంశాల సాధనకు ప్రయత్నిస్తామని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు తెలిపారు. సాధనకు కాల పరిమితి అంశాన్ని సీఎం దృష్టికి తీసుకు వెళ్తామన్నారు.

ప్రత్యేక హోదా

ప్రత్యేక హోదా

ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీతో కొనసాగాలా లేక జగన్‌తో జతకట్టాలా అన్న దాని పైన బీజేపీ ఆలోచిస్తోందని, అందుకే ప్రత్యేక హోదా పైన జాప్యం చేస్తోందని విమర్శించారు.

 ప్రత్యేక హోదా

ప్రత్యేక హోదా

చట్టంలో పేర్కొన్న అంశాలను సాధిస్తే రాష్ట్రానికి రూ.5 లక్షల కోట్లు వస్తాయని చెప్పారు. వీటిని సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు.

ప్రత్యేక హోదా

ప్రత్యేక హోదా

టీడీపీ త్వరలో నిర్వహించనున్న మహానాడులో ప్రత్యేక హోదా పైన తీర్మానం చేయాలని పీసీసీ మాజీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రత్యేక హోదా కోసం అవసరమైతే రాజ్యాంగ సవరణ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు.

ప్రత్యేక హోదా

ప్రత్యేక హోదా

ప్రత్యక్ష రాజకీయాల నుండి వచ్చిన వారు కాకుండా రాజ్యసభ ద్వారా వెళ్లిన వారే ఎక్కువ మంది కేంద్రంలో మంత్రులుగా ఉండటం వల్లే వారికి ప్రజా సమస్యలు అర్థం కావడం లేదని సినీ నటుడు శివాజీ అన్నారు.

 ప్రత్యేక హోదా

ప్రత్యేక హోదా

భూసేకరణ బిల్లు ఆమోదానికి కేంద్రం చూపుతున్న శ్రద్ధలో పది శాతం పెడితే ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ అన్నారు.

English summary
CPI (M), Cong. seek special Status for AP
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X