విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వివాదాస్పద భూమిలో ఫెన్సింగ్ గోడను తన్ని గాయపడిన సిపిఐ నారాయణ

సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కాలికి గాయమైంది. ఆయనను ఆసుపత్రిలో చికిత్స చేశారు. రెండురోజుల పాటు ఆయన విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఆదివారం ఉదయం పూట ఈ ఘటన చోటుచేసుకొంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

విశాఖపట్టణం: సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కాలికి గాయమైంది. ఆయనను ఆసుపత్రిలో చికిత్స చేశారు. రెండురోజుల పాటు ఆయన విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఆదివారం ఉదయం పూట ఈ ఘటన చోటుచేసుకొంది.

విశాఖ జిల్లాలోని కొమ్మాదిలో ఉన్న వివాదాస్పద భూములను పరిశీలించేందుకు సిపిఐ నేతలతో కలిసి నారాయణ వెళ్లారు. అయితే ఈ వివాదాస్పద భూముల్లో ఫెన్సింగ్ ను ఏర్పాటుచేశారు.

cpi national secretary Narayana injures in vizag

అయితే ఈ ఫెన్సింగ్ ను కాలికి బలంగా తన్నడంతో ఫెన్సింగ్ కు వాడిన సిమెంట్ ఇటుక నారాయణపై పడిపోయిందని సిపిఐ నాయకులు తెలిపారు.

దీంతో ఆయన కుడికాలి భాగంలో గాయమైంది.అయితే వెంటనే సిపిఐ నేతలు ఆయనను కొమ్మాదిలోని ఆసుపత్రిలో చేర్పించారు.

వైద్యులు ఆయనను పరీక్షించారు. అయితే ఆయన కాలుకు ఎలాంటి ప్రాక్చర్ కాలేదని వైద్యులు గుర్తించారు. కాలికి గాయమైనందున రెండు రోజుల పాటు ఆయన విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. నారాయణ సోమవారం నాడు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించాల్సి ఉంది.

English summary
cpi national secretary Narayana injured in Kommadi on Sunday.He was injured when he kicked on fensing wall in Kommadi. cpi leaders admitted in to hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X