వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎపి రాజధాని: అసెంబ్లీలో సిఆర్‌డిఎ బిల్లు, ముఖ్యాంశాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సిఆర్‌డిఎ) బిల్లును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారంనాడ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ బిల్లును సభలో ప్రవేశపెట్టగా స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు బిల్లును అనుమతించారు. బిల్లుపై సోమవారం సభలో చర్చ జరుగుతుంది.

30 ఏళ్ల పాటు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని బిల్లును రూపొందించినట్లు నారాయణ తెలిపారు. ఏపీ రాజధాని ప్రాంతం, ఇతరత్రా ఆస్తులు, యంత్రాంగం సీఆర్‌డీఏ సంస్థ పరిధిలోకి వస్తాయి. 91 పేజీ బిల్లులతో సీఆర్‌డీఏ బిల్లును ప్రభుత్వం రూపొందించింది. బిల్లులో ప్రధానంగా మూడు కమిటీలను ఏర్పాటు చేశారు.

అథారిటీకి సీఎం చైర్మన్‌గా 15 మంది సభ్యులతో సీఆర్‌డీఏను ఏర్పాటు చేశారు. సీఎస్‌ చైర్మన్‌గా నలుగురు సభ్యులతో ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఏర్పాటు చేశారు. అవసరమైతే ఏ అధికారినైనా, కార్యదర్శినైనా కమిటీ సమావేశానికి ఆహ్వానించే అవకాశం కల్పిస్తున్నారు. కన్వీనర్‌గా మున్సిపల్‌ అడ్మినిస్ర్టేషన్‌ కమిషనర్‌ను నియమించారు. సీఆర్‌డీఏ కోసం రూ. వెయ్యి కోట్ల మూలధనాన్ని ప్రభుత్వం కేటాయించింది. రూ.250 కోట్ల రివాల్వింగ్‌ ఫండ్‌ను కేటాయించారు. సీఆర్‌డీఏకి ఆర్థికపరమైన అధికారులు, షేర్లు, బాండ్లు, డిబెంచర్లను జారీ చేసే అవకాశం కల్పించారు.

CRDA bill proposed in AP assembly

సీఆర్‌డీఏ బిల్లులోని ముఖ్యాంశాలు :

# రోజువారీ వ్యవహారాలను సీఆర్‌డీఏ కమిషన్‌కు అప్పగింత
# ల్యాండ్‌పూలింగ్‌ కోసం ప్రత్యేక నిబంధన
# వీజీటీఎం ఉడాకు సంబంధించిన ఆస్తులు, అప్పులు, సిబ్బంది సీఆర్‌డీఏకు బదిలీ
# బిల్లుపై గవర్నర్‌ సంతకం కాగానే నోటిఫికేషన్‌, ఆ తరువాత భూ సమీకరణ ప్రారంభం
# భూ యజమానులకు సీఆర్‌డీఏ ద్వారా హక్కు పత్రాలు
# సీఆర్‌డీఏ పరిధిలో 10 శాతం భూమి పార్క్‌లు, ప్లేగ్రౌండ్స్‌, గార్డెన్‌లు, బహిరంగ ప్రదేశాలకు కేటాయింపు
# 30 శాతం రోడ్లు, యుటిలిటీ సర్వీస్‌కు కేటాయింపు
# 5 శాతం భూమి సామాజిక అవసరాల కోసం కేటాయింపు
# 5 శాతం భూమి పేదల ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించారు.

అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థను ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం శనివారం ఉదయం మంగళగిరిలో పర్యటించింది. టీబీ ప్లానిటోరియం, ప్రభుత్వాస్పత్రి స్థలాలను పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్‌, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, ల్యాండ్‌ సర్వే అధికారులతో కేంద్రం బృందం సమావేశమైంది.

English summary
Andhra Pradesh Municipal minister Narayana has proposed CRDA bill in assembly to fecilates AP capital construction.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X