నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సముద్రం అల్లకల్లోలం: చెన్నై, ఏపీలో హైలర్ట్, సూపర్ సైక్లోన్‌గా వార్ధా

|
Google Oneindia TeluguNews

చెన్నై/విశాఖపట్నం: వార్ధా తుఫాను ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలను వణికిస్తోంది. చెన్నైకి తూర్పు ఈశాన్యంలో 180కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందీ తుఫాను. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజాము నుంచే చెన్నై తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. వేగంగా వీస్తున్న గాలులు, భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తీరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ నిలిపివేశారు.

కాంచీపురం, తిరువళ్లూరులో ఆదివారం రాత్రి నుంచే భారీ వర్షాలు కురుస్తున్నాయి.
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. సోమవారం సాయంత్రం వరకు చెన్నైలో తుఫాను తీరం దాటే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ప్రభుత్వం అధికారులు, ప్రజలను అప్రమత్తం చేసింది.

ఏపీ హైలర్ట్: భారీ వర్షాలు, ఎగిసిపడుతున్న అలలు

సూపర్ సైక్లోన్‌గా వార్ధా తుఫాను మారుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో కూడా సముద్రం అలలు ఎగిసిపడుతున్నాయి. దీంతో తీర ప్రాంతాల అధికారులు, ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. మత్య్సకారులను వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు చేసింది. తూర్పుగోదావరి జిల్లా ఉపాడ తీరంలో అలలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి. అలల తాకిడికి రోడ్డు దెబ్బతింది. దీంతో కాకినాడ-ఉప్పాడ రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.

Cyclone Vardah: Tamil Nadu, Andhra Pradesh On High Alert, Chennai Braces For Storm

దక్షిణ కోస్తా తీర ప్రాంతాల్లో 36గంటల వరకూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వార్ధా తుఫాను నెల్లూరుకు తూర్పు ఆగ్నేయంగా 250 కి.మీల దూరంలో కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.

కాగా, తుఫాను సహాయక చర్యలను మంత్రి నారాయణ పర్యవేక్షిస్తున్నారు. 200మంది ఫైర్ సహాయక బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 150మంది గజఈతగాళ్లు తీర ప్రాంతాల్లో సిద్ధంగా ఉన్నారు. పలు పోర్టుల్లో హెచ్చరికలు కొనసాగుతున్నాయి. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి, మదనపల్లి ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.

విమానాల మళ్లింపు

తుఫాను కారణంగా చెన్నై విమానాశ్రయంలో దిగాల్సిన పలు విమానాలను శంషాబాద్ విమానాశ్రయానికి మళ్లిస్తున్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని రహదారులను కూడా తాత్కాలికంగా మూసివేస్తున్నారు.

వార్ధాపై చంద్రబాబు సమీక్ష

తుఫాను తీవ్రత, సహాయచర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష జరిపారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, ఇస్రో వాతావరణ, విపత్తు నిర్వహణ, జలవనరులు, విద్యుత్‌, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 255 లోతట్టు ప్రాంతాలను ప్రజలను సురక్షిత ప్రాంతాల ప్రజలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.

చెన్నై నగరానికి అతి సమీపంలో 'వర్ద' తుపాను కేంద్రీకృతమై ఉందని... దీంతో నెల్లూరు, ప్రకాశం అనంతపురం, కడప జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. పులికాట్‌ సరస్సు సమీపంలో ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.

తుఫాను తీవ్రత కారణంగా చెట్లు కూలితే వెంటనే తొలగించేందుకు కట్టర్లు సిద్ధం చేసుకోవాలని.. కూలిన విద్యుత్‌ స్తంభాలను గంటల వ్యవధిలోనే పునరుద్ధరించాలని సీఎం ఆదేశించారు. తుపాను బాధితులకు కూరగాయలు, పాలు, బ్రెడ్‌, ఇతర నిత్యావసరాలు పంపిణీకి సిద్ధం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు.

విపత్తుల్లో తీసుకున్న చర్యలతోనే అధికార యంత్రాంగం పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందన్నారు. తుపాను సమాచారాన్ని 82వేల మంది మత్స్యకారుల మొబైల్‌ ఫోన్లకు సందేశాలు పంపిన అధికారులను ఆయన అభినందించారు.

English summary
As cyclonic storm 'Vardah' is expected to make landfall this afternoon, a high alert has been sounded in north Tamil Nadu and southern Andhra Pradesh. Teams from the Navy and the National Disaster Response Force are on standby.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X