వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తృటిలో తప్పిన ప్రమాదం: పేలుడుతో ఉలిక్కిపడ్డ చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తృటిలో ప్రమాదం తప్పింది. గురువారం ఢిల్లీలో జరుగుతున్న ఇండోసాన్‌ ఎగ్జిబిషన్‌లో పాల్గొన్నారు చంద్రబాబు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇదే సమయంలో ఒక్కసారిగా సెంట్రలైజ్‌డ్‌ ఏసీ సిలిండర్‌ పెద్ద శబ్దంతో పేలింది. పేలుడు శబ్దంతో చంద్రబాబు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

cylinder blast near to Chandrababu meeting

వెంటనే చంద్రబాబును కమాండోలు, అధికారులు బయటికి తీసుకొచ్చారు. సిలిండర్ గ్యాస్ లీకై ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా, గతంలో చంద్రబాబు అలిపిరిలో జరిగిన పెను ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో గాయాలపాలైన చంద్రబాబు కొద్ది నెలల్లోనే కోలుకుని ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టారు.

English summary
A Cylinder blast near to Andhra Pradesh CM Chandrababu Naidu's meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X