వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరోసారి దాసరి సంచలన వ్యాఖ్యలు, ఎన్టీఆర్ అంటే జూ.ఎన్టీఆర్ కాదని..!

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దర్శకరత్న దాసరి నారాయణ రావు ఆదివారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ దర్శకుల పైన విసుర్లు విసిరారు. హీరో బాడీ లాంగ్వేజ్‌ను బట్టి కథలు తయారు చేసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. పాత్రలకు అనుగుణంగా బాడీ లాంగ్వేజ్ మార్చుకునే వారే అసలైన నటులు అన్నారు. కథను బట్టి నటుడి బాడీ లాంగ్వేజ్ ఉండాలన్నారు. చరిత్ర తెలుసుకోవడం ముఖ్యమని చెప్పారు.

ఎన్టీఆర్ అంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అనుకునే ప్రమాదముందని ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. చరిత్ర తెలుసుకోవడం ముఖ్యమని చెప్పారు. నిన్నటి తరం నటుడు కాంతారావుకు గొప్ప చరిత్ర ఉందన్నారు. అలాగే ఎంజీఆర్‌కు కూడా ఎంతో చరిత్ర ఉందని చెప్పారు. రఘుపతి వెంకయ్య పేరులో నాయుడును తీసేశారన్నారు.

తెలుగు సినిమా చరిత్రను కొంతమంది కబ్జా చేశారన్నారు. థియేటర్లనే కాకుండా సినీ చరిత్రను కబ్జా చేశారన్నారు. చరిత్ర రాసేందుకు మహా రచయితలు అవసరమన్నారు. కేవీ రెడ్డి, బీఎన్ రెడ్డి అవార్డులకు కులం పేరు అడ్డు రాలేదన్నారు. దాసరి ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన ఓ పుస్తకావిష్కరణలో పాల్గొన్నారు.

Dasari Narayana Rao controversy comments again

కాగా, ప్రముఖ సీనియర్ దర్శకుడు, దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో ప్రస్తుత టాలీవుడ్ నెం.1 హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించబోతున్నారు. ఈ విషయం అపీషియల్ గా ఇటీవల ఖరారైన విషయం తెలిసిందే. తారకప్రభు ఫిలింస్ పతాకంపై ఈ చిత్రం రానుంది. ఈ విషయాన్ని దాసరి నారాయణరావు స్వయంగా ప్రకటించారు.

English summary
Dasari Narayana Rao controversy comments again.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X