వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వైన్‌ఫ్లూ: కేంద్ర బృందంతో కెసిఆర్, ఆరోగ్యశాఖ మంత్రితో దత్తన్న(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ వ్యాధిని నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కేంద్ర బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. ఆస్పత్రుల్లో స్వైన్‌ఫ్లూ రోగులకు అందిస్తున్న చికిత్స, నివారణకు తీసుకున్న చర్యలను పరిశీలించింది.

అనంతరం శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును ఆయన క్యాంపు కార్యాలయంలో కేంద్ర బృందం సభ్యులు ప్రజారోగ్య శాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అశోక్‌కుమార్, డాక్టర్ శశిఖరే, డాక్టర్ ప్రదీప్, డాక్టర్ మహేష్, డాక్టర్ ప్రణయ్‌కుమార్ కలుసుకున్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సిఎంతో మాట్లాడిన బృందం సభ్యులు మాట్లాడారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలపై సంతృప్తి వ్యక్తంచేశారు. ఆరోగ్యశ్రీలో స్వైన్‌ఫ్లూను చేర్చడంవల్ల పేదలకు మెరుగైన వైద్యం, అందులోనూ ఉచితంగా అందుతుందని అశోక్ కుమార్ సిఎం కెసిఆర్‌తో అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ ప్రభావాన్ని బాగా తగ్గించడానికి ఉపయోగపడ్డాయని చెప్పారు.

కేంద్ర బృందంతో కెసిఆర్

కేంద్ర బృందంతో కెసిఆర్

రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ వ్యాధిని నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కేంద్ర బృందం సంతృప్తి వ్యక్తం చేసింది.

కేంద్ర బృందంతో కెసిఆర్

కేంద్ర బృందంతో కెసిఆర్

ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన స్వైన్‌ఫ్లూ ప్రభావాన్ని రాష్ట్రంలో తగ్గించడానికి ఇక్కడి ప్రభుత్వం తీసుకున్న చర్యలు బాగా ఉపయోగపడ్డాయని పేర్కొంది. రెండు రోజులపాటు ఈ బృందం నగరంలోని గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రులను సందర్శించింది.

కేంద్ర బృందంతో కెసిఆర్

కేంద్ర బృందంతో కెసిఆర్

శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును ఆయన క్యాంపు కార్యాలయంలో కేంద్ర బృందం సభ్యులు ప్రజారోగ్య శాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అశోక్‌కుమార్, డాక్టర్ శశిఖరే, డాక్టర్ ప్రదీప్, డాక్టర్ మహేష్, డాక్టర్ ప్రణయ్‌కుమార్ కలుసుకున్నారు.

ఆరోగ్యశాఖ మంత్రితో దత్తాత్రేయ

ఆరోగ్యశాఖ మంత్రితో దత్తాత్రేయ

స్వైన్ ఫ్లూ వైరస్ నివారణ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించడానికి కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు.

ఆరోగ్యశాఖ మంత్రితో దత్తాత్రేయ

ఆరోగ్యశాఖ మంత్రితో దత్తాత్రేయ

తెలంగాణలో విజృంభిస్తున్న స్వైన్‌ఫ్లూపై చర్చించేందుకు తెలంగాణ కేంద్ర మంత్రి దత్తాత్రేయ శుక్రవారం కేంద్ర ఆరోగ్యమంత్రి జేపీ నడ్డాతో భేటీ అయ్యారు.

ఆరోగ్య శాఖ మంత్రితో దత్తాత్రేయ

ఆరోగ్య శాఖ మంత్రితో దత్తాత్రేయ

ఈ సందర్భంగా త్రిసభ్య కమిటీ బృందం నివేదిక వచ్చిన తరువాత తగిన సహకారం అందిస్తామని ఆరోగ్యమంత్రి నడ్డా.. దత్తాత్రేయకు హామీ ఇచ్చారు.

కేంద్ర ఆరోగ్యమంత్రితో దత్తాత్రేయ భేటీ

న్యూఢిల్లీ: స్వైన్ ఫ్లూ వైరస్ నివారణ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించడానికి కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఇప్పటికే కేంద్ర వైద్య బృందం హైదరాబాద్‌లో రాష్ట్ర అధికారులు, వైద్యులతో సమీక్షిస్తూ ఉందని, ఆందోళనపడాల్సిన అవసరం లేదన్నారు.

తెలంగాణలో విజృంభిస్తున్న స్వైన్‌ఫ్లూపై చర్చించేందుకు తెలంగాణ కేంద్ర మంత్రి దత్తాత్రేయ శుక్రవారం కేంద్ర ఆరోగ్యమంత్రి జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా త్రిసభ్య కమిటీ బృందం నివేదిక వచ్చిన తరువాత తగిన సహకారం అందిస్తామని ఆరోగ్యమంత్రి నడ్డా.. దత్తాత్రేయకు హామీ ఇచ్చారు.

అనంతరం దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ స్వైన్ ఫ్లూ మాత్రమే కాక అంటువ్యాధుల వ్యాప్తి నివారణకు గాంధీ, ఉస్మానియా దవాఖానాల్లో మెరుగైన సౌకర్యాలను సమకూర్చుకోడానికి కేంద్రం నుంచి ఆర్థిక సాయం చేయాల్సిందిగా కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశానని తెలిపారు.

హైదరాబాద్‌లో వైరస్‌లపై పరిశోధన కేంద్రాన్ని, వ్యాధి నిర్ధారణకు వైరాలజీ ల్యాబొరేటరీని ఏర్పాటు చేయాల్సిందిగా కోరానని, కేంద్ర మంత్రి ఇందుకు సానుకూలంగా స్పందించారని దత్తాత్రేయ చెప్పారు. ఐసొలేట్ వార్డుల వార్డుల ఏర్పాటుకు సహకరించాల్సిందిగా కోరగా.. హైదరాబాద్‌లోనున్న కేంద్ర వైద్య బృందం నివేదిక అందిన తర్వాత పరిశీలిస్తామని జేపీ నడ్డా హామీ ఇచ్చినట్లు దత్తాత్రేయ తెలిపారు.

English summary
Union Labour Minister Bandaru Dattatreya has requested the Health Ministry for special funds to improve infrastructure in government hospitals and setting up of a laboratory for dealing with swine flu outbreak in his home state Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X