వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరిటాల అడుగుజాడల్లో..: చిన్నరాజప్ప (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

అనంతపురం : ప్రజలు, పోలీసుల మధ్య సంబంధాలు మెరుగుపరచడం కోసం గతంలో పోలీస్‌స్టేషన్లలో ఏర్పాటుచేసిన మైత్రీ సంఘాలను పునరుద్ధరిస్తామని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. సోమవారం అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మైత్రీ సంఘాలను ఏర్పాటు చేశామన్నారు. వీటివల్ల గ్రామాల్లో పోలీసులు, ప్రజలకు మధ్య సంబంధాలు మెరుగుపడతాయని చెప్పారు. ఎర్రచందనం స్మగ్ల ర్ల ఆటకట్టించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిస్తామని చెప్పారు. వారానికో రోజు పోలీసులకు సెలవు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు.

అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి సోమవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టణంలో నూతన పోలీస్‌స్టేషన్‌ను, తాడిపత్రిలో పోలీసుల భవన సముదాయాన్ని ప్రారంభించారు. రామగిరిలో నిర్మించిన పోలీస్‌స్టేషన్‌ను మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డితో కలిసి ప్రారంభించారు. తిరుమలదేవర ఆలయంలో పూజలు చేశారు. వెంకటాపురం పరిటాల ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. రామగిరిలో మూతపడిన బంగారు గనుల ప్రాంతాన్ని పరిశీలించారు.

పరిటాలపై కుట్ర చేశారు..

పరిటాలపై కుట్ర చేశారు..

బడుగు, బలహీన వర్గాల కోసం పోరాడుతున్న పరిటాల రవి ఓ మహాశక్తిగా ఎదుగుతాడనే భయంతోనే ప్రత్యర్థులు కుట్ర ప న్ని హతమార్చారని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఆరోపించారు.

పరిటాల అడుగుజాడల్లో..

పరిటాల అడుగుజాడల్లో..

పోలీసుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని చిన్న రాజప్ప చెప్పారు. పరిటాల రవి అడుగుజాడల్లో ఆయన సతీమణి మంత్రి పరిటాల సునీత, కుమారుడు పరిటాల శ్రీరామ్‌ నడుస్తూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తుండటం ఆనందంగా ఉందన్నారు.

పరిటాలతో స్నేహం..

పరిటాలతో స్నేహం..

పరిటాల రవీంద్ర రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి తనకు సాన్నిహిత్యం ఉందని చిన్న రాజప్ప చెప్పారు. పరిటాల సునీత మాట్లాడుతూ పోలీసులను తన భర్త పరిటాల రవి కుటుంబ సభ్యుల్లా చూశారని తెలిపారు.

మైత్రీ సంఘాలు..

మైత్రీ సంఘాలు..

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మైత్రీ సంఘాలను రద్దు చేసిందని, ఇప్పుడు మళ్లీ వాటిని పునరుద్ధరిస్తామని చిన్న రాజప్ప చెప్పారు.

పోలీసులకు స్వేచ్ఛ..

పోలీసులకు స్వేచ్ఛ..

మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో పోలీసు వ్యవస్థకు పూర్తీ స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు కల్పిస్తున్నామన్నారు.

అన్ని రకాలుగా రక్షణ

అన్ని రకాలుగా రక్షణ

చంద్రబాబు సారథ్యంలో రాష్ట్ర ప్రభు త్వం ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పిస్తోందని మంత్రి పల్లె రఘునాథ రెడ్డి అన్నారు.

పోలీసులే గుర్తుకొస్తారు..

పోలీసులే గుర్తుకొస్తారు..

ఏకష్టం వచ్చినా, సమస్య వచ్చినా ప్రజలకు మొదట గుర్తుకొచ్చేది పోలీసులే అని ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి అన్నారు.

English summary
Andhra Pradesh deputy CM Chinna Rajappa said that Paritala hes been murdered by the political rivals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X