కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నలుగురి హత్య, అల్లుడి పనే: ఇద్దరికి మరణశిక్ష

By Pratap
|
Google Oneindia TeluguNews

కరీంనగర్: నలుగురు కుటుంబసభ్యులను హత్యచేసిన ఇద్దరు ఇద్దరికి ఉరిశిక్ష పడింది. కరీంనగర్ జిల్లా గోదావరిఖని 6వ అదనపు జిల్లా సెషన్‌ కోర్టు ఇచ్చిన ఈ తీర్పు సంచలనమైంది. హంతకులు జునగారి దేవేందర్‌(30), జునగారి నరేష్‌(26)లకు మరణశిక్ష విధిస్తూ శుక్రవారం న్యాయమూర్తి జి.వెంకటకృష్ణయ్య తీర్పునిచ్చారు.

2010 మార్చి 27 అర్థరాత్రి తరువాత యైుటింక్లయిన్‌కాలనీ సమీపంలోని పోతన కాలనీలో జరిగిన ఒకే కుటుంబానికి చెందిన సింగరేణి కార్మికుడు బోగిరి బానయ్య(55), అతని భార్య బానమ్మ (50), బానయ్య కూతురు (దేవేందర్‌ భార్య) అరుణ (25), బానయ్య మనుమరాలు దీప్తి(4) హత్య కేసులో ఈ తీర్పు వెలువడింది. భార్య అరుణపై అనుమానంతో బానయ్య అల్లుడు దేవేందర్‌, అతని చిన్నాన్న కొడుకు నరేష్‌లు ఈ హత్యలు చేసినట్టు రుజువైంది.

2010మార్చి 27న హత్యలు జరుగగా, హంతకులను ఏప్రిల్‌ 17న పో లీసులు అరెస్టు చేశారు. మూడేళ్ల పాటు విచారణ సా గింది. శిక్ష పడుతుందని భావించి హంతకులు దేవేం దర్‌, నరేష్‌లు కొన్నాళ్లు పరారీ అయ్యారు. పోలీసులు వారిని పట్టుకుని కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో అదనపు పీపీ గిరిధర్‌రావు 24మంది సాక్షులను ప్రాసిక్యూషన్‌ తరపున కోర్టులో ప్రవేశపెట్టారు.

Hamging

దీంతో జడ్జి వెంకట కృష్ణయ్య ఈ కేసులో దేవేందర్‌, నరేష్‌లను హంతకులుగా నిర్ధారించి వారికి ఉరి శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. దీంతో పాటు మరో రెండు శిక్షలనూ ఖరారు చేశారు. హత్య కేసులో దేవేందర్‌, నరేష్‌లకు ఉరి శిక్ష పడగా, దొంగతనం కేసులో ఏడేళ్ల జైలు శిక్ష పడింది. అదనపు కట్నం కోసం వేధించిన కేసులో దేవేందర్‌కు ఒక సంవత్సరం జైలు శిక్ష ఖరార య్యింది. హంతకుల ను జైలుకు తరలించారు.

ఇలా హత్య చేశారు

గోదావరిఖని యైటింక్లయిన్‌కాలనీ సమీపంలోని సింగరేణి పోతనకాలనీలో 2010 మార్చి 27 అర్థరాత్రి 25 బ్లాక్‌ 339 క్వార్టర్‌లో నివాసముంటున్న 8వ బొగ్గుగని జ నరల్‌ మజ్దూర్‌ కార్మికుడు బోగిరి బానయ్య, అతని భార్య బానమ్మ పాటు వీరి కూతురు అరుణ, బానయ్య మనుమరాలు దీప్తి హత్యకు గురయ్యారు. 28న ఉదయం నుంచి బానయ్య ఇంటి తలుపులు మూసి ఉండడంతో స్థానికులు మధ్యాహ్నంకల్లా అనుమానపడ్డారు.

క్వార్టర్‌ వెనుకవైపు తలుపు తీసి ఉండడంతో స్థానికులు లోనికి వెళ్లి చూసే సరికి బెడ్‌రూమ్‌లో బానయ్య, బానమ్మ అ రుణల మృతదేహాలు పడిఉన్నాయి. బాత్‌రూమ్‌లో దీప్తి మృత దేహం ఉంది. నలుగురి మృతదేహాలకు గొంతు చుట్టూ ఉరివేసి చంపారు. స్థానికుల సమాచారంతో టూటౌన్‌ సీఐ వెంకటరమణ, గోదావరిఖని డీఎస్‌పీ హబీబ్‌ఖాన్‌లు రంగంలోకి దిగారు. ఈ హత్యలకు కు టుంబ కలహాలే కారణంగా భావించారు.

అల్లుడే హంతకుడు

పోతనకాలనీకి చెందిన బోగిరి అరుణను మూడు సంవత్సరాల క్రితం మంథని మండలం విలోచవరంకు చెందిన జునగారి దేవేందర్‌కు ఇచ్చి వివాహం చేశారు. భార్య ఇతరులతో మాట్లాడడంతో అనుమానంతో దేవేందర్‌ చిత్రహింసలు పెట్టేవాడు. అరుణ గర్భం దాల్చింది. గర్భం తన వల్ల రాలేదని ఆరు నెలల క్రితం అ రుణను చితకబాదాడు. చావుబతుకుల మధ్య ఉన్న అ రుణను ఆసుపత్రిలో చేర్పించి అబార్షన్‌ చేయించగా 40 వేల రూపాయలు వైద్య ఖర్చులయ్యాయి.

వీటన్నింటిని చెల్లించి, ఇక నుంచి మంచిగా ఉంటానని హామీ ఇ స్తానంటేనే పంపిస్తామని అరుణ తల్లిదండ్రులు బోగిరి బానమ్మ, బానయ్యలు తెగేసి చెప్పారు. దీన్ని మనుసులో పెట్టుకున్న దేవేందర్‌ అప్పటి నుంచే పగ పెంచుకున్నాడు. హత్యలకు పథకాలు రూపొందించడం మొదలుపెట్టాడు. మార్చి 27న దేవేందర్‌ తన బంధువైన జునగారి నరేష్‌తో కలిసి రాత్రి 11 గంటల ప్రాంతంలో ఒక పథకం ప్రకారం అరుణ ఉంటున్న 25 బ్లాక్‌ 339 క్వార్టర్‌కు చేరుకున్నాడు. అప్పటికే మద్యం కొనుగోలు చేశాడు. తలుపు తట్టినా లేవకపోవడంతో సెల్‌కు ఫోన్‌ చేసి లేపాడు.

రాత్రి ఇక్కడే పడుకుంటానని అత్తమామలను నమ్మించి అన్నం వండిపెట్టాలని కోరారు. అం తలో మామ బాణయ్యకు మద్యం బాగా తాగించాడు. అందరూ పడుకున్న తరువాత మామ బానయ్యను చున్నీ, తువ్వాలతో గొంతుకు చుట్టి హత్య చేశాడు. బెడ్‌రూంలో పడుకున్న అత్తకు మామ ఎలానో చేస్తున్నా డంటూ పిలిచాడు. లైట్‌ వేయబోతున్న అత్త బానమ్మను చున్నీ, చీర కొంగుతో ముందు రూంలోనే హత్య చేశాడు.

బెడ్‌రూంలో నిద్రిస్తున్న అరుణ ను హత్య చేసేందుకు వెళ్లగా మెళకువ వచ్చి పెనుగులాడింది. పక్కనే ఉన్న నాలుగు సం వత్సరాల దీప్తీ సైతం వీరితో కలబడింది. వీరి ద్దరిపై దిండులు వేసి, గొంతులు పిసికి హత్య చేశారు. ముందురూంలో హత్యచేసిన అత్త మామలను బెడ్‌రూంల పడేసి దీప్తిని బాత్‌ రూంలో పెట్టి గడి యపెట్టారు. దొంగలు హత్య చేసినట్టు ఇంట్లోని బీరువా తాళాలు పగుల గొట్టారు. ఇద్దరు మహిళలపై ఉన్న పుస్తెల తాడులు, బీరువాలో ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్లి వెనుక డోర్‌నుంచి పారిపోయాడు. హంతకులను మార్చి 2010 ఏప్రిల్‌ 17న టుటౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు.

దేవేందర్‌పై గతంలోనూ కేసులు

నలుగురిని హత్య చేసిన జునగారి దేవేందర్‌ నేర చరిత్ర కలిగిన వాడే. గతంలోనే నాలుగు పోలీస్‌స్టేషన్‌లలో ఐదు కేసులు నమోదయ్యాయి. సింగరేణి, వి ద్యుత్తు ట్రాన్స్‌ ఫార్మర్లకు చెందిన కాపర్‌ వైర్లను దొం గిలించిన వాటిలో సుల్తానాబాద్‌లో రెండు, మంథనిలో ఒకటి, కొయ్యూరులో ఒకటి, వన్‌టౌన్‌లో మరో కేసు నమోదైంది.

English summary
Karimnagar district Gadavarikhani court ordered death sentence to two culprits in a murder case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X