వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

(పిక్చర్స్) ప్రత్యేక హోదాపై బాబుకు మోడీ తీపి కబురు, 'ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర'

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: తన ఢిల్లీ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోడీ ఒకింత తీపి కబురు చెప్పినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు సోమవారం ఢిల్లీ వెళ్లారు. మంగళవారం ప్రధాని మోడీ, కేంద్రమంత్రులతో వరుసగా భేటీ అయి, బిజీగా గడిపారు.

చంద్రబాబు ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వద్ద ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా మోడీ.. ఏపీని అన్ని విధాలా ఆదుకుంటామని, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని, అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు ఇచ్చిన హామీలన్నీ తూచా తప్పకుండా నెరవేరుస్తామని మోడీ చెప్పారు.

ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలకు సంబంధించి కూడా నీతి ఆయోగ్ నుంచి నివేదిక అందిందని, దానిని ఎలా అమలు చేయాలన్న దానిపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోందని, తప్పకుండా త్వరలోనే శుభవార్త వింటారని చంద్రబాబుకు మోడీ చెప్పారని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ.. తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు తమ పార్టీ వాళ్లే సమాజాన్ని అతలాకుతలం చేశారని వైయస్ రాజశేఖర రెడ్డి పేరును ప్రస్తావిస్తూ చెన్నారెడ్డి నిండి సభలో చెప్పారని, ఇప్పుడు నా ప్రభుత్వాన్ని అస్థిరపర్చలేక సమాజంలో చిచ్చు పెడుతున్నారని జగన్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రధాని, సీఎం

ప్రధాని, సీఎం

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో, విభజన సందర్భంగా పార్లమెంట్‌లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన ప్రధాని మోడీని కలుసుకున్నారు. విభజన తర్వాత రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల గురించి చంద్రబాబు వివరించారు. అంతకుముందు జైట్లీని కలిశారు.

జైట్లీతో బాబు

జైట్లీతో బాబు

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ఇతోధికంగా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు విజ్ఞప్తికి ప్రధాని సానుకూలంగా స్పందించారు.

జైట్లీతో బాబు

జైట్లీతో బాబు

ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో తాను సమావేశమై ఈ విషయాన్ని చర్చిస్తానని, ఏపీకి వీలైనంత మెరుగైన సాయం చేస్తానని చంద్రబాబుకు మోడీ హామీ ఇచ్చారు.

జైట్లీతో బాబు

జైట్లీతో బాబు

జైట్లీతో సమావేశం సందర్భంగా చంద్రబాబు.. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను వివరించారు. ఇద్దరి వద్ద చంద్రబాబు ప్రముఖంగా ప్రస్తావించిన సమస్య రెవెన్యూ లోటు. ఈ లోటును పూడ్చడానికి అవసరమైన వనరులు సమకూర్చాలని కోరారు.

జెపి నడ్డాతో కామినేని

జెపి నడ్డాతో కామినేని

కేంద్రమంత్రి జెపి నడ్డాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస రావు మంగళవారం నాడు మధ్యాహ్నం కలిశారు.

జెపి నడ్డాతో కామినేని

జెపి నడ్డాతో కామినేని

కేంద్రమంత్రి జెపి నడ్డాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస రావు మంగళవారం నాడు మధ్యాహ్నం కలిశారు.

English summary
PM Narendra Modi on Tuesday assured AP chief minister N Chandrababu Naidu to take a decision on according special category status to the residuary state soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X