వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక రాజకీయం, తెలంగాణలో మల్టీ పార్టీ సిస్టం: బాబు, అమెరికాలో దాడిపై..

ఇప్పటి వరకు తాను పార్టీ పైన దృష్టి పెట్టలేకపోయానని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో అన్నారు. విభజన సమస్యల కారణంగా పాలనను గాడిలో పెట్టేందుకే ఎక్కువ సమయం కేటాయించానని చెప్పా

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఇప్పటి వరకు తాను పార్టీ పైన దృష్టి పెట్టలేకపోయానని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో అన్నారు. విభజన సమస్యల కారణంగా పాలనను గాడిలో పెట్టేందుకే ఎక్కువ సమయం కేటాయించానని చెప్పారు.

<strong>చాలా రోజుల తర్వాత టిడిపి భేటీలో హరికృష్ణ, ఆరో స్థానంపై బాబు డైలమా</strong>చాలా రోజుల తర్వాత టిడిపి భేటీలో హరికృష్ణ, ఆరో స్థానంపై బాబు డైలమా

ఆదివారం నాడు చంద్రబాబు అధ్యక్షతన పొలిట్ బ్యూరో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆన మాట్లాడారు. మేనిఫెస్టోలో హామీల అమలు పైన ఎక్కువగా శ్రద్ధ చూపించానన్నారు. ఇక నుంచి రాజకీయాలపై దృష్టి సారిస్తానన్నారు.

కొత్త పాత కలయికతో ఎంపిక

కొత్త పాత కలయికతో ఎంపిక

నామినేటెడ్ పదవులను వెంటనే భర్తీ చేస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కొంతమందికి హామీ ఇచ్చానని చెప్పారు. సీనియార్టీ, పార్టీ పట్ల అంకితభావం ఉన్న వారిని ఎంపిక చేస్తామన్నారు. కొత్త, పాతల కలయికతో ఎంపిక ఉంటుందన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికపై..

ఎమ్మెల్సీ ఎన్నికపై..

ఎమ్మెల్సీ ఎన్నికల పైన చాలాసేపు చర్చించారు. ఏపీ టిడిపి అధ్యక్షులు కళా వెంకట్రావు.. నారా లోకేష్ పేరును ప్రస్తావించారు. మిగతా సభ్యులు కూడా కేబినెట్‌ను మండలికి పంపించాలన్నారు. మిగతా వారిలో పార్టీకి అండగా నిలిచిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు.

తెలంగాణలో మల్టీ పార్టీ సిస్టం

తెలంగాణలో మల్టీ పార్టీ సిస్టం

తెలంగాణ పైన చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ టిడిపి నేతలు పార్టీ పరిస్థితిని వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలంగాణలో మల్టీ పార్టీ సిస్టం వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

అమెరికాలో దాడిపై ఖండన.. అవసరమైతే ప్రధానికి లేఖ

అమెరికాలో దాడిపై ఖండన.. అవసరమైతే ప్రధానికి లేఖ

అమెరికాలో కాన్సాస్‌లో తెలుగు వారి పైన జరిగిన దాడిని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో తీవ్రంగా ఖండించింది. అమెరికాలో తెలుగు వారి రక్షణకు అవసరమైతే ప్రధానికి లేఖ రాస్తామని చంద్రబాబు చెప్పారు.

15 అంశాలపై...

15 అంశాలపై...

పొలిట్ బ్యూరోలో పదిహేను అంశాల పైన చర్చించినట్లు ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు భేటీ అనంతరం చెప్పారు. లోకేష్‌కు ఎమ్మెల్యే కోటా లేదా ఎమ్మెల్సీ కోటాలో పదవి ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. అమెరికాలో తెలుగు వారి మీద జరుగుతున్న దాడులపై పొలిట్ బ్యూరో ఆందోళన వ్యక్తం చేసిందన్నారు.

ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని తీర్మానం

ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని తీర్మానం

స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడంచెల వ్యవస్థను పునరుద్ధరించాలని కేంద్రాన్ని కోరుతూ పొలిట్ బ్యూరో తీర్మానం చేసింది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేసింది. తెలుగు భాష అమలు విషయంలో అన్ని చర్యలు చేపట్టాలని నిర్ణయం. అలాగే ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ తీర్మానం చేశారు.

English summary
TDP leaders talk about Special Package, Kansas attack in America, MLC Elections in TDP politburo meet on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X