తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నోట్లరద్దు ఎఫెక్ట్: భారీగా తగ్గిన ఆదాయం, తొలిసారి లోటు బడ్జెట్‌లోకి టిటిడి

నోట్లరద్దు ఎఫెక్ట్ తిరుపతిపై తీవ్రంగా కన్పిస్తోంది.వడ్డీకాసులవాడిగా పేరున్న వెంకన్నకు కూడ ఇబ్బందులు తప్పడం లేదు. నోట్ల రద్ద తర్వాత వెంకన్న హుండీ ఆదాయం భారీగా తగ్గిపోయింది. ఈ ఏడాది జనవరి నుండి ఈ ఆదాయ

By Narsimha
|
Google Oneindia TeluguNews

తిరుపతి: నోట్లరద్దు ఎఫెక్ట్ తిరుపతిపై తీవ్రంగా కన్పిస్తోంది.వడ్డీకాసులవాడిగా పేరున్న వెంకన్నకు కూడ ఇబ్బందులు తప్పడం లేదు. నోట్ల రద్ద తర్వాత వెంకన్న హుండీ ఆదాయం భారీగా తగ్గిపోయింది. ఈ ఏడాది జనవరి నుండి ఈ ఆదాయం గణనీయంగా పడిపోయిందని అధికారులు గుర్తించారు.

గత ఏడాది నవంబర్ 8వ, తేదిన కేంద్రప్రభుత్వం పెద్దనగదు నోట్లను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకొంది. నల్లధనాన్ని నిర్మూలించేందుకుగాను మోడీ సర్కార్ తీసుకొన్నట్టు ప్రకటించింది.

అయితే నోట్ల రద్దు కారణంగా దేశవ్యాప్తంగా ప్రజలు మూడుమాసాల వరకు తీవ్రంగా నగదుకొరతను ఎదుర్కొన్నారు. ఇంకా ఇప్పటికీ ఈ సమస్య తీరలేదు. దీంతో డిజిటల్ చెల్లింపుల వైపుగా అడుగులు వేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

నోట్ల రద్దు కారణంగా రద్దుచేసిన నోట్లు తిరుపతి శ్రీవారి హుండీలో భారీగానే వేశారు భక్తులు.అంతేకాదు ఈ రద్దుచేసిన నోట్లను మార్పిడి చేసుకొనే విషయంలో టిటిడి పాలకవర్గం చిక్కులను ఎదుర్కొంది. అయితే తాజాగా కేంద్రం మరోసారి గడువు పెంచడంతో రద్దుచేసిన నోట్లను మార్పిడి చేసుకొనే వెసులుబాటు టిటిడికి లభించింది.

భారీగా తగ్గిన హుండీ ఆదాయం

భారీగా తగ్గిన హుండీ ఆదాయం

తిరుపతి శ్రీవెంకటేశ్వరస్వామికి ఆదాయానికి వచ్చిన ఇబ్బందులుండవని భక్తులు నమ్ముతుంటారు. కుబేరుడి బాకీ నుండి శ్రీవారిని విముక్తిడిని చేయడానికి భక్తులు తరతరాలుగా వడ్డీకాసులతో వెంన్న వైభవం కొనసాగుతోంది. నోట్ల రద్దు నుండి ఈ వైభవం తగ్గింది.ఈ ఏడాది జనవరి నుండి వెంకన్న హుండీ ఆదాయం భారీగా తగ్గింది. ఆదాయం గణనీయంగా పడిపోయింది.2015-16లో శ్రీవారి హుండీ ఆదాయం రూ.905 కోట్లు, 2016-17లో ఈ ఆదాయం రూ.1,110కోట్లకు పెరిగింది.ఈ ఏడాది హుండీ ఆదాయం పెరగకపోయినా, గత ఏడాదితో వచ్చిన ఆదాయం వస్తే సరిపోతోందని భావించారు. సగటున వందకోట్లు హుండీ ఆదాయం వస్తోంది. కానీ, ఆరుమాసాలుగా ఏనాడూ వందకోట్లకుచేరలేదు. ప్రతిరోజూ టిటిడికి రూ3.04కోట్లు ఆదాయం రావాల్సిఉండగా, కేవలం రూ.2.44కోట్లకే పరిమితమైంది. ఈ ఆరునెలల్లో రూ.556కోట్లు ఆదాయం వస్తోందని భావిస్తే రూ.447.84కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది.ఇలానే కొనసాగితే ఏడాదికి రూ.220కోట్లు ఆదాయం తగ్గే అవకాశం ఉంది.

 లోటు బడ్జెట్‌లోకి వెళ్ళిన టిటిడి

లోటు బడ్జెట్‌లోకి వెళ్ళిన టిటిడి

తొలిసారిగా టిటిడి ఆదాయం లోటుబడ్జెట్‌లోకి వెళ్ళిపోయింది. ఈ ఏడాది రాబడి ఖర్చుకు మధ్య 300 కోట్ల తేడా ఉండే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. టిటిడిలో వారంలోపుగానే బిల్లుల చెల్లింపులు జరుగుతాయి. అయితే నిధుల సమస్య కారణంగా బిల్లుల చెల్లింపులో జాప్యం సాగుతోంది. నోట్ల రద్దు కారణంగా హుండీ ఆదాయం భారీగా తగ్గిపోయిందని అధికారులు గుర్తించారు.దీంతో తొలిసారిగా లోటు బడ్జెట్‌లోకి వెళ్ళింది టిటిడి.ఇక రూ.300 టిక్కెట్టు ద్వారా రోజుకు 23,333 మంది స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంది. ఈ టిక్కెట్టును కొనుగోలు చేస్తున్నవారి సంఖ్య 15వేలకు పడిపోయింది. కాలినడకన స్వామివారిని దర్శించుకొనే వారిసంఖ్య పెరిగింది. వారాంతంలో రోజుకు 30 నుండి 40వేల మంది నడిచి కొండ ఎక్కివస్తున్నారు.దీంతో రూ.300 టిక్కెట్ల ద్వారా ఏటా రూ.256కోట్లు వస్తే ఎక్కువనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. రద్దీ కారణంగా 80రోజులపాటు బ్రేక్ దర్శనాలను రద్దుచేయడంతో మరో 12 కోట్ల ఆదాయం తగ్గింది.

జిఎస్‌టి ప్రభావం ఎలా ఉంటుందో

జిఎస్‌టి ప్రభావం ఎలా ఉంటుందో

నోట్లరద్దుతోనే టిటిడి ఆదాయం భారీగా పడిపోయింది.అయితే జిఎస్‌టి ఎఫెక్ట్ ఎలా ఉంటుందోననే ఆందోళన కూడ లేకపోలేదు. ఇంజనీరింగ్, మార్కెటింగ్ విభాగంలో రూ.60 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.పన్ను పోటు కారణంగా ప్రతి ఏటా రూ.75 కోట్ల భారం పడే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయంతో ఉన్నారు. దీంతో లడ్డూ, దర్శన టిక్కెట్ల ధరలను పెంచకతప్పదని అధికారులు భావిస్తున్నారు. వీటిలో ఏదో ఒకటి పెంచేందుకు అనుమతివ్వాలని అధికారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

లడ్డూ భారం రూ.250 కోట్లు

లడ్డూ భారం రూ.250 కోట్లు

తిరుపతి లడ్డూ అంటే ప్రత్యేకమైంది.అయితే ఈ లడ్డూ తయారీపై టిటిడిపై ఏటా రూ.250కోట్ల భారం పడుతోంది. లడ్డూనే 2005 నుండి రూ.25లకే విక్రయిస్తున్నారు. ఒక్క లడ్డూ తయారీకి రూ.35 ఖర్చవుతోంది. దీంతో ఒక్క లడ్డూపై రూ.10, కాలినడకన భక్తులకు ఒక్క లడ్డూ ఉచితంగా ఇస్తారు. రూ.10 ధరతో మరో రెండు లడ్డూలు ఇస్తారు. టిటిడి ఉద్యోగులకు ఒక్కోక్కరికి నెలకు పది లడ్డూలను రూ.5 ఇస్తారు.మరోవైపు తలానీలాల విక్రయం వల్ల టిటిడికి భారీగా ఆదాయం వచ్చేది.అయితే తలనీలాల ధర భారీగా తగ్గిపోయింది. 2015-16 తలనీలాల ద్వారా రూ.200కోట్లు రాగా, గతేడాది ఈ ఆదాయం రూ.150 కోట్లకు తగ్గింది. ఈ ఏడాది వందకోట్లు వస్తే ఎక్కువని భావిస్తున్నారు.

English summary
TTd income decreased after demonetisation.The richest temple income flows decreased 2015-16 Rs.905, 2016-17 Rs.1,110,last six months Rs.447.84 only.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X