విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీకి కొత్త పోలీస్ బాస్: కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్‌కు తొలి డీజీపీగా సేవలందించిన జేవీ రాముడు పదవీ విరమణ సందర్భంగా శనివారం ఆయనకి విజయవాడలో ఘన వీడ్కోలు పలికారు. ఏపీ పోలీసు శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో వీడ్కోలు పరేడ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా నాలుగు ఏపీఎస్పీ బెటాలియన్లు జేవీ రాముడుకి గౌరవ వందనం సమర్పించి ఘ‌నంగా వీడ్కోలు తెలిపాయి. ఈ కార్య‌క్ర‌మానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసు ఉన్నతాధికారులంద‌రూ హాజరయ్యారు. ఏపీ కష్టాల్లో ఉన్నప్పటికీ పోలీసు విభాగాన్ని జేవీ రాముడు ఎంతో సమర్ధవంతగా నడిపించారని ఇంఛార్జి డీజీపీ సాంబశివరావు ఈ సందర్భంగా అన్నారు.

పోలీసు శాఖకు ఎన్నో సౌక‌ర్యాలు లేవ‌ని, అయినా ఆ పరిస్థితులను అధిగమించి పోలీసు శాఖ అభివృద్ధికి జేవీ రాముడు మార్గనిర్దేశాన్ని చేశారని ఆయన అన్నారు. తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడానికి సహకరించిన వారందరికీ జేవీ రాముడు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

సీనియర్ పోలీసుల ఉన్నాతాధికారుల నుంచి కానిస్టేబుళ్ల వరకు అందిరి నుంచి మంచి సహకారం లభించిందని ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. పరేడ్ కార్యక్రమం ముగిసిన అనంతరం ఆంధ్రప్రదేశ్ ఇంచార్జి డీజీపీగా సాంబశివరావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో చాలా సమస్యలు ఉన్నాయని అన్నారు.

ఏపీకి కొత్త పోలీస్ బాస్: కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఏపీకి కొత్త పోలీస్ బాస్: కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఏపీలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలో 4,548 పోలీసు కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి డీజీపీ పదవి నుంచి పదవీ విరమణ చేయడానికి ఒక్కరోజు ముందు జేవీ రాముడు శుక్రవారం విజయవాడలో ఆయన నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు శాఖ పరంగా విభజన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని చెప్పారు.

ఏపీకి కొత్త పోలీస్ బాస్: కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఏపీకి కొత్త పోలీస్ బాస్: కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఏపీఎస్పీ విభజన పూర్తయిందని, తెలంగాణ రాష్ట్రం నుంచి ఇక్కడికి 3,382 మంది రావాల్సి ఉందన్నారు. అలాగే విభజనతో కొత్త రాష్ట్రంలో 12 నుంచి 14 వేల పోస్టులు ఖాళీలుగా ఉన్నాయని దశలవారీగా వీటిని భర్తీ చేయనున్నట్లు ఆయన వివరించారు. పోస్టుల భర్తీలో ఈ పర్యాయం మహిళా అభ్యర్థులకు 33 శాతం కేటాయించామని చెప్పారు. ఆర్మ్‌డ్ రిజర్వు విభాగంలో మహిళలకు 20 శాతమే కేటాయించినట్లు తెలిపారు. గతంలో ఉన్న ఇబ్బందుల్ని సవరించి అన్ని అంశాల్లో మార్పులు చేర్పులు చేసి ఈసారి నోటిఫికేషన్ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

ఏపీకి కొత్త పోలీస్ బాస్: కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఏపీకి కొత్త పోలీస్ బాస్: కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

3,216 సివిల్ కానిస్టేబుల్ పోస్టులు (మహిళలతో కలిపి), ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులు 1,067 (మహిళలతో కలిపి), జైళ్ల శాఖలో వార్డెన్లు పురుషులకు 240 పోస్టులు, జైళ్లశాఖలో మహిళా వార్డెన్ 25 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు. ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 14 వరకు దరఖాస్తులు ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చని సూచించారు. అలాగే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లోనే జరుగుతుందన్నారు. recruitment.appolice.gov.in వెబ్‌సైట్‌లో నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

ఏపీకి కొత్త పోలీస్ బాస్: కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఏపీకి కొత్త పోలీస్ బాస్: కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

అలాగే కేటగిరీల వారీగా నిర్ణయించిన ఫీజును మీసేవా కేంద్రాలు, లేదా ఏపీ ఆన్‌లైన్ సెంటర్లలో చెల్లించాలని సూచించారు. పరీక్షలకు పది రోజుల ముందు నుంచి హల్‌టిక్కెట్లు వెబ్‌సైట్‌లో ఆందుబాటులో ఉంటాయని వెల్లడించారు. అక్టోబర్ 16న రాష్ట్ర వ్యాప్తంగా 26 కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష ఉంటుందని చెప్పారు. ప్రతి జిల్లాలో రెండు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. గతంలో పోలీస్ ఉద్యోగానికి సంబంధించి ప్రాథమిక అర్హతగా ఉన్న పరుగు పందెం దూరం తగ్గించామని ఆయన తెలిపారు.

ఏపీకి కొత్త పోలీస్ బాస్: కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఏపీకి కొత్త పోలీస్ బాస్: కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

పురుష అభ్యర్థులకు 5 కిలోమీటర్ల పరుగు, స్త్రీలకు 2.5 కిలోమీటర్ల పరుగు పందెం తప్పనిసరిగా ఉండేదని, దీన్ని మార్పు చేశామన్నారు. 5 కిలోమీటర్ల పరుగు బదులు 1,600 మీటర్లు (ఒక మైలు) పరుగు పందెం ఉండేలా నిబంధన మార్చామన్నారు. అలాగే శరీర దారుఢ్య పరీక్షలు ఐదు నిర్వహించే వారని, వాటిని మూడుకు తగ్గించామన్నారు. గతంలో ఐదు విభాగాల్లో 100 మీటర్లు, 800 మీటర్లు, లాంగ్ జంప్, హై జంప్, షాట్‌పుట్ ఉండేవని, కొత్త నోటిఫికేషన్ ప్రకారం 1,600 మీటర్ల పరుగుతో పాటు 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ చేస్తే సరిపోతుందని చెప్పారు.

దేశంలోనే అంధ్రప్రదేశ్ ఎన్నో సవాళ్లను అధిగమించి గర్వించదగ్గ స్థాయికు చేరుకుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం మేరకు అందరం కలిసి పనిచేస్తామని ఆయన అన్నారు. దేశంలోనే ఏపీని నెంబర్ వన్‌గా నిలిపేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం తమ ముందున్న ఏకైక లక్ష్యం కృష్ణా పుష్కరాలను సమర్ధవంతగా నిర్వర్తించడమేనని అన్నారు. గతేడాది జరిగిన గోదావరి పుష్కరాలు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని కృష్ణా పుష్కరాలను ఓ ఛాలెంజ్‌గా తీసుకున్నామని ఆయన చెప్పారు. సిటిజన్స్ సర్వీసుల సేవల్లో టెక్నాలజీని ఉపయోగించుకుంటామని అన్నారు.

English summary
DGP JV Ramudu releasing of AP Police Recruitment 2016-17 Notification in Vijayswada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X