వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమిత్ షా చెప్పినా.. బిజెపి-టిడిపి మధ్య విభేదాలు, పెరుగుతున్న దూరం

బిజెపి, టిడిపిల మధ్య మరోసారి మాటల యుద్ధం నడుస్తోంది. గత నెల బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా తెలుగు రాష్ట్రాల్లో పర్యటించారు. ఆ సమయంలో పార్టీ నేతలను ఆయన వారించారు. దీంతో అప్పటికి అది సద్దుమణిగింది.

|
Google Oneindia TeluguNews

అమరావతి: బిజెపి, టిడిపిల మధ్య మరోసారి మాటల యుద్ధం నడుస్తోంది. గత నెల బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా తెలుగు రాష్ట్రాల్లో పర్యటించారు. ఆ సమయంలో పార్టీ నేతలను ఆయన వారించారు. దీంతో అప్పటికి అది సద్దుమణిగింది.

చదవండి: నంద్యాల ఉప ఎన్నిక.. లగడపాటి సర్వేలో బాబుకు షాక్

ఇప్పుడు మళ్లీ విభేదాలు తెరపైకి వస్తున్నాయి. మద్యం పాలసీ, విజయవాడ కనకదుర్గ గుడి పాలక వర్గం నియామకం.. ఇలా ఒక్కొక్క అంశంపై విమర్శలు, వివాదాలు ముదురుతున్నాయి.

సోము, విష్ణు తీవ్ర వ్యాఖ్యలు

సోము, విష్ణు తీవ్ర వ్యాఖ్యలు

మద్యం పాలసీపై ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బిజెపి శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు గురువారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ప్రభుత్వం సంపాదనే ధ్యేయంగా పని చేస్తోందని, బిజెపి ప్రభుత్వం ఉంటే మద్యమే ఉండదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి డబ్బులే కావాలంటే చంద్రన్న కానుకల ద్వారా సేకరించాలని ధ్వజమెత్తారు. దీనిపై మంత్రి జవహర్ కూడా ధీటుగానే స్పందించారు.

Recommended Video

BJP Plans To Check Chandrababu and Jagan
కనకదుర్గ మండలి పదవిపై..

కనకదుర్గ మండలి పదవిపై..

విజయవాడ కనకదుర్గ పాలక మండలిపై కూడా విమర్శలు, ప్రతివిమర్శలకు దిగారు. దుర్గగుడి పాలక మండలి ఛైర్మన్ పదవిని తమకే ఇవ్వాలని మొదటి నుంచి బిజెపి కోరుతోంది. కానీ కీలకమైన ఈ పదవి తమకే ఉండాలని టిడిపి కోరుకుంటోంది. మూడేళ్లుగా ఈ వివాదం కొనసాగుతోంది. చైర్మన్ నియామకం జరగాల్సి ఉంది.

పేరు సూచించిన బిజెపి

పేరు సూచించిన బిజెపి

దుర్గ గుడి ఛైర్మన్ పదవి కూడా తమ వారికే ఇవ్వాలంటూ వీరమాచనేని రంగప్రసాద్ పేరును బిజెపి సూచించింది. ఇదే విషయమై చంద్రబాబుతో వెంకయ్య నాయుడు, అమిత్ షాలు మాట్లాడారు. చివరకూ 16 మంది సభ్యులతో పాలక వర్గాన్ని నియమించారు. ఇందులో రంగప్రసాద్ కూడా ఉన్నారు.

బిజెపి ప్రతిపాదనకు నో

బిజెపి ప్రతిపాదనకు నో

చైర్మన్ పదవి విషయంలో రెండు పార్టీలు చెరో ఏడాది నిర్వహించుదామని బిజెపి చెప్పగా, టిడిపి నో చెప్పింది. ఇది బిజెపికి, దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావుకు అసంతృప్తిని కలిగించింది. బిజెపి మరొకరి పేరు సూచించినా వివాదం ఆగలేదు.

English summary
Differences between BJP and Telugu Desam again in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X