విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆర్ధిక ప్రగతి బాలేదు: ఆ ఐదు జిల్లాలపై చంద్రబాబు అసంతృప్తి

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: విజయవాడలో రెండో రోజు కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. రెండో రోజు సదస్సులో భాగంగా గృహ నిర్మాణం, వైద్య ఆరోగ్యం, పెండింగ్‌ పెట్టుబడులు, శాంతిభద్రతలపై చర్చించనున్నారు. ముందుగా జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించి ఆ తర్వాత పైవాటిపై చర్చించనున్నారు.

ఇదిలా ఉంటే తొలిరోజు జరిగిన కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు కాస్తంత ఉత్సాహంగా కనిపించారు. ఆర్థికాభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంపై చంద్రబాబు కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. అభివృద్ధి సాధించడంతో పాటు ఆ ఫలాలు ప్రజలకు అందేలా చేయడలోనే పాలనా యంత్రాంగం పటుత్వం ఆధారపడి ఉంటుందన్నారు.

 అభివృద్ధి ప్రజల వాస్తవ జీవితాల్లో కనిపించాలి

అభివృద్ధి ప్రజల వాస్తవ జీవితాల్లో కనిపించాలి


అభివృద్ధి ప్రజల వాస్తవ జీవితాల్లో కనిపించే విధంగా ప్రభుత్వంలో భాగంగా ఉన్న ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు. తాను నవ్వుతూ, నవ్విస్తూ ఈ సమావేశాన్ని ఎంతో ఉత్సాహభరితంగా నడిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, వసతి గృహాల్లో బయో మెట్రిక్ విధానాన్ని పూర్తిగా అమల్లోకి తీసుకురాబోతున్నామని చెప్పిన ఆయన ‘దీని వల్ల ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదంటూ' చిరునవ్వులు చిందించారు.

 కుటుంబ సభ్యులతో సరదాగా గడపాలి

కుటుంబ సభ్యులతో సరదాగా గడపాలి


గంట ముందుగా వెళ్లినా ఆ రోజు ఫైళ్లన్నంటినీ పూర్తి చేసి వెళ్లాలన్నారు. ప్రకృతి వైపరీత్యాలు వంటి విపత్తులు సంభవించినపుడు 24 గంటలు పనిచేయించినా ఇతర రోజుల్లో సంతోషంగా పనిచేసుకుని వెళ్లిపోవచ్చన్నారు. రోజూ ఆ నాలుగు గోడల మధ్య గడిపినా ఆలోచనలు వేరుగా ఉంటాయంటూ శారీరక, మానసిక ఆనందం కోసం కుటుంబ సభ్యులతో సరదాగా గడపాలన్నారు.

 ఉద్యోగులెవరూ శారీరక శ్రమ పడాల్సిన అవసరం ఉండదు

ఉద్యోగులెవరూ శారీరక శ్రమ పడాల్సిన అవసరం ఉండదు


మున్ముందు అధికారులు, ఉద్యోగులెవరూ శారీరక శ్రమ పడాల్సిన అవసరం ఉండదన్నారు. సిసి కెమెరాలు, డ్రోన్‌ల సహాయంతో తమ సీటు నుంచే వీధుల్లో చెత్తచెదారం నుంచి అతి పెద్దప్రాజెక్టుల్లో జరిగే పనులను కూడా పర్యవేక్షిస్తూ సూచనలు, ఆదేశాలు జారీ చేయవచ్చునన్నారు. అయితే ఇందుకు కాస్త టెక్నాలజీపై అవగాహన పెంచుకుంటే చాలన్నారు. ప్రైవేట్ వారికి డ్రోన్‌లకు అనుమతిచ్చేది లేదంటూ వారికిస్తే బాంబులను చేరవేస్తారని అన్నారు.

 రుణాల మంజూరులో జాప్యం

రుణాల మంజూరులో జాప్యం


వివిధ పథకాల కింద రుణాల మంజూరులో జరుగుతున్న జాప్యంపై నిలదీసేందుకై ఇక నుంచి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశాలకు కలెక్టర్లను, కలెక్టర్ల సమావేశానికి లీడ్ బ్యాంక్ అధికారులను ఆహ్వానించనున్నామన్నారు. వాణిజ్య స్థాయిలో ప్రయోజనం చేకూర్చగల పరికరాలను రూపొందించేందుకు ప్రోత్సాహం కల్పిస్తామన్నారు.

 అంకుర సంస్థలను ఏర్పాటు చేస్తున్నాం

అంకుర సంస్థలను ఏర్పాటు చేస్తున్నాం


ఇందుకోసం అంకుర సంస్థలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి ప్రభుత్వ శాఖలో వినూత్న ఆలోచనలు, పద్ధతులు కనుగొనేందుకు ఇన్నోవేషన్ చాప్టర్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 68 శాసనసభ నియోజకవర్గాల్లో తలసరి ఆదాయం ఒక లక్ష కంటే ఎక్కువగా ఉందని, మరో 77 నియోజకవర్గాలలో సంతృప్తికర సగటు తలసరి ఆదాయం నమోదయిందని చంద్రబాబు చెప్పారు.

 ఆ ఐదు జిల్లాలో ఆర్థిక ప్రగతి బాగాలేదు

ఆ ఐదు జిల్లాలో ఆర్థిక ప్రగతి బాగాలేదు

శ్రీకాకుళం జిల్లాలో 177 కిమీ మేర సముద్ర తీర ప్రాంతం, నాగావళి, వంశధార వంటి నదులు ఉన్నప్పటికీ రాష్ట్రం ఆర్థిక ప్రగతిలో అట్టడుగునున్న 10 నియోజకవర్గాల్లో, ఐదు ఆ జిల్లాల్లోనే ఉండటం బాధాకరమన్నారు. ప్రాంతాల మధ్య ఆర్థిక వ్యత్యాసాలను తొలగించడానికి ఉపకరించే వ్యవసాయం, పశుపోషణ, కోళ్ల పెంపకం, మత్స్య పరిశ్రమ వంటి అనుబంధ రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతుందని చెప్పారు.

 పోలవరానికి 8వేల కోట్ల మేర నాబార్డు రుణం

పోలవరానికి 8వేల కోట్ల మేర నాబార్డు రుణం


పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఏటా 8వేల కోట్ల మేర నాబార్డు రుణం లభించబోతోందన్నారు. 2018 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామన్నారు. దీంతోపాటు 960మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తామన్నారు. సీఎంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్‌, డీజీపీ సాంబశివరావు, రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, చిన రాజప్ప, కేఈ కృష్ణమూర్తి, పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు ఈ సదస్సులో పాల్గొన్నారు.

English summary
District collectors conference on second day at Vijayawada
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X