వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇలాకాలో ఎంకే స్టాలిన్: ఎందుకంటే ?

తమిళనాడు శాసన సభలో ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ నేడు ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు.

|
Google Oneindia TeluguNews

తిరుపతి: తమిళనాడు శాసన సభలో ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ నేడు ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు. సోమవారం సాయంత్రం చిత్తూరు జిల్లాలోని నగరి పట్టణంలో జరుగుతున్న కార్యక్రమానికి స్టాలిన్ హాజరు కానున్నారు.

అంధ్రప్రదేశ్ డీఎంకే పార్టీ అధ్యక్షుడు కేఏ మునిస్వామని ఇటీవల మరణించారు. సోమవారం సాయంత్రం నగరి మున్సిపల్ పరిధిలోని ఏకాంబరకుప్పంలో జరిగే కేఏ మునిస్వామి సంతాప సభకు ఎంకే స్టాలిన్ హాజరుకానున్నారు.

ఎంకే స్టాలిన్ నగరికి వస్తున్నారని డీఎంకే పార్టీ కార్మిక సంఘం వ్యవస్థానకులు వీఈ గంగాధర్ చెప్పారు. ఈ సంతాప సభలో డీఎంకే పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ మాజీ అధ్యక్షులు నందగోపాల్ అధ్యక్షత వహిస్తారు.

DMK cadre accord rousing reception to MK Stalin at Nagari

డీఎంకే పార్టీ శాసన సభ్యులు శాసన సభ్యులు పొన్ముడి వేలు, వేణు, వేలు, గాంధీ, రాజేంద్రన్, పార్టీ ప్రధాన కార్యదర్శి భారతి, యువజన విభాగం నేత నాగలింగం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆంధ్రప్రదేశ్ లోని డీఎంకే నాయకులు తెలిపారు.

డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన ఎంకే. స్టాలిన్ మొదటి సారి తమిళనాడు తరువాత ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసన సభ్యురాలు, వైఎస్ఆర్ సీపీ నాయకురాలు ఆర్ కే. రోజా పాల్గొంటారా ? లేదా ? అనే విషయం డీఎంకే నాయకులు చెప్పలేదు.

English summary
Dravida Munnetra Kazhagam (DMK) working president and TN Opposition leader, M.K. Stalin, received a rousing welcome at Ekambara Kuppam of Nagari Municipality on Sunday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X