వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘ఉద్యోగుల బదిలీల్లో జోక్యం చేసుకోకండి’.. మంత్రులు, ఎమ్మెల్యేల‌కు చంద్ర‌బాబు స్ట్రాంగ్ వార్నింగ్!

ఏపీలో ఇప్పుడు ఉద్యోగుల బదిలీల వ్యవహరం జోరుగా సాగుతోంది. ఈ బదిలీల ప్రక్రియలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలెవరూ జోక్యం చేసుకోవద్దని సీఎం చంద్ర‌బాబు నాయుడు స్పష్టం చేశారు. దీంతో అధికార పార్టీ నేతలు గందరగోళ

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

విజ‌య‌వాడ‌: ఏపీలో ఇప్పుడు ఉద్యోగుల బదిలీల వ్యవహరం జోరుగా సాగుతోంది. ఈ బదిలీల ప్రక్రియలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలెవరూ జోక్యం చేసుకోవద్దని సీఎం చంద్ర‌బాబు నాయుడు స్పష్టం చేశారు. దీంతో అధికార పార్టీ నేతలు గందరగోళంలో పడ్డారు.

బదిలీల విషయమై పార్టీ నేతలపై ఒత్తిడి పెరుగుతోంది. మ‌రోవైపు అలాంటి వారికి.. సమాధానం చెప్పలేక నానా తంటాలు పడుతున్నారు. దీంతో నేతలు సిఫార్సు లేఖలు లేకుండానే తమ పని కానివ్వాలని మంత్రులపై కింది స్థాయి నేత‌లు ఒత్తిడి తెస్తున్నారు.

cm-chandrababu

దళారుల రంగప్రవేశం...

ప‌నిలో ప‌నిగా..రాజ‌కీయ సిఫార్సులు లేక‌పోవ‌డంతో.. కీల‌క శాఖ అధికారులు.. ఉన్న‌తాధికారులు బ‌దిలీల విష‌యంలో ప్లేసు .. పోస్టుకో రేటు పెట్టిన‌ట్లు స‌మాచారం.. అంతే కాదు.. దీనికి కొంద‌రు మ‌ధ్య‌వ‌ర్తుల‌ను నియ‌మించుకుంటున్న‌ట్లు స‌మాచారం. బదిలీలకు సంబంధించి గత కెబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునే సందర్భంలోనే రాజకీయ జోక్యం ఉండనేకూడదంటూ సీఎం చంద్రబాబు అదేశించారు. మ‌రోవైపు పనితీరు ఆధారంగానే బదిలీలలు ఉండాల‌ని కూడా స్ప‌ష్టం చేశారు.

గతంలో ఆరోపణలు...

గతంలో బదిలీల విషయంలో మంత్రులపైనా.. ప్రభుత్వంపైనా పెద్ద ఎత్తున అరోప‌ణ‌లు వ‌చ్చాయి. అందుకే ఈసారి ఇలాంటి అరోప‌ణ‌లు రాకుండా బదిలీల ప్ర‌క్రియ చేయాల‌ని సీఎం మంత్రుల‌కు స్ఫ‌ష్టం చేశారు.

పైరవీలు షురూ...

సహజంగా ఈ తరహా బదిలీల వ్యవహరం తెరపైకి రాగానే రాజకీయ నేతల వద్దకు ఉద్యోగులు క్యూ కడతారు. వారి వారి నియోజకవర్గాలకు చెందిన ఉద్యోగులో.. లేక పరిచయం ఉన్న వారి ద్వారానో రాజకీయ నేతల వద్దకు వెళ్లి బదిలీలు చేయించుకోవడం రెగ్యులర్ గా జరిగే తతంగం.

సిఫార్సు లేఖల కోసం...

గ‌తంలో జ‌రిగిన బ‌దిలీల్లొ సిపార్సు లేఖ ల‌కు పెద్ద ఎత్తున్న ప్ర‌జా ప్ర‌తినిధులు డ‌బ్బులు వ‌సులు చేశార‌ని పెద్ద ఎత్తున్న ప్ర‌చారం జ‌రిగింది. కానీ ప్రస్తుతం కూడా ఇదే తరహాలో ఆయా మంత్రులకు... వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు సిఫార్సు లేఖల కోసం వస్తున్నారు. అయితే సీఎం స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చిన క్రమంలో చాలా మంది ప్ర‌జా ప్ర‌తినిధులు సిఫార్సు లేఖలు పెద్దగా ఇవ్వలేని సందిగ్ధంలో పడిపోయారు.

ధికారుల చేతివాటం..

సీఎం వార్నింగుతో రాజకీయ నేతల పరిస్థితి ఈ విధంగా ఉంటే.. దీన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కొందరు అధికారులు ప్రయత్నిస్తోన్నట్టు సమాచారం. రాజకీయ జోక్యం సహించేదే లేదని సీఎం చెప్పడంతోపాటుగా.. బదిలీలకు సంబంధించిన కీలక బాధ్యతలను ఆయా శాఖలకు సంబంధించిన అధిపతులకు అప్పజెప్పడంతో కొందరు అధికారులు ఇప్పటికే చేతి వాటం మొదలెట్టేసినట్టు కన్పిస్తోంది.

ఉద్యోగుల ప్రదక్షిణలు...

ఎమ్మెల్యేలు.. నేతల జోక్యం వద్దని చెప్పేయడంతో బదిలీలు వ్యవహరం మొత్తం తామే చేస్తామనే తరహాలో కింది స్థాయి సిబ్బందికి.. ఉద్యోగులకు సంకేతాలు పంపడంతో బదిలీల కోసం ఉద్యోగులు ఆయా శాఖలకు సంబంధించిన హెచ్వోడీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తోన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వైద్యారోగ్యం, రెవెన్యూ, హోం, రిజిస్ట్రేషన్ వంటి శాఖల్లో ఈ తరహా వ్యవహారం మొదలైపోయినట్టు సమాచారం.

ఒకటనుకుంటే.. మరొకటి

రాజకీయ అవినీతిని తగ్గించాలనే దిశగా చంద్రబాబు బదిలీల రాజకీయ జోక్యాన్ని అరికట్టే దిశగా కీలక నిర్ణయం తీసుకుంటే.. ఇది అటు తిరిగి ఇటు తిరిగి ఇది అధికారిక అవినీతికి దారి తీస్తోందనే చర్చ ప్రభుత్వ, రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. రాజకీయ జోక్యాన్ని నివారించడంతోపాటు.. కొందరు అధికారులు చేసే అవినీతి వ్యవహారాల్లోనూ నిఘా పెడితే బాగుంటుందనే భావన వ్యక్తమవుతోంది.

English summary
AP CM Nara Chandrababu Naidu has given a strong warning to his Ministers and MLAs to not to interfere in the issue of employees transfers. On the other side, CM Chandrababu given the entire responsibility to HODs regarding these transfers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X