చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సెంట్రల్ వర్సిటీగా కుప్పం వర్సిటీ: బాబు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

కుప్పం: ద్రావిడ విశ్వవిద్యాలయాన్ని సెంట్రల్‌ యూనివర్సిటీగా తీర్చిదిద్దుతామని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. బుధవారం ద్రావిడ విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్‌ విగ్రహాన్ని సిఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నివిధాలా అనువుగా ఉన్నందువల్లే కుప్పంలో ద్రావిడ విశ్వవిద్యాలయాన్ని అప్పట్లో ఎన్టీఆర్‌ స్థాపించారని అన్నారు.

ఆ తర్వాత తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత కోట్లాది రూపాయల వ్యయంతో భవనాలు నిర్మించి విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేశామని చెప్పారు. ఇతర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక ఇక్కడ తాము ప్రవేశపెట్టిన కోర్సులన్నింటినీ తొలగించి నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ తాను అధికారంలోకి వచ్చాను కాబట్టి, ద్రావిడ విశ్వవిద్యాలయ అభివృద్ధికోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, ప్రత్యేక ప్యాకేజీని ఇస్తానని ప్రకటించారు.

ఇక్కడున్న మూలికా వనంపై ప్రత్యేక శ్రద్ధపెట్టి రామ్‌దేవ్‌బాబా సలహాలతో అభివృద్ధి పరుస్తామని, పరిశోధనా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. కుప్పం వర్సిటీకి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు పీఈఎస్‌ నారాయణ హృదయాలయలో హెల్త్‌కార్డులను ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. ఇక్కడే సోలార్‌ సిస్టమ్‌కు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుప్పానికి పీఈఎస్‌ వైద్య కళాశాల వన్నె తెస్తోందని ప్రశంసించారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ నిర్మాణంలో ఇటువంటి వైద్య సంస్థలు పూర్తి స్థాయిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సమాజ ఆరోగ్య నిర్మాణంతోపాటు, సమాజ సేవలో వైద్య విద్యార్థులు, వైద్యులు భాగస్వాములు కావాలని సూచించారు.

ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ

ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ

ద్రావిడ విశ్వవిద్యాలయాన్ని సెంట్రల్‌ యూనివర్సిటీగా తీర్చిదిద్దుతామని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. బుధవారం ద్రావిడ విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్‌ విగ్రహాన్ని సిఎం చంద్రబాబు ఆవిష్కరించారు.

కుప్పంకు చేరుకున్న బాబు

కుప్పంకు చేరుకున్న బాబు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నివిధాలా అనువుగా ఉన్నందువల్లే కుప్పంలో ద్రావిడ విశ్వవిద్యాలయాన్ని అప్పట్లో ఎన్టీఆర్‌ స్థాపించారని అన్నారు. తర్వాత తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత కోట్లాది రూపాయల వ్యయంతో భవనాలు నిర్మించి విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేశామని చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఇతర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక ఇక్కడ తాము ప్రవేశపెట్టిన కోర్సులన్నింటినీ తొలగించి నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ తాను అధికారంలోకి వచ్చాను కాబట్టి, ద్రావిడ విశ్వవిద్యాలయ అభివృద్ధికోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, ప్రత్యేక ప్యాకేజీని ఇస్తానని ప్రకటించారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఇక్కడున్న మూలికా వనంపై ప్రత్యేక శ్రద్ధపెట్టి రామ్‌దేవ్‌బాబా సలహాలతో అభివృద్ధి పరుస్తామని, పరిశోధనా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. కుప్పం వర్సిటీకి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకువస్తానని హామీ ఇచ్చారు.

చంద్రబాబు

చంద్రబాబు

అంతకుముందు పీఈఎస్‌ నారాయణ హృదయాలయలో హెల్త్‌కార్డులను ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. ఇక్కడే సోలార్‌ సిస్టమ్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుప్పానికి పీఈఎస్‌ వైద్య కళాశాల వన్నె తెస్తోందని ప్రశంసించారు.

English summary
Chief Minister N. Chandrababu Naidu has announced to pursue with due seriousness the process of making Dravidian University a central university.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X