విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జెండా ఊపిన అశోక్: పరుగుపెట్టారు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: భారత్‌లో సంస్థానాలను విలీనం చేయడంలో దివంగత హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చూపిన చొరవ ఎనలేనిదని కేంద్ర పౌరవిమానయాన శాఖా మంత్రి అశోక్‌గజపతిరాజు కొనియాడారు. ఐక్యతతోనే దేన్నైనా సాధించగలమని పటేల్ నిరూపించారన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఐక్యత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

శుక్రవారం ఉదయం విశాఖ ఆర్కే బీచ్‌లో ఐక్యతా రన్‌ను అశోక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్దార్ పటేల్, గురజాడ వంటి నేతలు దేశానికి ఎంతో మేలు చేశారన్నారు. పటేల్ ఆశయసాధనకు అందరూ కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా సర్దార్ జయంతిని ఐక్యతా దినోత్సవంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.

పటేల్ సేవానిరతిని ప్రతీ ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రపంచ దేశాల్లో భారత్ అగ్రగామిగా నిలబడేందుకు ప్రధాని మోడీ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ఎంపీ కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ.. అందరూ ఐక్యతతో మెలగి రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధిబాటలో నిలపాలన్నారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ ఎన్ యువరాజ్, జివిఎంసి కమిషనర్ జానకి, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్‌ఎన్ రాజు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఐక్యతా పరుగు

ఐక్యతా పరుగు

శుక్రవారం ఉదయం విశాఖ ఆర్కే బీచ్‌లో ఐక్యతా పరుగును కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు ప్రారంభించారు.

ఐక్యతా పరుగు

ఐక్యతా పరుగు

భారత్‌లో సంస్థానాలను విలీనం చేయడంలో దివంగత హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చూపిన చొరవ ఎనలేనిదని కేంద్ర పౌరవిమానయాన శాఖా మంత్రి అశోక్‌గజపతిరాజు కొనియాడారు.

ఐక్యతా పరుగు

ఐక్యతా పరుగు

ఐక్యతతోనే దేన్నైనా సాధించగలమని పటేల్ నిరూపించారన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఐక్యత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

ఐక్యతా పరుగు

ఐక్యతా పరుగు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్దార్ పటేల్, గురజాడ వంటి నేతలు దేశానికి ఎంతో మేలు చేశారన్నారు.

ఐక్యతా పరుగు

ఐక్యతా పరుగు

పటేల్ ఆశయసాధనకు అందరూ కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా సర్దార్ జయంతిని ఐక్యతా దినోత్సవంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.

English summary
We have to give a definition to our democracy by living a life that pays tribute to the sacrifices made by the innumerable freedom fighters who won us Independence,” Union Minister of Civil Aviation Ashok Gajapathi Raju said before flagging off the Ekta Run here on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X