వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నంద్యాల ఉపఎన్నికల్లో టెక్నాలజీ: ఏం జరిగినా వెంటనే సమాచారం

నంద్యాల ఉప ఎన్నిక కోసం భారీ భద్రతను, కట్టుదిట్టమైన నిఘాను ఏర్పాటు చేశారు. ఎన్నిక ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నిక కోసం భారీ భద్రతను, కట్టుదిట్టమైన నిఘాను ఏర్పాటు చేశారు. ఎన్నిక ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు.

నంద్యాలలో టిడిపి-వైసిపిల కోసం చెన్నై టెక్కీలు!: రోజా నుంచి జగన్, బాబు దాకా ఇలానంద్యాలలో టిడిపి-వైసిపిల కోసం చెన్నై టెక్కీలు!: రోజా నుంచి జగన్, బాబు దాకా ఇలా

నంద్యాలలో అత్యాధునిక టెక్నాలజీ

నంద్యాలలో అత్యాధునిక టెక్నాలజీ

నంద్యాల ఉప ఎన్నికల్లో ఈసీ అత్యాధునిక టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించుకుంటోంది. డ్రోన్లు, రోబోటిక్ కెమెరాలు, మరికొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక యాప్‌లు ఉపయోగిస్తున్నారు. దేశంలోనే తొలిసారి బాడీ వోర్న్ కెమెరాలతో నిఘా ఉంచారు.

కమాండ్ కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షణ

కమాండ్ కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షణ

పోలింగ్ కేంద్ర పరిసరాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు అత్యాధునిక రోబోటిక్ కెమెరాలు ఇచ్చారు. సమీపంలో ఏదైనా ఆందోళన పరిస్థితి కనిపిస్తే వెంటనే వారు ఫోటోలు తీసి, కమాండ్ కంట్రోల్ రూంకు పంపిస్తారు. నంద్యాల ఎన్నికలు పర్యవేక్షించేందుకు కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. మొత్తం జిపిఎస్ సిస్టం ఉంది.

నియోజకర్గంలో మూడు డ్రోన్లు

నియోజకర్గంలో మూడు డ్రోన్లు

నంద్యాల నియోజకవర్గంలో మూడు డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు. అలాగే, ప్రతి పోలింగ్ స్టేషన్లో బయట కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే, జంక్షన్‌లలోను కెమెరాలు ఉంచారు. కెమెరాలు, డ్రోన్లు ద్వారా కమాండ్ కంట్రోల్ రూంకు కచ్చితమైన విషయాలు వెంటనే అందుతాయి.

వివిపాట్ యంత్రాలు

వివిపాట్ యంత్రాలు

నంద్యాల ఉప ఎన్నికల్లో వీవీపాట్ యంత్రాలు ఉపయోగించారు. వీటితో ఓటును ఎవరికి వేశామో 7 సెకన్ల పాటు చూసుకునే వీలు ఉంది. నంద్యాల నియోజకవర్గం పోలీసుల వలయంలో ఉంది. 2500 మంది పోలింగ్ సిబ్బంది, 3500 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు.

రెచ్చగొట్టే వారిపై నాన్ బెయిలబుల్ వారెంట్

రెచ్చగొట్టే వారిపై నాన్ బెయిలబుల్ వారెంట్

పోలీసులు అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. గ్రామాల పరిధిలో గొడవలు జరుగుతాయని భావించి, అందుకు ముందస్తు చర్యలు తీసుకున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో రెచ్చగొట్టే వారిపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంటుందని హెచ్చరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు ఉంచారు.

English summary
Drones deployed in sensitive areas of the Nandyal assembly constituency as part of security measures being put in place for voting day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X