ఏంటీ ‘ప్రతినాయకుడు’?: ‘ఆంధ్రజ్యోతి’కి ఎన్నికల సంఘం నోటీసు

Subscribe to Oneindia Telugu

కర్నూలు: ఆంధ్రజ్యోతి పత్రికకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. నంద్యాల ఓటర్లను ప్రభావితం చేసే విధంగా అభ్యంతరకర వ్యాఖ్యలతో ఆగస్టు 7న కర్నూలు జిల్లా టాబ్లాయిడ్‌లో ప్రచురించిన కథనానికి సమాధానం చెప్పాలంటూ 'ఆంధ్రజ్యోతి'కి జిల్లా ఎన్నికల సంఘం అధికారి, కలెక్టర్ ఎస్ సత్యనారాయణ మంగళవారం నోటీసులు జారీ చేశారు.

'ప్రతినాయకుడు' శీర్షికతో ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనం ప్రెస్ కౌన్సిల్, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నట్లు మీడియా సర్టిఫికేట్ అండ్ మానిటరింగ్ కమిటీ నిర్ధారించింది.

EC issues notice to andhrajyothy daily

ఈ క్రమంలో ప్రజాప్రాతినిథ్య చట్టం ఆర్‌పీ యాక్ట్ సెక్షన్ 127ను ఉల్లంఘించడమేనని పేర్కొంటూ ఆంధ్రజ్యోతి యూనిట్ మేనేజర్‌కు కలెక్టర్ నోటీసులు పంపించారు. ఈ కథనాన్ని పెయిడ్ న్యూస్‌గా భావిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రెండ్రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

Nandyal By-poll : Chandrababu Naidu Tense Over Elections | Oneindia Telugu

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Election Commission issued notice to andhra jyothy daily on Tuesday.
Please Wait while comments are loading...