వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కు ఈసీ షాక్: 'కాల్చి చంపడంపై' నోటీసులు, 48 గంటల్లో వివరణ ఇవ్వకుంటే

నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభలో వైసిపి అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయనకు చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. ఇప్పటికే టిడిపి నేతలు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు.

|
Google Oneindia TeluguNews

కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభలో వైసిపి అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయనకు చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. ఇప్పటికే టిడిపి నేతలు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు.

జగన్‌కు ఈసీ షాక్

జగన్‌కు ఈసీ షాక్

అదే సమయంలో జగన్‌కు మరో షాక్ తగిలింది. నంద్యాల బహిరంగ సభలో జగన్ చేసిన వ్యాఖ్యలపై నివేదిక సమర్పించాలని ఎన్నికల సంఘం శనివారం ఎన్నికల రిటర్నింగ్ అధికారిని ఆదేశించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారి భన్వర్ లాల్ ఆదేశాలు జారీ చేశారు.

Recommended Video

Chandrababu Fixed YS Jagan And Pawan Kalyan For 2019 Polls
సీఈసీ సూచనతో చర్యలు!

సీఈసీ సూచనతో చర్యలు!

ముఖ్యమంత్రి చంద్రబాబును నడిరోడ్డుపై నిలబెట్టి కాల్చేయాలని జగన్ రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించడాన్ని తప్పుబడుతూ టిడిపి నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఈసీ స్పందించింది. రిటర్నింగ్ అధికారి ఇచ్చిన నివేదికని కేంద్ర ఎన్నికల సంఘానికి (సీఈసీ) పంపిస్తామని, ఆ తర్వాత సీఈసీ సూచనల మేరకే చర్యలు తీసుకుంటామని భన్వర్ లాల్ స్పష్టం చేశారని తెలుస్తోంది.

48 గంటల్లో వివరణ

48 గంటల్లో వివరణ

జగన్ చేసిన వ్యాఖ్యలపై 48 గంటల్లో వివరణ కావాలని ఉప ఎన్నికల ఎన్నికల రిటర్నింగ్ అధికారికి, జిల్లా జాయింట్ కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. జగన్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లయితే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కూడా ఆదేశించింది.

జగన్‌కు నోటీసులు

జగన్‌కు నోటీసులు

ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో రిటర్నింగ్ అధికారి... జగన్‌కు నోటీసులు జారీ చేశారు. 48 గంటల్లోగా స్పందించాలని అందులో సూచించారు. ఈ మెయిల్, స్పీడ్ పోస్ట్ ద్వారా నోటీసులు ఇచ్చారు. వివరణ ఇవ్వకుంటే చర్యలు తీసుకోనున్నారు. నంద్యాల బహిరంగ సభలో జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సీఎం అంటారా, ముఖ్య కంత్రీ అంటారా అని, దొంగ పాలనా ప్రజా పాలనా అని, బాబును నడిరోడ్డుపై కాల్చి చంపినా తప్పులేదని వ్యాఖ్యానించారు.

English summary
Election Commisstion seek report on YSR Congress Party chief YS Jaganmohan Reddy's comments on AP CM Nara Chandrababu Naidu in Nandyal public meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X