హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ఆస్తుల కేసు: రూ. 216.18 కోట్ల రాంకీ ఫార్మా ఆస్తుల జప్తు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో రాంకీ ఫార్మా ఆస్తులను ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడి) అటాచ్‌మెంట్ చేసింది. శుక్రవారం నాడు రూ. 216.18 కోట్ల రాంకీ ఫార్మా ఆస్తులను ఈడి జప్తు చేసింది.

కాగా, జగన్‌ ఆస్తులకు సంబంధించి గత కొన్ని రోజులుగా ఈడీ దూకుడు ప్రదర్శిస్తోంది. రాంకీ గ్రూప్‌కు విశాఖ ఫార్మా సిటీలో సుమారు 914 ఎకరాల భూమిని (వైఎస్‌ హయాంలో) కేటాయించారు. జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మా సిటీలో కేటాయించడం జరిగింది.

ED attaches Ramky Pharma City properties in money laundering case

ఈ భూములకు సంబంధించి గ్రీన్‌ బెల్ట్‌ ఏరియా పేరిట మినహాయింపు కూడా అప్పటి ప్రభుత్వం ఇచ్చింది. తద్వారా రాంకీ గ్రూప్‌ భారీగా లబ్ది పొందింది. ప్రతిగా జగన్‌కు సంబంధించిన సంస్థల్లో రాంకీ గ్రూప్‌ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. జగతి పబ్లికేషన్స్‌లో గానీ ఇతర గ్రూప్‌ల్లో గానీ ఆ కంపెనీ పెట్టుపడులు పెట్టింది. ఇది సీబీఐ విచారణలో వెల్లడైన విషయం తెలిసిందే. దీన్ని సీబీఐ చార్జిషీట్‌లో కూడా నమోదు చేసింది. దాని ఆధారంగానే ఇప్పుడు మనీ ల్యాండరింగ్‌ కేసును ఈడి అధికారులు నమోదు చేసి, ఆస్తులను జప్తు చేశారు.

గతంలో కూడా వైయస్ జగన్ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) రాంకీ గ్రూప్‌నకు చెందిన 143.74 కోట్ల రూపాయల స్థిర, చరాస్తులను అటాచ్ చేసిన విషయం తెలిసిందే.
వీటిలో రాంకీ ఫార్మా సిటీకి సంబంధించిన 135.46 కోట్ల రూపాయల స్థలంతోపాటు మ్యూచువల్ ఫండ్స్ లోని 3.20 కోట్ల రూపాయల డిపాజిట్లు, జగతి పబ్లికేషన్స్‌లోని 10 కోట్ల రూపాయల ఇన్వె స్ట్‌మెంట్‌ను ఇడి జప్తు చేసింది.

English summary
The Enforcement Directorate has attached properties worth about Rs. 216 crore belonging to Ramky Pharma City India Limited of Ramky Infra Limited, in the YS Jagan Mohan Reddy assets case under the Prevention of Money Laundering Act.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X