వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరోసారి జగన్ ఆస్తులను జప్తు చేసిన ఈడి: రూ.47 కోట్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) మరోసారి జప్తు చేసింది. ఈసారి ఆయనకు చెందిన 47 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తలను జప్తు చేసింది. ఇంతకు ముందు ఈడి జగన్‌కు చెందిన రూ.863 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేసింది.

జగన్‌పై, తదితరులపై సిబిఐ 11 చార్జిషీట్లను సిబిఐ కోర్టులో దాఖలు చేసింది. ప్రస్తుతం జప్తు చేసిన ఆస్తులు పెన్నా సిమెంట్స్ చార్జిషీట్ వ్యవహారానికి సంబంధించివి. జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, జననీ ఇన్‌ఫ్రా మిషనరీలతో పాటు ఆస్తులను ఈడి జప్తు చేసింది.

ED attaches YS Jagan properties once again

2013 సెప్టెంబర్‌లో పెన్నా సిమెంట్స్‌పై సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్ ఆధారంగా ఈడి దర్యాప్తు చేపట్టింది. పెన్నా సిమెంట్స్ నుంచి జగన్ కంపెనీల్లోకి 68 కోట్ల రూపాయలు మళ్లినట్లు ఈడి గుర్తించింది. మనీలాండరింగ్ కేసులో ప్రస్తుతం ఈసి ఆయన ఆస్తులను జప్తు చేసింది.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) ఇంతకు ముందు భారీ జప్తునకు దిగింది. వైయస్ జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి వాన్‌పిక్ వ్యవహారంలో రూ. 863 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను ఈడి జప్తు చేసింది. జగన్ ఆస్తులతో పాటు పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ఆస్తులను జప్తు చేస్తూ ఈడి ఆదేశాలు జారీ చేసింది.

జగన్‌కు చెందిన కార్మైల్ ఆసియా, జగతి పబ్లికేషన్స్ ఆస్తులను జప్తు చేసింది. నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన సుగుణి కన్‌స్ట్రక్షన్స్, బీటా అవెన్యూస్, జీ2 కార్పోరేట్, అల్ఫా విల్లాస్ తదితర సంస్థలకు చెందిన ఆస్తులను జప్తు చేసినట్లు తెలుస్తోంది.

ఈడి జప్తు చేసిన ఆస్తుల్లో జగన్‌కు చెందిన ఇందిరా టెలివిజన్ వంద కోట్ల షేర్లు ఉన్నాయి. జగతి పబ్లికేషన్స్‌కు చందిన 366 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. రూ.11 కోట్ల విలువ చేసే జగన్ వ్యక్తిగత ఆస్తులను జప్తు చేసింది. సండూర్‌ పవర్‌లోని 57 కోట్ల జగన్ వాటాలను కూడా జప్తు చేసింది. నిమ్మగడ్డకు చెందిన సుగుణి కన్‌స్ట్రక్షన్‌కు చెందిన 7 కోట్ల రూపాయల ఆస్తులను, భూమిని జప్తు చేసింది.

గిల్‌క్రిస్ట్ ఇన్వెస్ట్‌మెంట్‌కు చెందిన 44 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను, సిలికాన్ బిల్డర్స్‌కు చందిన 44 కోట్ల రూపాయల ఆస్తులను ఈడి జప్తు చేసింది. వాన్‌పిక్ పోర్టుకు చెందిన 561 ఎకరాల భూమిని, వాన్‌పిక్ ప్రాజెక్టుకు చెందిన 865 ఎకరాల భూమిని జప్తు చేస్తూ ఈడి ఆదేశాలు జారీ చేసింది.

English summary
The Enforcement Directorate has attached properties belonging to Jagan Mohan Reddy worth Rs 47 crore. This attachment comes after the Enforcement Directorate had a few months back attached properties of Jagan worth Rs 863 crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X