వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకేష్ మంత్రి పదవి వెనుక..! 'ఫ్యామిలీ ఎఫెక్ట్'

|
Google Oneindia TeluguNews

విజయవాడ : చేతిలో పగ్గాలున్నప్పుడే రాజకీయ వారసులను తెరమీదకు తీసుకురావడం.. ఇండియన్ పాలిటిక్స్ లో ఎప్పుడూ ఉన్న అంశమే. అధికారంలో ఉన్నప్పుడే.. వారసులకు సేఫ్ బెర్త్ ఖాయం చేయడం.. ఇప్పటి నేతల్లో చాలామంది చేస్తున్న పనే.

ఇక చాన్నాళ్లుగా తన వారసత్వ అస్త్రాన్ని సంధించడానికి తటపటాయిస్తూ వస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు కూడా తనయుడు లోకేష్ ను రాజకీయాల్లో యాక్టివ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. శుక్రవారం నాటి మీడియా సమావేశంతో.. టీడీపీ మంత్రివర్గంలోకి లోకేష్ ఎంట్రీ ఖాయమన్న సంకేతాలిచ్చారు చంద్రబాబు. ఈ సందర్బంగా.. లోకేష్ పనితీరును మెచ్చుకున్న ఆయన, లోకేష్ కు అవకాశమిస్తే మరింత రాటుదేలుతాడన్న తరహాలో చేసిన వ్యాఖ్యలు.. లోకేష్ మంత్రి పదవి ఊహాగానాలకు మరింత ఊతమిచ్చాయి.

Family force is also a reason for 'Lokesh Ministry'

కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్లే :

లోకేష్ ను మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న చంద్రబాబు ఆలోచన వెనుక.. ఆయన కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన ఒత్తిడి కూడా ఓ కారణంగా తెలుస్తోంది. ఓవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ రాజకీయాల్లో దూసుకుపోతుంటే.. లోకేష్ ని మాత్రం క్రియాశీలక రాజకీయాల్లోకి తీసుకురావడంలో ఇంకా జాప్యం జరుగుతుండడంతో కుటుంబ సభ్యుల్లో కూడా కొంత అసంత్రుప్తి నెలకొన్నట్లుగా సమాచారం.

దీంతో అటు బాలకృష్ణ కుటుంబం, ఇటు సొంత కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి మేరకు లోకేష్ ను ఎలాగైనా మంత్రివర్గంలోకి తీసుకురావాలని చంద్రబాబు యోచిస్తున్నారట. అసెంబ్లీ సమావేశాల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో.. లోకేష్ త్వరలోనే మినిస్టరీ చేపట్టడం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి.

రాహుల్ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే!!

అధికారంలో ఉన్నప్పుడు కాకుండా.. పార్టీకి పూర్తి ప్రతికూలత ఏర్పడిన పరిస్థితుల్లో రాహుల్ ను తెరపైకి తెచ్చి కాంగ్రెస్ బోల్తా పడింది. యూపీఏ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో రాహుల్ ను ఓ మాస్ లీడర్ గా తీర్చి దిద్దడంలో పార్టీ విఫలమైంది. ఇప్పుడున్న ప్రతికూలతలను చేధించుకుని కాంగ్రెస్ ను నిలబెట్టడం.. రాహుల్ పగ్గాలు చేపట్టడమన్నది ఎంత కష్టంతో కూడుకున్నదో అందరికీ తెలిసిందే.

ఇలాంటి పరిస్థితి భవిష్యత్తులో లోకేష్ కు ఎదరుకాకుడదన్న ఉద్దేశంతోనే.. లోకేష్ బెర్త్ కోసం చంద్రబాబు ఇప్పటినుంచే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టినట్లుగా సమాచారం. అందుకే 2019లోనే లోకేష్ ను పూర్తి స్థాయి రాజకీయాల్లోకి తీసుకురావాలన్నా ఆలోచనను సైతం పక్కనబెట్టి, ఇప్పటినుంచే క్రియాశీలక రాజకీయాల్లో లోకేష్ ను యాక్టివ్ చేసే పనిలో పడ్డారట చంద్రబాబు.

English summary
Its an interesting buzz in AP political circle that Family force is also a reason for lokesh entry into active politics of TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X