కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమ్మాయిని వ్యభిచారంలోకి నెట్టిన ఫ్యామిలీ అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Family members arrested for abetting a girl
కర్నూలు: గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన ఓ యువతిని వ్యభిచార కూపంలోకి దించి వేధించిన కేసులో కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఓ కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాపట్లకు చెందిన యువతి నంద్యాలకు వచ్చి హాస్టల్‌లో ఉంటూ ఓ దుకాణంలో సేల్స్‌గర్ల్‌గా జీవనం సాగిస్తోంది.

యూసుఫ్‌ ఆయన భార్య హసీనా, కుమార్తెలు రేష్మి, రిజ్వానా ఆ యువతిని తమ ఇంట్లో పేయింగ్‌ గెస్టుగా ఉండమని చెప్పి, వ్యభిచార కూపంలోకి దించినట్లు ఎస్‌ఐ లక్ష్మయ్య తెలిపారు. సదరు యువతి నెల క్రితం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

కానిస్టేబుళ్ల సస్పెన్షన్

కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లను ఎస్పీ రవికృష్ణ వీఆర్‌కు పంపారు. ఓ కేసులో రిమాండ్‌లో ఉన్న ముగ్గురు నిందితులను మంగళవారం కోర్టులో హాజరుపరిచి తిరిగి ఆళ్లగడ్డ సబ్‌జైల్‌కు తీసుకెళ్తుండగా నిందితులతో కలిసి బార్‌కు వెళ్లడం వివాదాస్పదం అయ్యింది. దీంతో హెడ్‌కానిస్టేబుల్‌ గురుప్రసాద్‌, కానిస్టేబుల్‌ మహబూబ్‌ బాషాను ఎస్పీ సస్పెండ్‌ చేశారు.

అధికారిపై బదిలీ వేటు

కర్నూలు జిల్లా విద్యుత్‌ సంస్థలో ప్రతి పనికీ మామూళ్లు డిమాండ్‌ చేస్తున్నారఏ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇటీవల జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఎంఎల్‌ఏలు అధికారులు పనితీరుపై ధ్వజమెత్తారు. పనులు నాసిరకంగా జరుగుతున్నాయని, ప్రతి పనికీ వేలాది రూపాయలు డిమాండ్‌ చేస్తున్నారని ఆరోపించారు. ఆ సభలో ఉన్న ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కూడా ఎస్‌ఈపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఎస్‌ఈ బనప్పపై తొలివేటు పడిందని అధికార వర్గాలు తెలిపారు. ఎస్‌ఈ బసప్పను ఏకంగా సీఎండీ ప్రధాన కార్యాలయం తిరుపతికి బదిలీ చేశారు.

సోమవారం కొత్తగా వచ్చిన ఎస్‌ఈ రామాంజనేయులు పరిపాలనను గాడిలో పెడ్తానని, వినియోగదారుల ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. ఎస్‌ఈ కార్యాలయంలో కీలకంగా ఉన్న ఒక డీఈ చేయి తడపందే ఫైలుపై సంతకం పెట్టడం లేదని, ఈయన వల్లే ఎస్‌ఈపై బదిలీ వేటు పడిందని ఎస్‌ఈ కార్యాలయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. త్వరలో ఈ డీఈపై కూడా వేటు పడబోతోందని విశ్వసనీయ సమాచారం.

English summary
A family has been arrested for abetting a girl to do prostitution at Nandyala in Kurnool district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X