అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

''పప్పు కాక ఇంకేమనాలి? ఉప ఎన్నికలకు సిద్దమేనా''? ''పోరాడండి అండగా ఉంటా''

జయంతికి, వర్థంతికి తేడా తెలియదు, పంచాయితీరాజ్ మంత్రిగా ఉంటూ తాగునీటి సమస్యను సృష్టించడమే లక్ష్యమంటారు. రాష్ట్రంలో ఎన్ని అసెంబ్లీ సీట్లున్నాయో కూడ తెలియదు. వచ్చే ఎన్నికల్లో టిడిపిని 200 సీట్లలో గెలిపిం

By Narsimha
|
Google Oneindia TeluguNews

అనంతపురం: జయంతికి, వర్థంతికి తేడా తెలియదు, పంచాయితీరాజ్ మంత్రిగా ఉంటూ తాగునీటి సమస్యను సృష్టించడమే లక్ష్యమంటారు. రాష్ట్రంలో ఎన్ని అసెంబ్లీ సీట్లున్నాయో కూడ తెలియదు. వచ్చే ఎన్నికల్లో టిడిపిని 200 సీట్లలో గెలిపించాలని కోరుతాడు. ఇలా మాట్లాడే వ్యక్తిని పప్పు అనకుండా ఇంకేమనాలి అంటూ వైఎస్ఆర్ సిపీ మహిళా విభాగం అధ్యక్షురాలు రోజా విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ శాఖ మంత్రి లోకేష్ పై రోజా నిప్పులు చెరిగారు. అనంతపురం జిల్లా చెన్నెకొత్తపల్లిలో జరిగిన రైతు పోరుబాట కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

టిడిపి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సుఖ, సంతోషాలు లేకుండా పోయాయని ఆమె చెప్పారు. ఎలాంటి అర్హతలు లేని వారిని మంత్రివర్గంలో ఎలా తీసుకొన్నారని రోజా ప్రశ్నించారు.

ఏ విషయంపై కూడ అవగాహానలేని వ్యక్తి ప్రజలకు ఏం సేవ చేస్తారని ఆమె పరోక్షంగా లోకేష్ పై విమర్శలు గుప్పించారు. వర్థంతి, జయంతికి కూడ తేడా తెలియనివారిని ఏమనాలి అంటూ ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు.

పప్పు కాకుండా ఇంకేమనాలి?

పప్పు కాకుండా ఇంకేమనాలి?

సంబంధం లేని విషయాల గురించి మాట్లాడడం, జయంతికి, వర్థంతికి తేడా తెలియకపోవడం, ఇష్టమొచ్చినట్టు మాట్లాడేవారిని పప్పు కాకుండా ఇంకా ఏమనాలి అంటూ ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ శాఖ మంత్రి లోకేష్ ను ఉద్దేశించి రోజా విమర్శలు గుప్పించారు.

గూగుల్ లో పప్పు అని కంపోజ్ చేస్తే పప్పు దినుసులతో పాటు లోకేష్ ఫోటోలు వస్తున్నాయన్నారామె. చంద్రబాబునాయుడు కొడుకు కావడం మినహా లోకేష్ కు ఏం అర్హతలున్నాయని ఆమె ప్రశ్నించారు. దద్దమ్మ మంత్రిని ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నారని ఆమె దుయ్యబట్టారు.

టిడిపికి జనాధరణ పెరిగితే ఉప ఎన్నికలకు సిద్దం కావాలి

టిడిపికి జనాధరణ పెరిగితే ఉప ఎన్నికలకు సిద్దం కావాలి

రాష్ట్రంలో టిడిపికి జనాధరణ పెరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెబుతున్నారని, అదే నిజమైతే వైసీపీ నుండి టిడిపిలోకి ఫిరాయించిన 21 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు సిద్దం కావాలని రోజా సవాల్ విసిరారు. మూడేళ్ళ పాలనలో ఒక్క గడపకైనా మేలు జరిగిందా అని ఆమె ప్రశ్నించారు.పనులు లేక ప్రజలు వలసవెళ్తున్నారని ఆమె చెప్పారు. వైఎస్ విగ్రహాలను కూల్చివేస్తే సహించబోమన్నారు.

నిర్భయంగా పోరాడండి

నిర్భయంగా పోరాడండి


సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రశ్నిస్తున్న వారిని ఉక్కుపాదంతో అణచివేయాలని టిడిపి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైసీపి అధినేత జగన్ ఆరోపించారు. సోషల్ మీడియా సైనికులకు తాను అందగా ఉంటానని చెప్పారు.ఏపి ముఖ్యమంత్రి చేస్తున్న అప్రజాస్వామిక విదానాలపై అన్ని మీడియాల ద్వారా ప్రజాస్వామికంగా ప్రతిఘటించాలని ఆయన కోరారు.

టిడిపి అరాచకాలను ఎదిరించండి

టిడిపి అరాచకాలను ఎదిరించండి


తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి అనుబంధంగా ఉన్న సోషల్ మీడియా విభాగం గత కొన్నేళ్ళుగా తనపై, మహానేత వైఎస్ఆర్ పై అత్యంత హేయంగా, అసత్య ప్రచారాలను చేస్తోందని ఆయన చెప్పారు. ఈ ప్రచారాన్ని వైఎస్ అభిమానులు సమర్థంగా తిప్పికొట్టారని ఆయన చెప్పారు. దీంతో వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా కార్యాలయంపై దాడికి దిగారని జగన్ చెప్పారు.

ప్రజాస్వామ్యంగా తిరగబడాలి

ప్రజాస్వామ్యంగా తిరగబడాలి

తాను తప్పు చేసినా ఒప్పు. ఇతరులు ఒప్పు చేసినా తప్పే . అధికార మదం తలకెక్కి చంద్రబాబునాయుయడు ప్రవర్తిస్తున్నాడని జగన్ ఆరోపించారు.
ప్రజల గొంతుగా తమ వాణిగా సోషల్ మీడియా ద్వారా చేస్తున్న ప్రతిఘటనను మరింత శక్తివంతంగా మార్చాలని జగన్ కోరారు.సోషల్ మీడియాకు సంకెళ్ళు వేయాలన్న చంద్రబాబు ప్రయత్నాన్ని తిప్పికొట్టాని, అదే సోషల్ మీడియాను అస్త్రంగా చేసుకొని చంద్రబాబు అప్రజాస్వామిక విధానాలపై పోరాడాలని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.

English summary
Fight against Andhra Pradesh chief minister activities said Ysrcp chief Ys Jagan .fight continues on social media for people he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X