విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కప్పరాడ కొండపై ఎగిసిన మంటలు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: విశాఖపట్నం పరిదిలోని కప్పరాడ కొండపై శుక్రవారం సాయంత్రం అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. తుఫాను అనంతరం కొండపై గల చెట్లు, మొక్కలు పడిపోయి ఎండిపోయాయి. దీంతో మంటలు ఎగిసిపడ్డాయి.

మంటలు ఎగిసిపడిన ప్రాంతంలో పదునైన రాళ్లు ఉండడంతో ఏ రాయి పేలి తమ ఇళ్లపై పడుతుందోనని ప్రజలు భీతిల్లారు. కొండ చివరి భాగంలో మంటలు చెలరేగడంతో అక్కడికి ఏ వాహనం కూడా చేరుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఎవరో ఆకతాయి ఎండిన ఆకులకు నిప్పు పెట్టి ఉంటాడని, దాంతోనే మంటలు చెలరేగాయని అనుమానిస్తున్నారు.

కొండ దిగువన జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనచోదకులు నిలిచిపోయారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కంచరపాలెం దరి కప్పరాడ కొండపై అంటుకున్న మంటలు పెద్దవి కావడంతో విషయాన్ని తెలుసుకున్న జిల్లా మంత్రి గంటా శ్రీనివాస రావు రాత్రి 9 గంటల ప్రాంతంలో సంఘటనా స్థలాన్ని సందర్శించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న నాలుగు అగ్నిమాపక శకటాలు మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించాయి.

ఎగిసిపడిన మంటలు

ఎగిసిపడిన మంటలు

మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది ఇబ్బందిని గమనించిన మంత్రి గంటా శ్రీనివాస రావు నేవీ హెలికాప్టర్లను రప్పించి, పైనుంచి మంటలపై నీళ్లు చల్లించాలని అధికారులను ఆదేశించారు.

ఎగి్సిపడిన మంటలు

ఎగి్సిపడిన మంటలు

కొండ పరిసర ప్రాంతాల్లో ఉంటున్నవారిని అప్రమత్తంగా ఉండాలని మంత్రి గంటా శ్రీనివాస రావు సూచించారు. అవసరమైతే చుట్టుపక్కల ప్రాంతాలవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రి ఆదేశించారు.

ఎగిసిపడిన మంటలు

ఎగిసిపడిన మంటలు

శుక్రవారం రాత్రి పది గంటల సమయానికి మంటలు కొంత వరకు అదుపులోకి వచ్చాయి. నగరం నుంచి మధురవాడ వెళ్లే జాతీయ రహదారికి సమీపంలోని ఎండాడ కంబాల కొండ ఎదురుగా చెట్లకు నిప్పు అంటుకోవడంతో మంటలు చెలరేగాయి.

ఎగిసి పడిన మంటలు

ఎగిసి పడిన మంటలు

మంటలు కంబాలకొండకు తాకితే ఆర్పడం ఎవరి తరం కూడా కాదని ప్రజలకు భీతిల్లారు. మొత్తం మీద అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

ఎగిసిపడిన మంటలు

ఎగిసిపడిన మంటలు

కప్పరాడ కొండపై ఎగిసిపడిన మంటలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

ఎగిసిపడిన మంటలు

ఎగిసిపడిన మంటలు

మంటలను ఆర్పడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు కలెక్టర్‌ను ఆదేశించారు. చెట్లకు నిప్పు పెట్టినవారిని గుర్తించి అరెస్టు చేయాలని ఆదేశించారు.

English summary
Fire accident took place on Kapparada Konda in Visakhapatnam on friday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X